Prema Entha Madhuram August 10th: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: మాన్సీ పీక నొక్కిన అను, పిల్లలను కాపాడే ప్రయత్నంలో ఆర్య?
అను తన బాబును మాన్సీనే రౌడీలచే కిడ్నాప్ చేయించిందని తన పీక నొక్కటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Prema Entha Madhuram August 10th: కారులో అంజలి, నీరజ్ వెళ్తుండగా దారిలో మదన్ కనిపించడంతో వెంటనే మదన్ దగ్గరికి వెళ్లి లాగి గట్టిగా చంప పగలగొడుతుంది అంజలి. ఎందుకు ఇలా చేశావు తప్పించుకోవడానికే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నావు కదా అనటంతో నా ఫోన్ ఆన్ లోనే ఉంది అని చూపిస్తాడు మదన్. టెండర్ కోడ్ ఎవరికి లీక్ చేశావు.. ఎందుకిలా చేశావు అంటూ గట్టిగా అడుగుతుంది.
మదన్ మొదట తను ఏమీ చేయలేదని అబద్ధం చెప్పగా.. వెంటనే నీరజ్ వీడియో చూపిస్తాడు. దాంతో మదన్ కనిపెట్టేసారా అంటూ మాట్లాడుతాడు. వెంటనే నీరజ్ ఈ విషయం దాదాకు కూడా తెలిసింది. ఇక నిన్ను అసలు వదిలిపెట్టడు అని అంటాడు. అంజలి కూడా ఎదురుగా ఉండి శత్రు పోరాటం చేస్తే ఆర్య సార్ క్షమించనైన క్షమిస్తాడు కానీ.. నమ్మించి మోసం చేస్తే అసలు ఊరుకోడు అని అంటుంది.
ఇక మదన్ మాత్రం ఏమాత్రం భయపడకుండా ఆర్యకు నష్టం వస్తుంది అని.. రోజులు లెక్క పెట్టుకోమని అనడంతో వెంటనే నీరజ్ కోపంగా అతని గొంతు నొక్కుతాడు. ఇక అంజలి ఆపి తిరిగి మదన్ కి సవాల్ విసిరి అక్కడి నుంచి నీరజ్ ను తీసుకొని వెళ్తుంది. ఇక మదన్ తన దగ్గర ఉన్న ఆవిడ చాలా డేంజర్ అని ఆర్యను అసలు వదలదు అని అనుకుంటాడు.
ఇక రేష్మ పాపని పట్టుకొని ఏడుస్తూ ఉండగా అక్కడికి ఆర్య, జిండే వస్తారు. ఇక జిండే సిసి ఫుటేజ్ కోసం చుట్టుపక్కల వెతకడానికి వెళ్తాడు. ఏం జరిగింది అని ఆర్య అడగటంతో జరిగిన విషయం మొత్తం చెబుతుంది రేష్మ. భాను ఎక్కడా అని అడగటంతో తను కిడ్నాప్ కారి వెనుకాలే వెళ్ళిపోయింది అని.. దయచేసి బాబుని కాపాడే బాధ్యత మీదే అని ఆర్యను బ్రతిమాలుతుంది.
అదే సమయంలో అక్కడికి అను, ప్రీతి రాగ వెంటనే అను ఆర్య ని చూసి దగ్గరికి వెళ్లి ఎలాగైనా తన బాబును కాపాడమని ఏడుస్తుంది. అప్పుడే జిండే వచ్చి సిసి ఫుటేజ్ లో ఆ కిడ్నాపర్స్ పేస్ కనిపించలేదని కార్ నెంబర్ మాత్రం ఐడియా ఉందని చెప్పడంతో వెంటనే ఆర్య వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇక అను మాన్సీ నే కిడ్నాప్ చేయించిందేమో అని మాన్సీ దగ్గరికి వెళ్లి నా బాబుని నాకు తిరిగి ఇచ్చేసేయ్ అంటూ బ్రతిమాలుతూ ఉంటుంది అను.
కానీ మాన్సీ తనకు ఏమీ తెలియదని.. కావాలంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమని అంటుంది. ఇక అను మాన్సీ మాటలు నమ్మకపోగా తన గొంతు గట్టిగా పట్టుకొని అడుగుతుంది. వెంటనే ప్రీతి వెనక్కి లాగుతుంది. మాన్సీ మాత్రం తనకి ఏమీ తెలియదని చెప్పటంతో.. ప్రీతి అనుని అక్కడి నుంచి తీసుకొని వెళ్తుంది.
మరోవైపు కిడ్నాపర్లు తన బాయ్ దగ్గరికి వచ్చి అను బాబుని ఇస్తారు. ఇక పిల్లలందరినీ ఉదయాన్నే వేరే దేశానికి పంపించడానికి ఫోన్లో బేరం ఆడుతూ ఉంటాడు. మరోవైపు ఆర్య పోలీస్ వాళ్ళను పిలిపించి కిడ్నాపర్ల గురించి చర్చలు చేస్తుంటాడు. అందరి పిల్లల్ని కాపాడాలని అంతేకాకుండా ఆ కిడ్నాపర్లను కూడా పట్టుకోవాలి అని అంటాడు. ఇక శారదమ్మ బాధపడుతూ అంజలితో భాను ఎంత బాధ పడుతుందో ఒకసారి తనకి ఫోన్ చేయమని అంటుంది.
also read it : Janaki Kalaganaledhu August 9th: 'జానకి కలగనలేదు' సీరియల్: వెన్నెల ఇష్టపడిన అబ్బాయితో పెళ్లిచూపులు, అనుమానంలో జ్ఞానంబ?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial