Ammayi garu Serial Today October 17th: అమ్మాయి గారు సీరియల్: రాజు, రూపల పెళ్లి తంతు వీడియో తీసిన దీపక్‌కు గట్టి షాక్.. తిరిగి బ్లాక్ మెయిల్ చేసిన రాజు!
Ammayi garu Today Episode రూప, రాజులను ఇరికించాలని దీపక్ ప్రతాప్‌కి వీడియో చూపించబోతే రాజు దీపక్, హారతిల వీడియో దీపక్‌కి చూపించి షాక్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Ammayi garu Serial Today Episode రూప, రాజుల పెళ్లి చూపులు పెళ్లి మొత్తాన్ని మళ్లీ రీ క్రియేట్ చేయాలని అనుకుంటారు ముత్యాలు వాళ్లు. పాత గెటప్‌లు వేసుకొని పెళ్లి చూపులకు కూర్చొంటారు. ఇక తన తండ్రి లేడని రూప ఫీలైతే రాజు పెద్దయ్య గారిని ఊహించుకో అని అంటాడు. దాంతో రూప తన తండ్రి వస్తున్నట్లు తాను తన తల్లిదండ్రుల మధ్యలో పెళ్లి చూపులకు కూర్చొన్నట్లు ఊహించుకుంటుంది.
రాజు: పెద్దయ్య అమ్మాయి గారికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని తెలిసింది. మీరే అంటుంటారు కదా మీ తర్వాత అమ్మాయి గారిని అంతలా చూసుకునేది నేను అని అందుకే అమ్మాయి గారిని అడుగుదామని వచ్చాం.
సూర్యప్రతాప్: పర్లేదురా పెద్దాడివి అయ్యావ్. అసలు నా కూతురిని చేసుకోవడానికి నీకున్న అర్హత ఏంటిరా.
రాజు: అర్హత చూసి ఇచ్చేది ఉద్యోగం మనసు చూసి ఇచ్చేది సంబంధం అలా చూస్తే అమ్మాయి గారిని తప్ప మరెవరికి చోటు లేని మనసు పెద్దయ్య నాది.
విరూపాక్షి: మీ అబ్బాయి మాకు నచ్చాడు అప్పలనాయుడు పెళ్లి ఎప్పుడు పెట్టుకుందాం. మా అమ్మాయి కాఫీలో షుగర్ వేయకపోయినా పర్లేదు బాగుంది అన్నాడు అంటే ఇంతకంటే మంచి అల్లుడు మాకు ఎక్కడ దొరుకుతుంది.
ఇక మొత్తానికి పెళ్లి చూపులు సరదాగా జరుగుతాయి. రూపని కాళ్లు కింద పెట్టకుండా చూసుకుంటామని అంటారు. ఇక సూర్యప్రతాప్ మా అమ్మాయిని మీకు ఇవ్వకపోతే ఏం చేస్తారని అంటే అందరూ కలిసి సూర్యప్రతాప్ కాళ్ల మీద పడి అమ్మాయి గారిని ఇచ్చి పెళ్లి చేస్తామంటేనే లేస్తా అంటారు. దాంతో సూర్యప్రతాప్ ఒప్పుకుంటారు. ఇక రూప నాన్న గురించి ఊహించుకుంటేనే ఇంత బాగుంది నిజంగా అయితే ఇంకెంత బాగుండేదో అని అంటుంది. ఇక ముత్యాలు కోడలికి నల్లపూసలు వేస్తానని అంటుంది.
రాజు రూపకి కుంకుమ పెడతాడు. ఒకరి మెడలో మరొకరు దండలు వేసుకుంటారు. ఇంతలో దీపక్ అక్కడికి వస్తాడు. జరుగుతున్నది చూసి వీడియో తీస్తాడు. రాజు రూప మెడలో తాళిబొట్టు వేస్తాడు. అందరూ సంతోషంగా అక్షింతలు వేస్తారు. మామయ్య రూపతో వాళ్లని కలవొద్దని మాట తీసుకుంటే రూప కలిసి నల్లపూసలు వేయించుకుందని ఇది మామయ్యకి చెప్తే రూప పని అయిపోతుందని అనుకుంటాడు. వెంటనే విజయాంబిక ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. మొత్తం వీడియో తీశానని చెప్తాడు. దాంతో విజయాంబిక వీడియో తీసుకొని వెంటనే రమ్మని పిలుస్తుంది. విజయాంబిక మాటలు విన్న సుమ వెంటనే రూపకి కాల్ చేసి అక్కడ ఏం జరిగిందో తెలీదు కానీ అక్కడ జరిగింది వీడియో తీశాడు మీ నాన్నకి చూపిస్తానని అన్నాడని అంటుంది.
రూప అర్జెంట్‌గా వెళ్లాలని నాన్నకి తెలిస్తే గొడవ అవుతుందని అంటుంది. రూపని డ్రాప్ చేయడానికి రాజు బయల్దేరుతాడు. మందారం, సుమలు చాలా టెన్షన్ పడతారు. దీపక్, సూర్యప్రతాప్ వాళ్లు ఇంటికి వచ్చేస్తారు. రావడం రావడమే సూర్యప్రతాప్ రూప గురించి అడిగి రూపని పిలుస్తాడు. ఇంతలో విజయాంబిక వచ్చి వెళ్లు సుమ వెళ్లి రూపని తీసుకొని రా అంటుంది. సుమ సూర్యప్రతాప్‌కి నీరు ఇస్తూ వణికి పోతుంది. అందరూ ఏమైందని అడుగుతారు. దానికి మందారం చలి జ్వరం అని చెప్తుంది. ఇక విజయాంబిక సూర్యప్రతాప్‌తో దీపక్ ఏదో వీడియో ఎడిట్ చేశాడు తమ్ముడు నువ్వు చూస్తే ప్రచారానికి వాడుకోవచ్చని అంటుంది. వీడియో చూపించమని అంటే దీపక్ సూర్యప్రతాప్ దగ్గరకు వెళ్తాడు. ఇంతలో దీపక్‌కి ఏదో మెసేజ్ రావడంతో షాక్ అయి కంగారు పడి వీడియో డిలీట్ అయిందని చెప్తాడు. ఇంతలో రూప వచ్చి నాన్న అని ఎదురుపడుతుంది. విజయాంబిక షాక్ అయితే సుమ, మందారం ఊపిరి పీల్చుకుంటారు.
విజయాంబిక దీపక్‌ని చాటుగా తీసుకెళ్లి ఎందుకు వీడియో చూపించకుండా అంత భయపడ్డావ్ అంటే దీపక్ తాను హారతి మాట్లాడుకున్న వీడియో తల్లికి చూపిస్తాడు. అందులో ఇద్దరూ పెళ్లి గురించి మాట్లాడి హగ్ చేసుకుంటారు. విజయాంబిక కొట్టడం కూడా ఉంటుంది. అదంతా రూప వీడియో తీస్తుంది. ఇక అప్పుడు ఆ విషయం రూప రాజుకు చెప్తే నేను చెప్పే వరకు ఆ విషయం ఎవరికీ చెప్పొద్దని రాజు అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: మీడియా ముందు మామని ఇరికించేసిన సత్య.. ఇక నో వెపన్స్.. మైత్రి, హర్షల సరసాలు చూసేసిన నందిని!