అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today may 7th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: కన్నీటి సాక్షిగా తల్లిని నిలదీసిన వల్లీ! ప్రేమ నగలు తాకట్టు గుట్టురట్టు!

Illu Illalu Pillalu Serial Today Episode may 7th ప్రేమ నగలు తాకట్టు పెడుతుంటే భద్రావతి, సేనాపతి వచ్చి ప్రేమని లాక్కెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode వల్లీకి తను ప్రెగ్నెంట్ కాదు అని మొత్తం తన తల్లి ఆడించిన నాటకం అని తెలుస్తుంది. దాంతో ఏం చేయాలో అర్థం కాక.. డాక్టర్‌ని బతిమాలి.. తన కాపురం నిలబెట్టమని బతిమాలుతుంది. దాంతో డాక్టర్ వేరే వాళ్ల రిపోర్ట్స్ వల్లీకి ఇచ్చి ఇవి నీవి అని చెప్పుకో.. ఇదే నేను మీకు చేసే లాస్ట్ సాయం.. ఇక మీదట మీరు నా దగ్గరకు వస్తే అస్సలు బాగోదు అని  చెప్పి పంపిస్తుంది. 

వల్లీ రిపోర్ట్స్ తీసుకొని బయటకు వెళ్లి నర్మద, ప్రేమలకు ఇస్తుంది. అక్కా మీ అమ్మ పీతల కూర పంపించడంతో మేం అడిగాం దానికి నువ్వు ఇక్కడి వరకు తీసుకొచ్చావ్,, అయినా మా అక్క ప్రెగ్నెంట్ అయితే మాకే కదా సంబరం అని నర్మద, ప్రేమ అంటారు. ఇంటికి వెళ్దాం పద అక్కా అని అంటే వల్లీ ఒకసారి మా అమ్మ వాళ్ల ఇంటికి వెళ్లి వస్తా మీరు వెళ్లండి అని అంటుంది. ఇప్పుడు ఎందుకు అక్కా అని నర్మద అంటే కాస్త పని ఉంది మీరు వెళ్లండి అని అంటుంది. సరే అక్క ఎక్కువ సేపు ఉండకు ఎండ త్వరగా వచ్చేయ్ అని చెప్పి వెళ్లిపోతారు. 

వల్లీ డాక్టర్ చెప్పిన మాటలు తలచుకొని ఏడుస్తూ వెళ్తుంది. నర్మద ప్రేమలు మాట్లాడుకుంటూ వెళ్తారు. తన ప్రెగ్నెన్సీ మీద డౌట్ పడ్డామని వల్లీ అక్క చాలా బాధ పడుంటుంది కదా అని నర్మద అంటే అవును అని ప్రేమ అంటుంది. ఇక ప్రేమ బ్యాంక్‌కి వెళ్లాలి అనుకొని నర్మదకి విషయం చెప్పాలి అనుకుంటుంది.. మళ్లీ నర్మద తిడుతుందని కారు కొనేసిన తర్వాత చెప్పి తిట్లు కాసేస్తా అనుకుంటుంది. వెంటనే నర్మదతో ఫ్రెండ్ ఇంటికి వెళ్తా అని అంటుంది. నేను వస్తా అని నర్మద అంటే వద్దు అక్క నువ్వు ఇంటికి వెళ్లు వల్లీ అక్క రిపోర్ట్స్ కోసం అత్త టెన్షన్ పడుతూ ఉంటుందని అంటుంది. నర్మద సరే అంటుంది. ప్రేమ బ్యాంక్‌కి వెళ్లిపోతుంది. నర్మద ప్రేమని చూసి ఎందుకు ప్రేమ ఇంత టెన్షన్ పడుతుందని అనుకుంటుంది. 

Also Read: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి, లక్ష్మీలను కడుపులో బిడ్డ కలుపుతుందా! అదిరిపోయిన ఎమోషనల్ సీన్!

ఇడ్లీ బాబాయ్ ప్రేమగా భార్యకి చిలకలు తినిపిస్తాడు. భార్యని కూడా తనకు తినిపించమని అడుగుతాడు. ఇద్దరూ చిలకలు తినిపించుకుంటూ ఉంటే.. వల్లీ బాధగా వస్తుంది. ఇద్దరూ వల్లీ దగ్గరకు వెళ్లి ఇంత ఎండకు వచ్చావేంటమ్మా కనీసం ఫోన్ కూడా చేయలేదు.. నువ్వు అసలే ఒట్టి మనిషివి కూడా కాదు అని అంటుంది. వల్లీ కోపంగా చూస్తుంది. భాగ్యం ఓవరాక్షన్‌కి వల్లీ ఏడుస్తుంది. ఇప్పుడు నాకు ఎన్నో నెల అని వల్లీ అడుగుతుంది. ఇది మూడో నెల ఇంకో ఆరు నెలల్లో నీకు పాపో బాబో కూడా పుడతారు..అదృష్టం బాగుంటే కవల పిల్లలు కూడా పుట్టొచ్చు అని భాగ్యం అంటుంది. వల్లీ లాగిపెట్టి కొడుతుంది. నువ్వు అసలు నా కన్న తల్లివేనా.. కడుపుతో ఉన్నావని కన్నకూతురికి అబద్ధం చెప్పి మోసం చేస్తావా.. లోకంలో ఏ తల్లి అయినా ఇలా చేస్తుందా.. సిగ్గు ఉందా నీకు అసలు.. అని అడుగుతుంది. అమ్మడు నీకు తెలిసిపోయిందా.. ఎట్టా తెలిసిందే అని భాగ్యం అడుగుతుంది. ఆ మాట అనడానికి సిగ్గు ఉందా.. ఏ ఆడపిల్లకి అయినా మొదటి సారి నువ్వు ప్రెగ్నెంట్ అవుతున్నావ్ అని చెప్తే కన్నపేగు కదులుతుంది. ఆ ఆనందం.. గుండెను తాకుంతుంది. ఆడపిల్ల తల్లి అవ్వడం అంటే అమ్మ అన్న పిలుపుతో కొత్త జన్మ ఎత్తడం.. అలాంటి మానసిక బంధం విషయంలో మోసం చేయడం కంటే మరో దారుణం ఉండదు.. నిజం తెలిస్తే కన్న బిడ్డ తట్టుకోలేదు అని తెలిసి కూడా నన్ను ఇలా పిచ్చిదాన్ని చేయాలి అని ఎలా అనిపించిందే అని అడుగుతుంది. 

Also Read: అవినాష్‌ను అరెస్ట్ చేయడానికి వెళ్లిన జేడీ..? ధాత్రికి ఊహించని షాక్‌ ఇచ్చిన అవినాష్

భాగ్యం కూతురితో నీ కాపురం నిలబెట్టడానికే ఇదంతా చేశా అంటుంది. నువ్వు నా కాపురం నిలబెట్టడం కాదే నిలువునా తగలెట్టేశావ్.. అమూల్య విషయంలో చేసిన దానికే నా భర్త నన్ను క్షమించడం లేదు.. ఇప్పుడు నేను నెల తప్పాను అని మోసం చేశానని తెలిస్తే మా ఆయన ఈ జన్మలో నా ముఖం చూస్తాడా అని అంటుంది. ఏదో ఒకటి చేసి నీ కాపురం.. నిలబెడతానే అని భాగ్యం అంటుంది. ఇలాంటి విషయంలో మోసం చేశా అంటే నన్ను ఎట్టా ఇంటికి రానిస్తారే..అని అంటుంది. ఈ విషయం మనకి మాత్రమే తెలుసు.. అందుకే ఈ అబద్ధాన్ని నువ్వు నిజం చేస్తే ప్రాబ్లమ్ తీరిపోతుందని భాగ్యం అంటుంది. అందుకే నువ్వు నన్ను కొట్టడం కాకుండా మీ ఆయన్ను ఆకట్టుకునే ప్రయత్నం చేయ్ అని అంటుంది. వల్లీ ఆలోచనలో పడుతుంది.

Also Read: తన భర్తను రౌడీలతో మరోసారి కిడ్నాప్ చేయించిన ప్రియంవద...తనకు ఏమైనా అవుతుందేమోనని కంగారుపడిన లక్ష్మీ

ప్రేమ బ్యాంక్‌కి వెళ్తుంది. గోల్డ్ లోన్ ఇవ్వమని మ్యానేజర్‌తో మాట్లాడుతుంది. భద్రావతి, సేనాపతి బ్యాంక్‌లోనే ఉంటారు. ప్రేమ నగలు తీసుకొని రెండు లక్షలు ఇవ్వమని అడగటంతో రెండు లక్షలు సరిపోతాయా అని భద్రావతి, సేనాపతి అడుగుతారు. ప్రేమ వాళ్లని చూసి షాక్ అయిపోతుంది. ఎందుకు ఈ డబ్బు అని అంటే నాకే అవసరం అని అంటుంది. నీకు ఎవరు నగలు తాకట్టు పెట్టమని అన్నారో.. నాకు అన్నీ తెలుసు అన్నీ తేల్చుతా అని ప్రేమని లాక్కొని తీసుకెళ్తారు. ప్రేమ ఎంత బతిమాలినా వదలరు.. ప్రేమని కారులో ఎక్కించుకొని తీసుకెళ్తారు. మరోవైపు నర్మద తీసుకెళ్లిన స్కానింగ్ రిపోర్ట్స్ రామరాజు తెగ చూస్తేస్తాడు. తిరుపతి, వేదవతి, ధీరజ్ ఇలా అందరూ తెగ చూసేస్తారు. అమ్మాయో అబ్బాయో నేను చెప్తా అంటే నేను చెప్తా అని మొత్తం తిరగేస్తారు. ఇంతలో అక్కడికి బాధగా వల్లీ వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 11th: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
జగద్ధాత్రి సీరియల్: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
Godavari Serial Today August 11th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget