Ammayi garu Serial Today November 28th: అమ్మాయి గారు సీరియల్: రాఘవ రాకుండా ఆపింది ఎవరు? విరూపాక్షికి ఘోర అవమానం!
Ammayi garu Today Episode రాఘవని ఇంట్లోకి వచ్చే టైంలో ఎవరో తల మీద కొట్టేసి ఇంట్లోకి రానివ్వకుండా ఆపడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Ammayi garu Serial Today Episode రూప తల్లి విరూపాక్షిని తీసుకొని ఇంటికి వస్తుంది. విరూపాక్షిని చూసి సూర్యప్రతాప్ అపురూప మీద కోప్పడతాడు. ఇప్పటికే చాలా సార్లు చెప్పాను మళ్లీ మళ్లీ చెప్తున్నా ఈ మనిషి ఇంట్లో అడుగుపెట్టొద్దని అంటాడు. బయటకు పంపేయమని అంటాడు.
రూప: నాన్న మీరు చెప్పినట్లే పంపేస్తా కాకపోతే కాసేపు ఆగండి నాన్న.
విజయాంబిక: గుడిలో కాపాడినందుకు నీకు విరూపాక్షి మీద ప్రేమ ఉందని అనుకొని ఇంటికి తీసుకొచ్చినట్లుంది రూప.
రఘు: విజయాంబిక.
విజయాంబిక: అవును విజయాంబికనే మాట్లాడుతున్నా తమ్ముడు వీళ్ల ప్లాన్‌లో భాగంగానే ఈయన కూడా ఇంటికి వచ్చారు. నాకు పిచ్చి ఉందని నమ్మించి విరూపాక్షి విషయంతో నేను తప్పు చేశానని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు తమ్ముడు.
సూర్యప్రతాప్: అక్క ఎవరు ఎన్ని ప్లాన్‌లు వేసినా నాకు తగిలిన గాయాన్ని చెరపలేరు. నేను పడిన బాధ మరిపించలేరు.
రఘు: బావగారు మీకు తగిలిన గాయం మాన్పించకపోవచ్చు కానీ మీ గాయానికి కారణం మా చెల్లి విరూపాక్షి కాదని తెలుస్తుంది.
విజయాంబిక: వీళ్లంతా కలిసి మా తమ్ముడిని నమ్మించేలా ఉన్నారు దీనంతటికి రాఘవ ఇంటికి రాకుండా ఉంటేనే తమ్ముడు నమ్మడు.
రూప: నాన్న మామయ్య చెప్పినట్లు నేను కాసేపట్లో నిజం నిరూపిస్తాను.
సూర్యప్రతాప్: నాకు ఏం నిజం తెలుసుకోవాలని లేదు ఈ మనిషిని పంపేయండి.
విరూపాక్షి: వెళ్లిపోతా సూర్య కానీ నువ్వు నిజం తెలుసుకొని నీ విరూపాక్షి ఏ తప్పు చేయలేదని నమ్మితే చాలు.
రూప: ఆగమ్మా రాజు రాఘవని తీసుకొని వస్తున్నాడు.
సూర్యప్రతాప్: రాఘవ ఏంటి ఇప్పుడు ఆ దరిద్రుడు మన ఇంటికి ఎందుకు వస్తున్నాడు. అసలు రాజుకి నీకు ఏమైంది రూప వాడు నాకు ఎదురు పడితే ఆ క్షణమే వాడిని చంపేస్తా.
రఘు: అలా చేస్తే మీకు తెలియాల్సిన నిజాన్ని మీరే చంపుకున్నట్లు అవుతుంది బావగారు. ఈ విజయాంబికే రాఘవని బెదిరించి రాష్ట్రంలో లేకుండా చేసింది అందుకే వాడు కేరళలో తల దాచుకున్నాడు. రాఘవని ఈ విజయాంబికే కిడ్నాప్ చేయించింది ఎక్కడ దాచిందో కూడా తనే ఒప్పుకుంది చెప్పింది. అందుకే రాజు వెళ్లాడు. కాసేపు ఓపిక పడితే రాజు, రాఘవ వస్తే అన్ని నిజాలు బయట పడతాయి. అప్పుడు ఇంట్లో ఉండాల్సింది ఎవరో బయటకు వెళ్లాల్సింది ఎవరో తెలుస్తుంది.
విజయాంబిక: తమ్ముడు వీళ్లంత కలిసి నిన్నూ నన్నూ దూరం చేయాలని చూస్తున్నారు.
సూర్యప్రతాప్: అక్కా ఎవరు ఏం చేసినా తప్పు నిజం అయిపోదు వీళ్లు చెప్పినట్లే కాసేపు ఎదురు చూద్దాం.
విరూపాక్షిని లోపలికి తీసుకెళ్తారు. ముత్యాలు అప్పలనాయుడు విరూపాక్షికి న్యాయం జరగాలని కోరుకుంటారు. అందరూ రాఘవ రాక కోసం ఎదురు చూస్తారు. మరోవైపు రాఘవ అమ్మగారి మీద పడిన నిందలు చెరిపేయాలని అనుకొని ఇంటికి వస్తుంటాడు. ఇంతలో ఓ వ్యక్తి ముసుగు వేసుకొని రాఘవ ఇంట్లోకి రాకుండా తల మీద కొట్టి లాక్కొని వెళ్లిపోతాడు. అప్పుడే రాజు ఇంటికి వస్తాడు. రూప దగ్గరకు వెళ్లి రాఘవ వచ్చాడా అంటే నువ్వు తీసుకురాలేదా అని రూప అడుగుతుంది. లేదని రాజు చెప్తాడు. రౌడీలు తనని అడ్డుకోవడంతో రాఘవని తప్పించి ఇంటికి వెళ్లమని అంటాడు. ఆ మాట వినగానే జీవన్ నవ్వుతాడు. విజయాంబిక దీపక్ రాఘవని తప్పించేశాడని ఊపిరి పీల్చుకుంటుంది.
ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని రఘు అంటాడు. ఇంతలో దీపక్ ఇంటికి వస్తే రాజు దీపక్ కాలర్ పట్టుకొని రాఘవని ఏం చేశావని అడుగుతాడు. తనకు రాఘవ ఎవరో తెలీదని అమ్మ కోసం మందులు తీసుకురావడానికి వెళ్లానని అంటాడు. ఇదంతా విరూపాక్షి ప్లాన్ అని విజయాంబిక సూర్యప్రతాప్‌కి ఎక్కిస్తుంది. సూర్యప్రతాప్ విరూపాక్షిని తిడతాడు. జ్ఞాని అయిన మా బావగారినే మార్చేశావు అంటే నువ్వేంటో తెలుస్తుందని విరూపాక్షితో అంటాడు. ఇంకోసారి ఇలాంటి ప్లాన్స్ చేస్తే ఈ సూర్య చనిపోతాడని అంటాడు. విరూపాక్షిని జుట్టు పట్టుకొని గెంటేస్తా అని విజయాంబిక అంటే నిజం తెలిసిన రోజు నువ్వు నా కాళ్లు పట్టుకొనే రోజు వస్తుందని చెప్పి విరూపాక్షి వెళ్లిపోతుంది.. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఊరుని ఇంటిని చూసి గతం గుర్తుచేసుకొని ఎమోషనలైన లక్ష్మీ.. తగలబెట్టేస్తానంటోన్న మనీషా!