Prema Entha Madhuram September 11th: గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతున్న ఆర్య.. వర్ధన్ ఇంటి గడప తొక్కిన అను??
అను వ్రతం కోసం ఆర్య ఇంటికి రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారింది.ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Prema Entha Madhuram September 11th: ఈరోజు ఎపిసోడ్ లో వరలక్ష్మీ వ్రతం రోజు కూడా తన సొంత ఇంట్లో పూజ చేసి, భర్త దగ్గర ఆశీర్వాదాలు తీసుకోలేకపోతున్నాను అని అను బాధపడుతూ ఉంటుంది.
చైత్ర: ఏం పర్వాలేదు అను. ఈరోజు కూడా నువ్వు మీ ఇంట్లో పూజ చేసి నీ భర్త దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవచ్చు. వెళ్లి రెడీ అవ్వు.
అను: ఇప్పుడే కదా నిజం చెప్పొద్దు అని అన్నాను.
చైత్ర: నిజం చెప్పను కానీ నీ చేత పూజ చేయిస్తాను. ఇంక వెళ్లి తయారవ్వు అని అనుని గది లోపలికి పంపిస్తుంది.
మరోవైపు ఆర్య తన చేతిలో లక్ష్మీదేవి బిల్లలని పట్టుకుంటూ గతంలో జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటాడు. గతంలో ఆర్య పడుకుని ఉండగా అను అక్కడికి వస్తుంది.
అను: ఈరోజు వరలక్ష్మీ వ్రతం త్వరగా లేచి రెడీ అవ్వమని చెప్పినా సరే ఎలా పడుకుంటున్నారో. అని ఆర్య చెవి దగ్గరికి వెళ్లి గట్టిగా సార్ అని అరుస్తుంది.
ఆర్య: ఏంటి అను పొద్దు పొద్దున్నే నీ గోల.
అను: ఈరోజు పూజ ఉంది బుద్ధిమంతుడిలా రెడీ అవ్వమని చెప్పాను కదా.
ఆర్య: నేను బుద్ధిమంతుడినే.
అను: వాదనలు ఆపి వెళ్లి రెడీ అవ్వండి సార్. అని అనగా ఆర్య వెంటనే లేచి అను దగ్గరకు వెళ్తాడు.
ఆర్య: ఉదయాన్నే లేపి నువ్వు ఇలా పువ్వులా తయారైతే నిన్ను కనీసం ముద్దు కూడా అడగలేదు. అని దగ్గరికి వస్తూ ఉండగా ఈరోజు పూజ సారు వద్దు అని అను అంటుంది.
ఆర్య: నువ్వు ఇలా పూజలు, వ్రతాలు అని నన్ను దూరం పెడతావనే నేను లెగలేదు. నన్ను లేపినందుకు నీకు పనిష్మెంట్ ఇవ్వాలి కదా అని ముద్దు పెట్టడానికి దగ్గరకి రాగా అను కళ్ళు గట్టిగా మూసుకుంటుంది. ఇంతలో ఆర్య అనుకి చేతిలో ఒక గిఫ్ట్ పెడతాడు.
ఆర్య: కళ్ళు తెరిచి నీ పనిష్మెంట్ ఏంటో చూసుకో. అని అనగా అను కళ్ళు తెరిచి ఆ గిఫ్ట్ ని చూస్తుంది.
అను: నేను చెప్పింది గుర్తుపెట్టుకుని తెచ్చారా సార్ అని అది ఓపెన్ చేయగా అక్కడ 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ ఉంటుంది.
అను: నేను తెమ్మంది వన్ గ్రామ్ లక్ష్మీదేవి బిల్ల సార్. అది పెట్టి అమ్మవారికి పూజ చేసి తర్వాత తాళిబొట్టులో పెట్టి మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే ఇంటికి మంచిది, అలాగే నా సౌభాగ్యం కూడా చల్లగా ఉంటుంది. అందుకే తెమ్మన్నాను. అని బుంగమూతి పెడుతుంది.
ఆర్య: ఆ 100 గ్రాములు బంగారంతో నీకు ఏ ఆర్నమెంట్ నచ్చితే అది చేసుకోవచ్చు కదా సర్లే అలా బుంగమూతి పెట్టొద్దు వెళ్లి తెస్తాను అని అంటాడు. తర్వాత అను ఆర్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది.
గతంలో జరిగిన ఈ సంఘటన అంతా గుర్తు తెచ్చుకున్న ఆర్య, ప్రతి సంవత్సరం నీ కోసం లక్ష్మీదేవి బిల్లలను కొంటూనే ఉన్నాను ఏదో ఒక రోజు నువ్వు తిరిగి వస్తావు అని ఆశతో. అని అనుకొని బాధపడుతూ ఉంటాడు.
ఆ తర్వాత సీన్లో అను, చైత్ర ఇద్దరు ముస్తాబవుతారు.
అను: ఇప్పుడు రిస్కు తీసుకుని అక్కడికి ఎందుకు వెళ్లడం ఎందుకు చైత్ర? వద్దు నాకు భయంగా ఉంది.
చైత్ర: నన్ను నమ్ము అను కంగారు పడొద్దు.అని అనుని తీసుకొని వెళుతుంది చైత్ర.
ఆ తర్వాత సీన్లో శారదమ్మ ఇంట్లో వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు అన్నీ జరుగుతాయి. ఇంతలో నీరజ్ అంజలిని కిందకి పిలుస్తాడు.
అంజలి: ఆంటీ వద్దన్నా ఉపవాసం చేశారు. నీరసంగా ఉంది రెస్ట్ తీసుకొని వస్తాను అని చెప్పారు. అని అనగా ఇంక అంజలి తో పూజ మొదలుపెడతారు. మరోవైపు జెండే నీరజ్లు మాట్లాడుకుంటూ ఉంటారు.
నీరజ్: ఈ ఆడవాళ్ళకి పూజలు అన్న వెంటనే ఎక్కడలేని సంబరం అంతా వచ్చి ముస్తాబవుతారు.
జెండే: చిన్న పండగ అయితే చాలు కొత్త కొత్త బట్టలు, బీరువాలో నగలు అన్ని వేసుకుంటారు. అని అంటూ ఉండగా వెనుక నుంచి చైత్ర వచ్చి వీళ్ళిద్దరి భుజాల మీద గిల్లి తను దాక్కుంటుంది. నీరజ్ జెండేలు ఒకరి ముఖాలు ఒకరు చూస్తూ నువ్వే గిల్లావు అంటే నువ్వే గిల్లావు అని అనుకుంటూ ఉంటారు. ఇంతలో చైత్ర వచ్చి నేనే గిల్లాను అని నవ్వుతుంది.
నీరజ్: చైత్ర ఎలా ఉన్నావు? చాలా రోజులైంది చూసి.
జెండే: వాటే సడన్ సర్ప్రైజ్ చైత్ర.
చైత్ర: బెంగళూరు నుంచి నిన్నే వచ్చాను. మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం బాగా చేస్తారు కదా అందుకే వచ్చేసాను అని చెప్పి పూజ చేస్తున్న అంజలి దగ్గరికి వెళ్తుంది.
చైత్ర: నువ్వే కదా అంజలివి ఫోటోలో కొన్నా బయట చాలా బాగున్నావు. నీరజ్ కి నువ్వు చాలా ఎక్కువ. అని నవ్వుతుంది.
నీరజ్: ఈ అల్లరి పిల్ల పేరు చైత్ర. బెంగుళూరులో ఉంటారు నీకు చెప్పా కదా.
అంజలి: మన బిజినెస్ పార్ట్నర్స్ అన్నావు కదా వాళ్లేనా?
నీరజ్: బిజినెస్ పార్టనర్స్ కన్నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనడం బెటర్. తినకి కొత్త పాత అని ఏవి ఉండవు కలుపుగోలుతనం ఎక్కువ. అని అనగా అంజలి కూడా చైత్ర ని పలకరిస్తుంది. ఇంతలో పూజారి గారు పూజ మొదలుపెడదాము అని అంటారు.
చైత్ర: ఒక నిమిషం. రాధా లోపలికి రా అని అనగా అను ముసుగు వేసుకొని గడప దగ్గర నిల్చుంటుంది.
చైత్ర: నీకు మొహమాటం ఎక్కువ నేనే తీసుకొని వస్తాను అని గడప దగ్గరికి వెళ్లి అనుని ఇంటి గడప లోపలికి తీసుకొని వస్తుంది చైత్ర
చైత్ర: తిన పేరు రాధ. బెంగళూరు నుంచి వచ్చింది నా బెస్ట్ ఫ్రెండ్. ఇక్కడ పూజలు బాగా అవుతాయి కదా అందుకే తీసుకొని వచ్చాను. పెళ్ళి కాని వాళ్ళు ఈ పూజ చేస్తే మంచి మొగుడు వస్తారు కదా అందుకే తిన చేత కూడా పూజ చేయించండి. అని అనుని అంజలి పక్కన కూర్చోబెడుతుంది చైత్ర.
చైత్ర: ఏం పర్లేదు రాధ ఇది మన ఇల్లే అనుకో. గెస్ట్ లా కాకుండా ఇంటి మనిషి లాగా మనస్ఫూర్తిగా పూజ చేయు. ఇక్కడ అందరూ మనవాళ్ళే అని చెప్పి పూజ చేయిస్తుంది.
పూజ జరుగుతున్నప్పుడు దీపం వెలిగించడానికి ఒకవైపు అంజలి వెలిగించగా మరోవైపు అను దీపాన్ని వెలిగించి ఆనందపడుతుంది. తిరిగి వాళ్ళు పూజ స్థానానికి వచ్చి పూజ చేస్తూ ఉంటారు.
చైత్ర:రాధా నీకు ఈ పూజలు, వ్రతాలు అన్ని అలవాటే కదా ఒక మంచి పాట పాడు. అని అనగా అను వద్దు చైత్ర అని భయపడుతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: Trinayani September 9th: వరలక్ష్మి స్థానంలో కొలువైన విశాలాక్షి.. సుమన మెడను చుట్టుకున్న పాము?





















