అన్వేషించండి

Ammayi garu Serial Today October 25th: అమ్మాయి గారు సీరియల్: పింకీని పెళ్లి చేసుకొని సూర్యప్రతాప్ ఇంటికి వచ్చిన జీవన్.. రూప ఫ్యామిలీలో అల్లకల్లోలం!

Ammayi garu Today Episode సూర్యప్రతాప్ తమ్ముడి కూతురిని జీవన్ పెళ్లి చేసుకొని ఇంట్లోకి రావడం అందరూ షాక్ అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode తండ్రి ప్రమాణ స్వీకారంలో అపురూప కూడా మాట్లాడుతుంది. నా వెనక ఓ శక్తి ఉందని ఆ శక్తి పేరు రాజు అని చెప్తుంది. అందరూ క్లాప్స్ కొడతారు. రాజు లేకపోయి ఉంటే మా నాన్న నామినేషన్ వేసే వారు కాదని రాజు లేకపోయి ఉంటే దొంగిలించబడ్డ బ్యాలెట్ బాక్స్‌లు రికవరీ అయ్యేవి కాదని చెప్తుంది. సూర్యప్రతాప్ షాక్ అవుతాడు. దీపక్ తల్లితో ఏంటి మమ్మీ మనకు ఈ టార్చర్ అని అంటాడు. 

ఇక రూప రాజుని వేదిక మీదకు పిలుస్తుంది. రాజు కూడా మాట్లాడుతాడు. తానే చేసింది ఏమీ లేదని భగవంతున్ని సేవ చేసుకోవడం భక్తుడి బాధ్యత అని అలాగే నేను అని నా వెనక కూడా ఓ శక్తి ఉందని అంటాడు. అంతా ఎవరా అనుకుంటారు. 

రాజు: రాజకీయాలకు దూరంగా ఉన్న మా పెద్దయ్య గారు ఆపద్ధర్మ సీఎం అయ్యారు ఎలా అయ్యారో ఎవరికీ తెలీదు. పార్టీ ఎమ్మెల్యేలు అంతా కోరడం వల్లే సీఎం అయ్యారని పెద్దయ్యగారితో పాటు అందరూ అనుకున్నారు కానీ అదంతా చేసింది మా విరూపాక్షి అమ్మగారు. అమ్మగారు రండి. అంతే కాదు అప్పటికే రాజకీయకంగా ఎలాంటి ప్రభావితం లేని పెద్దయ్యగారికి మా విరూపాక్షి అమ్మగారే తన ఆస్తులన్నీ తాకట్టు పెట్టి పార్టీకి ఫండ్ ఇచ్చారు. ఇది కూడా మాకు ఎవరికీ తెలీకుండా చేశారు. మా అమ్మగారి నిర్ణయమే ఇప్పుడు పెద్దయ్యగారిని సీఎంలా నిలబెట్టింది. చివరకు మొన్న బ్యాలెట్ బాక్స్‌ల దొంగతనం గురించి చెప్పింది కూడా విరూపాక్షి అమ్మగారే.

విరూపాక్షి సూర్యప్రతాప్ పక్కన నిల్చొంటుంది. మరోవైపు మత్తులో ఉన్న పింకి లేచే సరికి మెడలో తాళి ఉంటుంది. ఏం అయిందా అని బిత్తర పోతుంది. పింకి మత్తులో ఉన్నప్పుడు రేణుక, శ్వేతలు తాళికి మూడు ముడులు వేసి పింకి మెడలో వేస్తారు. నా మెడలో తాళి ఎలా వచ్చిందని పింకి అడిగితే జీవన్ నేనే కట్టానని చెప్తాడు. దాంతో పింకీ లాగి పెట్టి జీవన్‌ని కొడుతుంది. మా పెద్దనాన్నకి చెప్పి నీ అంతు తేల్చుతానని అంటుంది. దానికి జీవన్ మీ పెద్దనాన్నకి మొత్తం చెప్పు కుదరకపోతే నేనే నీ వీడియోలు ఫొటోలు అన్నీ చూపిస్తాను అంటాడు. వీడియోలు ఫొటోలు ఏంటి అని అడిగితే పోలీసులతో పింకీ మాట్లాడిన ఫొటోలు గోపీతో ముద్దు పెట్టుకున్న ఫొటోలు చూపిస్తాడు. వీటిని వాడుకొని నీ కుటుంబాన్ని ఊబిలోకి నెట్టడానికే నీకు తాళి కట్టానని అంటాడు.

పింకీ: ఏం కావాలి నీకు.
జీవన్: ఇస్తావా పింకీ మీ పెద్దనాన్న నా నుంచి లాగేసుకున్న సీఎం కుర్చీ కావాలి మీ అక్క నా చెల్లి నుంచి లాగేసుకున్న రాజు కావాలి మానాన్నని అవమానించిన మీ కుటుంబం పరువు పోవడం కావాలి.  అవన్నీ చేయాలి అంటే నేను నీ మొగుడిలా నీ నట్లింట్లోకి రావాలి అలా కుదరదు అంటే నెట్టింట్లో నీ ఫొటోలు పెడతా.

మరోవైపు సూర్యప్రతాప్ విరూపాక్షికి థ్యాంక్స్ చెప్తాడు. అందరూ పొంగిపోతారు. విరూపాక్షి సంతోషంతో సూర్యప్రతాప్‌కి కంగ్రాట్స్ చెప్పి బొకే ఇస్తుంది. సూర్యప్రతాప్ తీసుకుంటాడు. నువ్వు చేసిన ద్రోహానికి క్షమించను అని అంటాడు. ఇక కూతురు రూపని తీసుకొని వెళ్లిపోతాడు. రాజు విరూపాక్షికి ఓదార్చుతాడు. మరోవైపు పింకీని జీవన్ బాగా బెదిరిస్తాడు. నా షరతులకు ఒప్పుకుంటే మీ ఇంటికి వెళ్దామని నీ వీడియోలు బయట పడితే మీ అమ్మానాన్నలు చనిపోతారు. మీ పెద్ద నాన్న పదవి పోతుందని అంటాడు. ఇక పింకీ ఒప్పుకుంటుంది. జీవన్ పింకీని తీసుకొని   సూర్యప్రతాప్ ఇంటికి బయల్దేరుతాడు. ఇంట్లో సూర్యప్రతాప్ అందరూ సంతోషంగా ఉంటారు. పింకీ గురించి సూర్యప్రతాప్ చంద్రకి అడుగుతాడు. ఇంతలో పింకీ మెడలో తాళి, దండతో గుమ్మం ముందు నిల్చొంటుంది. అందరూ చూసి షాక్ అయిపోతారు. వెనకాలే జీవన్‌ వచ్చి నిల్చొంటాడు. జీవన్‌ని చూసి బిత్తర పోతారు. సుమ కోపంగా పింకీ ఏమైంది ఏంటి ఇది అని అరుస్తుంది. మెడలో తాళి బొట్టు ఏంటి అని ఏడుస్తుంది. పింకీని కొడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఛైర్మన్ పదవిని వదులుకున్న మిత్ర.. భర్త కోసం లక్ష్మీ పోరాటం! 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget