అన్వేషించండి

Ammayi garu Serial Today September 12th: అమ్మాయి గారు సీరియల్: రాజు, శ్వేతలకు పెళ్లి చేయాలనుకుంటోన్న ముత్యాలు.. ఇంటి నుంచి బయటకు వచ్చేసిన రూప!

Ammayi garu Today Episode తన తండ్రిని మళ్లీ సీఎంని చేయడానికి ప్లాన్ వేసి శ్వేత ముత్యాలుని ఒప్పించి రాజుని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రాజు ఎవరూ చూడకుండా అమ్మాయి గారిని కలుస్తాడు. నువ్వు ఇక్కడ ఎంత సంతోషంగా ఉంటే నేను అక్కడ అంత సంతోషంగా ఉంటాను అని రూపతో చెప్తాడు. ప్రతీ రోజూ మనం కలుస్తామని నిన్ను నాకు చూడాలి అనిపించిన పది నిమిషాల్లో నీ దగ్గరకు వస్తానని చెప్తాడు. ఇక రాజు రూపకి తినమని చెప్పి తినిపించడానికి రెడీ అవుతాడు. ఇంతలో విజయాంబిక, దీపక్ అటుగా వెళ్తూ రూప గదిలో నుంచి మాటలు వినపించడంతో రాజు వచ్చాడేమో అని అనుమానంతో రూప గదికి వెళ్తారు.

రూప గది మొత్తం రాజు కోసం చూస్తారు. రాజు ఎక్కిళ్లు రావడంతో విజయాంబిక, దీపక్ అనుమాన పడతారు. ఇంతలో రూప తనకి ఎక్కిళ్లు వచ్చినట్లు కవర్ చేస్తుంది. వాళ్లు వెళ్లిపోగానే రాజు ఎక్కిళ్లు తగ్గాలని ముద్దు పెట్టుకుంటుంది. రాజు సిగ్గు పడుతూ నవ్వుతాడు. రూపకు తన ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి ప్రేమగా నుదిటిపై ముద్దు పెట్టి ఇంటికి వెళ్తాడు.
 
శ్వేత రాజుని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. అందుకు తన అన్న హర్షతో రాజుని పెళ్లి చేసుకోవాలి అంటే ముత్యాలు ఒక్కర్తే దారి అని తనని ఒప్పిస్తే రాజు ఒప్పుకున్నట్లే అని అంటుంది. హర్ష సరే అని కానీ మమ్మీ డాడీ ఒప్పుకుంటారా అని అడుగుతాడు. తన కోసమే తండ్రి అవమానాల పాలై రాజకీయాలకు దూరం అయ్యాడని తండ్రికి పూర్వ వైభవం తీసుకురావాలి అంటే రాజుని దగ్గర చేసుకోవాలని శ్వేత తన అన్నయ్యతో చెప్తుంది. ముత్యాలు అక్కడి వస్తుంది.  

ముత్యాలు: ఏంటి శ్వేత అర్జెంటుగా కలవాలి అని చెప్పావ్. ఇంతకీ ఇతను ఎవరు.
శ్వేత: మా అన్నయ్య హర్ష. ఆంటీ నేను బెయిల్ ఇప్పించినందుకు  రాజు ఏమైనా అన్నాడా.
ముత్యాలు: లేదమ్మా వాడు దాని గురించి మాట్లాడలేదు.
శ్వేత: మనసులో అంటే నా సారీని అంగీకరించాడు అంటే నన్ను కూడా అంగీకరిస్తాడన్నమాట.
ముత్యాలు: కానీ నిన్న చాలా పెద్ద గొడవ అయిందమ్మా. 
శ్వేత: తెలుసు ఆంటీ మొత్తం తెలుసు. కానీ మీరు మంచి పని చేశారాంటి మొత్తానికి ఆ దరిద్రం నుంచి రాజుని కాపాడారు లేదంటే మళ్లీ ఏదో ఒకటి చేసి రాజుని ఇరికించేస్తారా. వాళ్లతో తెగ తెంపులు చేసుకున్నారు సరే మరి మళ్లీ ఆ రూప రాజుతో కలుస్తుందా.
ముత్యాలు: ఇప్పుడు కష్టం శ్వేత. అప్పుడు వాళ్ల నాన్న బికారి కాబట్టి కలిసింది ఇప్పుడు సీఎం కదా కాబట్టి కలవడం అంత ఈజీ కాదు అని నేను అనుకుంటున్నా. అలా అని రూపని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు అది రాజు కోసం ఏమైనా చేసేలా ఉంది.
శ్వేత: అంత ఛాన్స్ ఇవ్వకుండా రాజుకి పెళ్లి చేసేయండి ఆంటీ.  
హర్ష: కానీ ఇన్ని ఇష్యూల తర్వాత రాజుని ఎవరు పెళ్లి చేసుకుంటారు శ్వేత. రూపని పెళ్లి చేసుకున్నాడు. నీతో పెళ్లి వరకు వచ్చి ఆగిపోయాడు. రూప బిడ్డకు తండ్రి అయి తప్పించుకున్నాడు. ఇప్పుడు మళ్లీ ఈ గొడవ అవేవి చాలవన్నట్లు సీఎం గారి మీద మర్డర్ అటెంట్ చేసినట్లు కేసు ఒకటి. ఆంటీ నేను అయితే ఇంక దారుణంగా విన్నాను. రూప కడుపులో బిడ్డ ఇష్టం లేకే రూప కడుపు మీద కాల్చేశాడని విన్నాను. ఈ టాపిక్ డైవర్ట్ చేయడానికి అందర్నీ మరో టాపిక్ మీదకు మార్చాలి. అది రాజు పెళ్లి అవ్వాలి.
ముత్యాలు: అయినా ఇప్పటికిప్పుడు ఎవరు ఒప్పుకుంటారు.
శ్వేత: మీకు అభ్యంతరం లేకపోతే నేను రాజుని పెళ్లి చేసుకుంటా. రాజు గురించి తెలిసి తెలిసి ఎవరూ పెళ్లి ఒప్పుకోరు నేను అయితే ప్రేమించాను కాబట్టి నాలా ఎవరూ చూసుకోరు.  ఆరోజు నేను రూపకి యాక్సిడెంట్ చేయడానికి కారణం రేణుక. లేకపోతే మీ ఇంట్లో కారు కీ నా దగ్గరకు ఎలా వస్తుంది.
ముత్యాలు: నువ్వు అన్న ఈ మాట చాలు శ్వేత. నీ తప్పు లేదు అని తెలిసింది కాబట్టి రాజుని నేను ఒప్పిస్తా.

రూప గొడవ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తాను అత్తయ్యకి కలిసి రాజు భార్యగా ఉండటమే తనకు ఇష్టమని చెప్తుంది. అందుకు తన తండ్రికి, విజయాంబికకు తెలీకుండా వెళ్లాలని అంటుంది. ముత్యాలు ఇంటికి వస్తుంది. రాజుకు మరో పెళ్లి చేస్తానని చెప్తుంది. రాజుతో పాటు అందరూ షాక్ అవుతారు. శ్వేతని పెళ్లి చేసుకోమని చెప్తుంది. రాజుతో పాటు తన తండ్రి కూడా ఒప్పుకోడు. యాక్సిడెంట్ కూడా రేణుక వల్ల జరిగిందని చెప్తుంది. రాజు రూప తప్ప ఇంకెవరితో ఉండనని అంటాడు. కోడలు ఇచ్చిన కిడ్నితో బతుకుతూ ఆమెకు అన్యాయం చేయడం తప్పని ఇంట్లో అందరూ ముత్యాలకు చెప్తారు. ఇంట్లో అందరూ ఎదురు తిరగడంతో ముత్యాలు కళ్లు తిరిగి పడిపోతుంది. మరోవైపు రూప గదిలో లేకపోవడం చూసిన విజయాంబిక సూర్య ప్రతాప్‌కి ఆ విషయం చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: సత్య క్రిష్‌ల రొమాన్స్.. ఫ్యాన్స్‌కి పండగే.. కన్నతండ్రిని చంపడానికి రుద్ర మాస్టర్ ప్లాన్!

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 17th: 'గోదావరి' సీరియల్: తమ్ముడిని రెచ్చగొట్టిన నిత్య! సూర్య కోసం అందంగా ముస్తాబైన జానుకి నిశ్చితార్థం గురించి తెలుస్తుందా!
'గోదావరి' సీరియల్: తమ్ముడిని రెచ్చగొట్టిన నిత్య! సూర్య కోసం అందంగా ముస్తాబైన జానుకి నిశ్చితార్థం గురించి తెలుస్తుందా!
Nindu Manasulu Serial Today August 17th: నిండు మనసులు: మంజు ఇంట్లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం! కళ్లు తిరిగి పడిపోయిన ప్రేరణ.. కారణమేంటో తెలుసా!
నిండు మనసులు: మంజు ఇంట్లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం! కళ్లు తిరిగి పడిపోయిన ప్రేరణ.. కారణమేంటో తెలుసా!
Nindu Noorella Saavasam Serial Today August 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆశ్రమంలోకి దూరిన ప్రచండ – ప్రచండకు వార్నింగ్‌ ఇచ్చిన మనోహరి
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆశ్రమంలోకి దూరిన ప్రచండ – ప్రచండకు వార్నింగ్‌ ఇచ్చిన మనోహరి
Jabardasth Pavithra : జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?
జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget