Ammayi garu Serial Today November 30th: అమ్మాయి గారు సీరియల్: చెల్లిని అడ్డు పెట్టుకొని జీవన్‌ని కట్టడి చేసిన రాజు, రూపలు.. చివరి నిమిషంలో శ్వేత ఎంట్రీ!
Ammayi garu Today Episode ఆస్తి పేపర్లు జీవన్‌కి ఇవ్వగానే శ్వేత వచ్చి వాటిని తీసుకొని చింపేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Ammayi garu Serial Today Episode జీవన్ సూర్యప్రతాక్‌కి తన మామయ్య చంద్ర వాటా అడుగుతాడు. చంద్ర, సుమలు తాము సూర్యప్రతాక్ నీడలో బతుకుతున్నాం మాకు ఏం ఆస్తిలో వాటా లేదని చెప్తారు. మామయ్యలు ఇద్దరూ రామలక్ష్మణుల్లా ఉన్నారని వీళ్లని ఎవరూ విడదీయలేరని అయితే ఇద్దరి పనులు వేరు వేరు కదా ఆస్తులు వేరుగా ఉంటాయి. ఉన్న ఆ ఆస్తులు తనకు ఇచ్చేయ్ మని అంటాడు.
సూర్యప్రతాక్: ఆపు పింకీ భర్తవి అని నిన్ను ఏం అనడం లేదు లేదంటే ఎప్పుడో చంపేసే వాడిని ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు..
జీవన్: సారీ మామయ్య ఇంకెప్పుడూ ఇలా మాట్లాడను. పింకీ ఇలా రా. పద మనం మన ఇంటికి వెళ్లిపోదాం. అక్కడ మాకు ఆస్తులు ఉన్నాయి డబ్బు ఉంది బిజినెస్‌లు ఉన్నాయి నిన్ను మహారాణిలా చూసుకుంటా. చూడు మామయ్య మీ ఇంట్లో ఉండి మా నాన్నకి డబ్బు అడిగితే బాగోదని అడిగాను అంతేకానీ మాకు ఆస్తులు లేక కాదు.
సూర్యప్రతాక్: అవసరం లేదు పింకీ ఇక్కడి నుంచి ఎక్కడికీ రాదు. నువ్వు అడిగినట్లే నీ పేరు మీద ఆస్తి రాసిస్తాను.
విజయాంబిక: మొత్తానికి సాధించేశాడు. నువ్వు ఉన్నావు పుట్టినప్పుటి నుంచి ఇక్కడే ఉన్నావు కానీ ఏం చేతకాదు.
చంద్ర: ఏం అంటున్నావ్ అన్నయ్య పింకీ కోసం నువ్వు ఇలా ఆస్తి ఇస్తా అనడం బాలేదు. దీనికి మేం ఒప్పుకోం.
సూర్యప్రతాక్: చంద్ర ఇప్పుడు ఆస్తి కన్నా పింకీ భవిష్యత్తే మనకి ముఖ్యం మనం ఏం చేసినా వాళ్ల సంతోషం కోసమే కదా రేపు లాయర్‌ని పిలిపించు.
రాజు: అమ్మాయి గారు మీరు అన్నట్లు ఇంట్లో వాళ్లని మనస్శాంతి లేకుండా చేయడమే వాడి టార్గెట్ కాదు ఇంకేదో పెద్ద ప్లాన్లోనే ఉన్నాడు. రేపు వాడికి ఆస్తి రాసిస్తే ఎలా అమ్మాయిగారు.
జీవన్: ఏంటి రాజు ఆస్తి నాకు రాకుండా ఎలా అని ప్లాన్ చేస్తున్నారా కష్టం రాజు మీరు ఏం చేసినా నన్ను అడ్డుకోలేరు
ఇంతలో జీవన్‌కి హారతి కాల్ చేస్తుంది. జీవన్ కంగారు పడి కాల్ కట్ చేస్తాడు. మళ్లీ జీవన్‌కి హారతి కాల్ చేస్తుంది. రూప జీవన్‌తో ముందు ఆ కాల్‌కి ఆన్సర్ చేయ్ టెన్షన్‌తో పోయేలా ఉన్నావని అంటుంది. హారతి జీవన్‌తో నీకు కాబోయే పెళ్లాం బిడ్డ కంటే ఆ నాటకం పెళ్లామే ఎక్కువ అయిపోయిందా అని అంటుంది. దాంతో జీవన్ నువ్వే ముఖ్యమని నేను బయటకు వస్తే పింకీతో నిజం చెపిస్తారని అంటాడు. ఇక బాబుకి ఫీవర్ అని నువ్వు ఉంటే బాగున్నని అంటుంది. దాంతో జీవన్ చిరాకు పడుతూనే ప్రేమగా మాట్లాడి డబ్బు పంపిస్తా బాబుని చూసుకో అని చెప్పి తాను ఫోన్ చేసే వరకు ఫోన్ చేయొద్దని చెప్తాడు. జీవన్ మాటలు విజయాంబిక, దీపక్ వింటారు. దానికి జీవన్ హారతి గురించి తెలిసిపోయిందని భయపడితే విజయాంబిక ఆస్తి గురించి మాట్లాడుతుంది. ఇక జీవన్ రిలాక్స్ అయిపోతాడు.
ఉదయం లాయర్ ఇంటికి వస్తాడు. అందరూ హాల్ లోకి చేరుకుంటాడు. చంద్ర ఆస్తి పంచడం ఇష్టం లేదని అంటే ఆస్తి వాటాలు వేయడం లేదని నీకోసం ప్రత్యేకంగా కొని ఉంచిన ఆస్తిని పింకీ కోసం ఇస్తున్నానని అంటాడు. ఆస్తి పేపర్లు లాయర్ సిద్ధం చేయగా సూర్యప్రతాక్ సంతకం పెడతాడు. జీవన్ మనసులో వీళ్ల ఆస్తులు ఇంత ఈజీగా నాకు దొరుకుతాయని అనుకోలేదని అనుకుంటాడు. సూర్యప్రతాక్ చంద్రతో పింకీ భవిష్యత్‌కి అంతా మంచే జరగాలని కోరుకొని సంతకం పెట్టమని అంటారు. అలాగే చంద్ర పెడతాడు. లాయర్ వాటిని జీవన్‌కి ఇస్తాడు. ఇంతలో శ్వేత వచ్చి వాటిని తీసుకుంటుంది.
శ్వేత తన అన్న నిర్ణయానికి అన్న తరఫున అందరికీ క్షమాపణ చెప్తుంది. జీవన్ షాక్ అయిపోతాడు. అన్నయ్య నిన్ను నా నుంచి ఎవరైనా దూరం చేస్తే ఎలా ఫీలవుతావు అంటే జీవన్ అలా ఎవరైనా చేస్తే చంపేస్తా అంటాడు. ఆడపిల్ల నేను వెళ్లి పోవాల్సిన దాన్ని అలాంటి నేను విడిపోతా అంటే నువ్వు ఒప్పుకోవు. అలాంటిది అన్నదమ్ముళ్లు విడిపోకూడదని మన వల్ల వీళ్లు విడిపోకూడదని అంటుంది. నా సంతోషం కోసం ఈ ఆస్తిని వదిలేయమని అంటుంది. శ్వేత ఆ పేపర్లు చింపేస్తుంది. శ్వేత జీవన్ ప్లాన్ ఇలా పాడుచేసిందేంటి అని విజయాంబిక వాళ్లు అనుకుంటారు.
జీవన్ శ్వేతని పక్కకు తీసుకెళ్లి నీ కోసం ఇలా చేస్తే నువ్వు ఇలా చేశావేంటి అని తిడతాడు. ఇక రాజు, రూపలు వస్తారు. ఇద్దరూ శ్వేతకి థ్యాంక్స్ మంచిగా ఆలోచించావని చెప్తారు. ఫ్లాష్ బ్యాక్‌లో రాజు, రూపలు శ్వేతని కలిసి మీ అన్న ఆస్తి విడదీయాలని అనుకున్నాడని మీ అన్న ఆస్తి తీసుకుంటే నీకు గోపీకి పెళ్లి అయిన ఫొటోలు నెట్‌లో పెడతామని బెదిరిస్తారు. దాంతో శ్వేత అన్నని ఆపుతానని మాటిస్తుంది. ఇక సూర్యప్రతాక్ మరో ఆస్తి పేపర్లు కూడా సిద్ధం చేస్తాడు. రాజుతో రాజు జీవన్ నిన్ను అనుమానించినా అందులో నీకు మంచే జరిగిందని అంటాడు. దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.