Prema Entha Madhuram June 22th: మాన్సీ పని అవుట్, అను ఇంటికి వెళ్లి షాకైన ఆర్య?
మాన్సీ యే అసలు కారకురాలు అని తెలియటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Prema Entha Madhuram June 22th: నకిలీ జోగమ్మ మాన్సీ వైపు చూపిస్తూ ఈమెనే అలా నటించమని చెప్పింది అని అంటుంది. దాంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇక మాన్సీ మరింత భయపడిపోతుంది. వెంటనే నీరజ్ మాన్సీ పై ఫైర్ అవుతాడు. వదినమ్మని దూరం చేయడానికి ఇలా చేసావా అని గట్టిగా అడుగుతూ ఉంటాడు. అప్పుడే అంజలి అను కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోవటానికి ఈవిడే కారణం ఉండొచ్చు అని అనుమానం పడుతుంది. దాంతో మాన్సీ మరింత భయపడుతూ కనిపిస్తుంది.
ఇక అంజలి నకిలీ జోగమ్మని అడగటంతో హాస్పిటల్లో కూడా మొదటిసారి వేషం వేయించింది అని జరిగిన విషయం మొత్తం చెబుతుంది. అను వెళ్లడానికి కూడా మాన్సీ కారణమని తెలియటంతో అందరూ కోపంతో కనిపిస్తారు. ఇక శారదమ్మ కోపాన్ని చూసి వెంటనే మాన్సీ ఏదో ఆ విషయంలో చేశాను సారీ అని చెబుతుండగా పగలగొడుతుంది.
నా కోడలు ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కారణం అయ్యావు అని మేము ఏం అన్యాయం చేశాము నీకు అంటూ గట్టిగా నిలదీస్తుంది. దాంతో మాన్సీ నా తర్వాత ఇంట్లోకి వచ్చిన అను ని ప్రతి విషయంలో నెత్తిన పెట్టుకొని చూసారు. నీరజ్ రెండో పెళ్లి చేసుకుంటే కూడా యాక్సెప్ట్ చేశారు నాకు అన్యాయం కాదా అని అంటుంది.
వెంటనే ఆర్య కోపంతో రగిలిపోయి నువ్వు ఎన్ని అన్యాయాలు చేస్తున్న ఊరుకున్నాను అని జరిగిన అన్యాయాల గురించి మాట్లాడుతాడు. ఇక అను, బిడ్డల గురించి మాట్లాడుతూ నిన్ను ఎప్పటికీ క్షమించేది లేదు అని వెంటనే నీరజ్ తో మాన్సీ ఈ ఇంట్లో కనపడదు అని వెంటనే పంపించు అని అనటంతో నీరజ్ పైకి వెళ్తాడు. ఇక జెండే తో అనుని తీసుకురావడానికి వెళ్తాడు.
తర్వాత నీరజ్ మాన్సీ లగేజ్ తీసుకొచ్చి మెడపట్టి బయటికి గెంటేస్తాడు. ఇక అనుని వెతకడంతో అను ఎక్కడ లేదని తెలియడంతో బాధపడతారు. అదే సమయంలో అను తీసుకున్న బొమ్మలావిడ అక్కడికి వచ్చి పిల్లల కోసం బొమ్మలు తీసుకోమని అడుగుతుంది. ఇక ఆర్య వద్దని.. ఆ తర్వాత వెంటనే తనకు అను ఫోటో చూపించి ఈమెను ఎక్కడైనా చూసావా అని అడుగుతాడు.
దాంతో తను ఇందాకే ఈవిడ బొమ్మలు కొన్నారు అని ఇంటి అడ్రస్ చెప్పటంతో వెంటనే ఆర్య ఆమెను తీసుకొని అను ఇంటికి బయలుదేరుతాడు. ఇక ఆ ఇల్లు చూసి ఆర్య షాక్ అవుతాడు. ఇంతకుముందే ఈ ఇంటికి వచ్చాను అని జెెండేకి చెబుతాడు. ఇంట్లోకి వెళ్లి చూడగానే అక్కడ ఎవరు కనిపించరు. ఇక్కడికి వచ్చి ఒక పాపతో ఆడుకున్నాను అంటూ.. ఆ పాప ఎవరు కాదు గుడిలో పూజ చేయించినాను కదా ఆ పాపే అని చెబుతాడు.
నా పిల్లల్ని నేను గుర్తు పట్టలేక పోయాను అంటూ బాధపడతాడు. ఇక్కడికి మనం వస్తున్నామని తెలిసేమో అని ఆర్య అనటంతో.. ఛాన్స్ లేదని అంటాడు జెండే. మదన్ చెప్పినందుకు తను అక్కడి నుంచి వెళ్లి పోయిందేమో అని అనుకుంటాడు. ఇక ఇదంతా ఆ మాన్సీ ఆడించిన నాటకమని తెలిసి వరకు తను మళ్ళీ తిరిగి వెనక్కి రాదు అని.. ఈ విషయం తనకు ఎలా తెలియాలి అని బాధపడతాడు. దాంతో జండే ఆర్య కి ధైర్యం చెబుతాడు. ఇక అను, బామ్మ సామాన్లు సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఇంటికి వచ్చిన ఆర్య చాలా డల్ గా కనిపిస్తాడు.
Also Read: Rangula Ratnam June 21th: గుడ్ న్యూస్ చెప్పిన సీత-రేఖను టార్గెట్ చేసిన సూర్యనారాయణ?