అన్వేషించండి

Ammayi garu Serial Today November 7th: అమ్మాయి గారు సీరియల్: అదిరిపోయిన ట్విస్ట్.. హారతి బిడ్డకు తండ్రి దీపక్ కాదు జీవన్.. రూప, రాజులకు దొరికిపోయారుగా!

Ammayi garu Today Episode హారతి బిడ్డ దీపక్ బిడ్డ కాదని జీవన్‌ బిడ్డ అని రాజు, రూపలకు అనుమానం రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode హారతికి న్యాయం చేస్తానని చెప్పి సూర్యప్రతాప్‌ ఇంటికి పంపిస్తాడు. డీఎన్ఏ టెస్ట్‌లో దీపక్‌నే ఆ బిడ్డకు తండ్రి అని తెలిస్తే అస్సలు వదలను షూట్ చేసి చంపేస్తా అని సూర్యప్రతాప్ విజయాంబికతో చెప్తాడు. సుమ, రూపలు మందారాన్ని ఓదార్చుతారు. విజయాంబిక గదిలోకి దీపక్‌ని తీసుకెళ్లి కొడుతుంది. ఈ విషయంలో నేను ఏం చేయలేను అని అంటుంది. 

విజయాంబిక: సమయానికి జీవన్ వచ్చి దేవుడిలా కాపాడాడు కాబట్టి సరిపోయింది లేదంటే మనం రోడ్డున పడేవాళ్లం.
దీపక్: మమ్మీ నిజంగా ఆ హారతి బిడ్డకు నేను తండ్రిని కాదు. హారతి నన్ను ఇరికించాలని చూస్తుంది.
విజయాంబిక: అప్పుడు మందారం విషయంలో ఇలాగే చెప్పావ్. నిన్ను నమ్మడం అంటే నా చెప్పుతో నేను కొట్టుకోవడమే.
దీపక్: మమ్మీ హారతితో నాకు పరిచయం ఉన్న మాట నిజమే  ఒకసారి పార్టీకి పిలిస్తే వెళ్లాను. డ్రింక్ చేశాను ఏం చేశానో తెలీదు. కానీ హారతి సడెన్‌గా ఒక రోజు పిలిచి తండ్రివి అయ్యావని చెప్పింది. అసలేం జరిగిందో నాకు తెలీదు మమ్మీ. కావాలంటే డీఎన్‌ఏ టెస్ట్‌కి రెడీ.
విజయాంబిక: నిన్ను నమ్మి డీఎన్‌ఏ టెస్ట్‌కి ఒప్పుకుంటే మందారం విషయంలో జరిగినట్లే అవుతుంది అప్పుడు నేను నీతో పాటు రోడ్డున పడాలి. ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయకు.
రూప: హారతి జీవన్‌లను గమనించావా రాజు ఎవరు చెప్పినా వినని హారతి జీవన్ సైగ చేయగానే వెళ్లిపోయింది ఏంటి.
రాజు: అంటే వాళ్లిద్దరి మధ్యలో ఏదో జరుగుతుంది అమ్మాయిగారు. అసలు ఆ జీవన్ గాడు హారతి వెళ్లగానే వెళ్లాడు అంటే హారతిని కలవడానికే వెళ్లుంటాడు. పదండి అమ్మగారు వెళ్దాం.

జీవన్ హారతి దగ్గరకు వెళ్తాడు. అంతా నువ్వనుకున్నట్లే చేశాను మై డియర్ జీవన్ అని హారతి అంటే యాక్టింగ్ ఇరగదీశావ్ మై డియర్ హారతి అంటాడు. నీ వల్ల ప్రెగ్నెంట్ అయి ఆ దీపక్ పిచ్చోడిని నమ్మించేశా అని అంటుంది. ఎలా వాడిని నమ్మించావు డియర్ అని జీవన్ అంటే ఆరోజు పార్టీ అని పిలిచి దీపక్‌తో ఫుల్లుగా తాగించి బెడ్ మీద పడుకునేలా చేసి ఉదయం లేచే సరికి నేను బొట్టు చెరిపేసుకొని ఇద్దరి మధ్య అంతా జరిగినట్లు నమ్మించానని అంటుంది. ఆ రాత్రిని వాడుకొని నెల తిరిగే లోపు దీపక్‌ని కళ్లు తిరిగే వార్త చెప్పానని అంటుంది. డీఎన్‌ఏ టెస్ట్ అంటే భయంగా ఉందని అంటుంది. ఇక తనని పెళ్లిచేసుకోమని హారతి జీవన్‌తో చెప్తుంది. జీవన్ సరే అంటాడు. రాజు రూపలు అక్కడికి వస్తారు. అచ్చం నీలాగే ఉన్నాడు నీ కొడుకు అని హారతి అనగానే జీవన్ తన మెడలో చైన్ తీసి బాబుకి వేస్తాడు.

రాజు: ఆ బిడ్డకి అసలైన తండ్రివి నువ్వు అన్నమాట. అవునా.
జీవన్: ఈబిడ్డకు నేను తండ్రి ఏంటి.
రూప: మరి అంత విలువైన చైన్ ఎందుకు ఇచ్చినట్లు హారతిని అంతలా ఓదార్చడం ఎందుకో.
జీవన్: సాయం చేయాలి అని ఇచ్చాను. ఇంకా కొంచెం టైం ఇక్కడే ఉంటే నాకు ఈ అమ్మాయికి పెళ్లి చేసేలా ఉన్నారే  అని వెళ్లిపోతాడు.
హారతి: నా బిడ్డకు తండ్రి దీపక్ జీవన్‌కి నాకు ఏం సంబంధం లేదు. మీరు నాకు న్యాయం  చేయకపోయినా పర్లేదు కానీ నా క్యారెక్టర్ బ్యాడ్ చేయకండి వెళ్లండి.
రూప: నాకు ఎందుకో జీవన్ మీద అనుమానంగా ఉందని రాజు. సాయం చేయాలి అంటే చైన్ చేతికి ఇవ్వొచ్చుకదా.
రాజు: వాడు అబద్ధం చెప్తున్నాడు అమ్మాయి గారు.

పోలీస్ స్టేషన్‌కి రేణుక పెళ్లి చేసుకున్న గొర్రె వస్తుంది. గొర్రె మాట్లాడటంతో అందరూ షాక్ అయిపోతారు. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చానని గొర్రె చెప్తుంది. తన భార్య వేరే పెళ్లి చేసుకొని మోసం చేసిందని చెప్తుంది. పోలీసు గొర్రె ముందు కూర్చొని వివరాలు అడగటం కామెడీగా ఉంటుంది. గొర్రెను కొట్టడానికి పోలీస్ వెళ్లడంతో గొర్రె కంప్లైంట్ తీసుకోకపోతే మీ మీద కంప్లైంట్ ఇస్తానని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: సత్యతో మసాజ్ చేయించుకోవాలని క్రిష్ తంటాలు.. కోడలికి షాక్ కొట్టించాలని భైరవి ప్లాన్!

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Aug 23rd: దొంగ చిట్టి గురించి నిజం తెలుసుకున్న విక్కీ...ఆస్తి కొట్టేయడానికి సుందరి వేసిన ప్లాన్ భగ్నం చేసిన రాధ
నువ్వులేక నేను లేను: దొంగ చిట్టి గురించి నిజం తెలుసుకున్న విక్కీ...ఆస్తి కొట్టేయడానికి సుందరి వేసిన ప్లాన్ భగ్నం చేసిన రాధ
Illu Illalu Pillalu Serial Today August 23rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 6 లక్షలు పోయావని గుర్తించిన చందు! తిరుపతి మీదకి నింద నెట్టేసిన వల్లీ! ప్రేమ, ధీరజ్‌ల గొడవ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 6 లక్షలు పోయావని గుర్తించిన చందు! తిరుపతి మీదకి నింద నెట్టేసిన వల్లీ! ప్రేమ, ధీరజ్‌ల గొడవ!
Podarillu Serial Today August 23rd: కేశవ్‌ ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న మాధవ్‌....శైలూకు మళ్లీ పెళ్లి ప్రయత్నాలు చేసిన తల్లిదండ్రులు
పొదరిల్లు: కేశవ్‌ ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న మాధవ్‌....శైలూకు మళ్లీ పెళ్లి ప్రయత్నాలు చేసిన తల్లిదండ్రులు
Karthika Deepam 2 Serial Today August 23rd: కార్తీకదీపం 2 సీరియల్: సంతకాలు పెట్టించి చెమటలు పట్టేసిన సూరజ్! ఏదో పెద్ద మోసమే! అమ్మని చూసి జ్యోత్స్న ఎమోషనల్!
కార్తీకదీపం 2 సీరియల్: సంతకాలు పెట్టించి చెమటలు పట్టేసిన సూరజ్! ఏదో పెద్ద మోసమే! అమ్మని చూసి జ్యోత్స్న ఎమోషనల్!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Toxic Pre Release Event : టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Adilabad Crime News: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Horror Thriller OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
Mirai Japan Advance Booking: జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
Embed widget