అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today November 29th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహాలక్ష్మీకి సినిమా చూపించిన అత్తాకోడళ్లు.. తప్పతాగి కోతిలా గంతులేసిన మహా!

Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మీ విద్యాదేవిని చూసి భయపడటం ఇంట్లో రచ్చ రచ్చ చేయడంతో అందరూ మహాకి పిచ్చి అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీకి సీఐ కాల్ చేసి జైలులోనే విద్యాదేవి ఉందని కానిస్టేబులు సుశీల చెప్పిందని చెప్తాడు. దాంతో మహాలక్ష్మీ షాక్ అయిపోతుంది. విద్యాదేవి జైలులో ఉంటే ఇంట్లో తాను చూసింది ఎవర్ని అని ఆలోచిస్తుంది. అందరూ మహాలక్ష్మీకి ఏదో అయిందని అనుకుంటారు. హాస్పిటల్‌కి వెళ్దామని రామ్ అంటే ఏం కాలేదని బాగానే ఉన్నానని మహాలక్ష్మీ అంటుంది.

చలపతి: నిన్ను చూస్తే భయంగా ఉంది చెల్లాయ్ ఎవరి పీకో పట్టుకొనేలా ఉన్నావ్.
సీత: అంటే అత్తయ్యకు పిచ్చి పట్టిందని ఫిక్స్ అయిపోయారా బాబాయ్. 
రామ్: ఏంటి సీత ఆ మాటలు పద పిన్ని కేక్ కట్ చేద్దాం.
జనార్థన్: గెస్ట్‌లు అందరూ నిన్నే చిత్రంగా చూస్తున్నారు మహా ఈ ఫంక్షన్ అయ్యే వరకు కుదురుగా ఉండు. 
రామ్: చక్కగా ఉండండి పిన్ని లేదంటే సాటి బిజినెస్ వాళ్ల దగ్గర పరువుపోతుంది.
మహాలక్ష్మీ: మీరేం వర్రీ అవ్వొద్దు. నేను బాగానే ఉన్నాను నైట్ సరిగా నిద్ర లేక ఇలా అవుతుంది. కాస్త జూస్ తాగి వస్తా సెట్ అవుతుంది.

మహాలక్ష్మీ కిచెన్‌కి వెళ్తే అక్కడ విద్యాదేవి నవ్వుతూ కనిపిస్తుంది. మహాలక్ష్మీ అంతా భ్రమ అనుకుంటుంది. జ్యూస్ తీసుకొని తాగుతుంది. నువ్వు అక్కడ లేవని నాకు తెలుసు ఉన్నావని అందికీ పిలిస్తే నేను పిచ్చిదాన్ని అవుతా అనుకొని మహాలక్ష్మీ వెళ్లిపోతుంది. ఇక సీత వచ్చి ఏంటి అత్తమ్మ మిమల్ని చూసి కూడా అత్తమ్మ ఏం అనకుండా వెళ్లిపోయిందని అడుగుతుంది. ఇక నేను ఇచ్చిన పౌడర్ అత్తయ్య తాగిందా అని అడిగితే జ్యూస్‌లో కలిపాను మహాలక్ష్మీ తాగిందని విద్యాదేవి చెప్తుంది. 

మహాలక్ష్మీ జ్యూస్‌లో కలిసిన పౌడర్ వల్ల మత్తు మత్తుగా ప్రవర్తిస్తుంది. కేక్ కట్ చేద్దామని జనార్థన్ చెప్తాడు. మత్తులో మహాలక్ష్మీ డ్యాన్స్ చేయకుండా కేక్ కటింగ్ ఏంటి అని అంటుంది. అందరూ వింతగా చూస్తారు. మహాలక్ష్మీ మాత్రం బ్రేక్ డ్యాన్స్, మాస్ డ్యాన్స్, అని రకరకాల పేర్లు చెప్పి తూగుతుంది. రామ్ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే నేను డ్యాన్స్ చేయాలని చెప్పి జనార్థన్‌ని లాక్కొచ్చి లాలూ దర్వాజ పాటకు డ్యాన్స్ చేస్తుంది. అందరూ పరువు పోయిందని అనుకుంటే సీత మాత్రం నవ్వుకుంటుంది. మధ్యలో అడ్డుకున్న అర్చనను కొడుతుంది. ఎవరు ఆపినా ఆగకుండా డ్యాన్స్ చేసి మత్తుతో పడిపోతుంది. సీత నీరు తీసుకొచ్చి ముఖం మీద చల్లి మహాలక్ష్మీని లేపి మా రిసెప్షన్ రోజు నన్ను పిచ్చిదాన్ని చేశారు కదా మీ మీద రివేంజ్ తీర్చుకున్నా అంటుంది. దాంతో మహాలక్ష్మీ సీత మీద కంప్లైంట్ ఇస్తే జనార్థన్, రామ్ ఇద్దరూ మహాలక్ష్మీని పిచ్చిగా ప్రవర్తిస్తున్నావని కోప్పడతారు. అందరూ పిచ్చి పట్టిందని దెయ్యం పట్టిందని అంటారు. మహాలక్ష్మీ అందరికీ సారీ చెప్పి ఇప్పుడే వస్తానని కిచెన్ గదిలోకి వెళ్తుంది. 

విద్యాదేవి కోసం మొత్తం వెతుకుతుంది. విద్యాదేవిని గదిలో చూసి డోర్ లాక్ వేసి సీఐకి కాల్ చేసి సుమతి మా ఇంట్లో ఉంది వెంటనే రండి అని పిలుస్తుంది. పోలీసులు ఇంటికి వస్తారు. ఎందుకు పోలీసులు వచ్చారంటే  ఇంట్లో పడిని విద్యాదేవి అనే దొంగని పట్టివ్వడానికి వచ్చానని చెప్తుంది. అందర్ని తీసుకొని గది దగ్గరకు వెళ్తుంది. లోపల చూస్తే విద్యాదేవి ఉండదు. అందరూ మహాలక్ష్మీని పిచ్చిదానిలా చూస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీని హగ్ చేసుకొని సెల్ఫీ తీసుకున్న మిత్ర.. ఇదేం ట్విస్ట్‌రా బాబోయ్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
CM Chandrababu: తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Crime News:  టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మోదీ పాటలు వింటారా? ప్రధాని నుంచి ఊహించని రిప్లైసీపీ ముందు విష్ణు, మనోజ్ - ఇదే లాస్ట్ వార్నింగ్!Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desamగూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
CM Chandrababu: తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Crime News:  టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Chiranjeevi Rajyasabha:  రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Avanthi Srinivas Resign To YSRCP: వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
Embed widget