Ammayi garu Serial Today November 14th: అమ్మాయిగారు సీరియల్: కోమలి ప్రెగ్నెన్సీ నాటకం, అసలు నిజం ఏంటి? భరి తెగించేసిన విజయాంబిక!
Ammayi garu Serial Today Episode November 14th కోమలి ప్రెగ్నెంట్ కాదు అని కోమలితో పాటు రూప, రాజు, విరూపాక్షిలకు తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రాజుకి విరూపాక్షి ఫోన్ చేసి త్వరగా ఇంటికి రమ్మని పిలుస్తుంది. ఏమైంది అమ్మగారు అని రాజు అడిగితే ఏమైంది అంటే ఏం చెప్పాలి రాజు.. కోమలి ప్రెగ్నెంట్ అయింది అని అంటుంది. కోమలి ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి అని రాజు ఫాస్ట్‌గా ఇంటికి వస్తాడు.
విరూపాక్షి రాజుతో కోమలి ప్రెగ్నెంట్ అవ్వడానికి నువ్వే కారణం అని అందరూ నమ్ముతున్నారు.. సూర్య కూడా నమ్ముతున్నాడు అని చెప్తుంది. గతంలో రాజు, రూపలకు కోమలి ఇచ్చిన వార్నింగ్ రాజు గుర్తు చేసుకొని ఇది కొత్త నాటకం అని అంటాడు. కోమలిని చూస్తే అలా అనిపించడం లేదు అని అంటుంది. విరూపాక్షి చాలా కంగారు పడితే ఏం కాదు అమ్మా నువ్వు భయపడకు అని రూప అంటుంది. భయపడకుండా ఎలా ఉండాలి రూప.. మనం ఏం చెప్పినా మీ నాన్న నమ్మడం లేదు.. ఇప్పుడు కొత్తగా ఈ ప్రెగ్నెంట్ నాటకం ఆడుతుంది. రోజు రోజుకి తన మీద మీ నాన్నకి ప్రేమ పెరిగిపోతుంది. ఇది ఇలాగే అయితే కష్టం.. రాజు నేను చెప్తే మీ పెద్దయ్య నమ్మడం లేదు.. నువ్వే వెళ్లి తనకు నీకు ఏం సంబంధం లేదని బలంగా చెప్పు అని విరూపాక్షి అంటుంది. ఈ రోజుతో తన ఆట ముగిస్తాను.. ఇప్పుడే ఆ కోమలి సంగతి తేల్చుతా అని రాజు వెళ్తాడు.
కోమలి కూడా తను ప్రెగ్నెంట్ అనడంతో ఆలోచనలో పడుతుంది. నాకు తెలీకుండా నేను ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి.. అసలు నాకు కళ్లు ఎందుకు తిరిగాయి.. నేను నిజంగానే ప్రెగ్నెంట్ అయ్యానా అని ఆలోచిస్తుంది. దీపక్ సిగ్గు పడటం గుర్తు చేసుకొని గతంలో దీపక్ తనని ప్రేమిస్తున్నాను అని చెప్పడం గుర్తు చేసుకొని దీపక్ నా మీద ఏమైనా అఘాయిత్యం చేశాడా అని ఆలోచిస్తుంది. అలా కాదులే అనుకుంటుంది. రాజు, రూపలు ఈ విషయాన్ని అశోక్‌కి చెప్పి నన్ను ఇరికిస్తారు. వాళ్లు చెప్పే కంటే నేను చెప్తే బెటర్ అని కోమలి అశోక్‌కి కాల్ చేస్తుంది.
కోమలి అశోక్‌కి కాల్ చేసి ఏడుస్తుంది. అశోక్ చాలా కంగారు పడతాడు. ఏమైంది కోమలి చెప్పు అని అడుగుతాడు. కోమలి అశోక్‌కి విషయం చెప్పగానే.. ఏంటి ప్రెగ్నెంటా అని అశోక్ షాక్ అయిపోతాడు. నేనే తప్పు చేయలేదు అశోక్ అని కోమలి ఏడుస్తుంది. అశోక్ కోపంగా నోర్ముయ్‌వే.. నాటకాలు అడుగుతున్నావా.. నీకు తెలీకుండా నీకు కడుపు ఎలా వస్తుందే.. నువ్వు ఆస్తి కోసం ఆశపడి ఆ రాజుతో కడుపు తెచ్చుకొని నాకు ఏం తెలీదు అంటావా.. ఈ రోజు నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని అశోక్ కాల్ కట్ చేసేస్తాడు. తీరా చూస్తే ఇదంతా కోమలి కల.. అశోక్ కోమలితో ఏం జరిగింది అని అంటే విషయం చెప్పకూడదు అని కోమలి అనుకుంటుంది.
ఏం లేదు అని చెప్పి నాకు ఇక్కడ ఉండాలి అంటే భయంగా ఉంది.. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపో అశోక్ అని చెప్తుంది. నీకు ఉన్న భయమే నాకు ఉంది కోమలి.. కోట్లు వస్తాయి అని అనుకున్నా కానీ నువ్వు భయపడితే నేను చూస్తూ ఉండలేను.. ఇప్పుడే నిన్ను తీసుకెళ్లి పోతా అని అంటాడు. కోమలి అశోక్‌ని ఇంటి బయట ఉండమని చెప్పి హడావుడిగా బట్టలు సర్దేస్తుంది.
కోమలి వెళ్లే టైంకి విజయాంబిక, దీపక్ వచ్చి అడ్డుకుంటారు. నువ్వు భయపడాల్సినంత ఏం లేదు కోమలి.. అసలు నువ్వు ప్రెగ్నెంటే కాదు అని అంటుంది. కోమలి షాక్ అయిపోతుంది. డాక్టర్‌తో నేనే అలా చెప్పించా అని.. నువ్వు కళ్లు తిరిగి పడిపోయినట్లు కూడా నేనే చేశాను.. అని నువ్వు తాగిన పాలలో మత్తు మందు కలిపా అని చెప్తుంది. ఇదే నిజం అని దీపక్ మీద ఒట్టేస్తుంది. కోమలి ఊపిరి పీల్చుకుంటుంది. నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని కోమలి అంటే నువ్వు దొరికిపోతావని చెప్పలేదు అని విజయాంబిక అంటుంది. నువ్వు ప్రెగ్నెంట్ అని నాటకం అడ్డుపెట్టుకొని ఆస్తి మొత్తం రాయించుకుంటా అని విజయాంబిక అంటుంది. దాంతో కోమలి డ్రాప్ అయిపోతుంది.
విరూపాక్షి, రూప, రాజులు వచ్చి మొత్తం వింటారు. ఏం ప్లాన్ చేశావే అని విరూపాక్షి అంటుంది. లేని కడుపు ఉందని చెప్పి ఎంత బాగా నటించావే.. ఏయ్ విజయాంబిక ఎంత బాగా మ్యానేజ్ చేశావే ఇవన్నీ నీ వల్లే సాధ్యమవుతాయి,, ఏయ్ కోమలి వీళ్లకి అంటే బుద్ధి లేదు నీకు లేదా అని అంటుంది. నేను ముందే ఊహించా విజయాంబిక.. వాళ్లు నీకు తెలీకుండా ప్లాన్ చేశారు.. ఇప్పటికైనా నీకు అర్థం కాలేదా వాళ్లు ఎంత డేంజరో అని రాజు అడుగుతాడు.
రూప కోమలితో నీకు తెలీకుండా నీ జీవితాన్ని చాలా రిస్క్‌లో పెట్టుకున్నావ్ కోమలి. మా నాన్న దగ్గర ఆస్తి రాయించుకోవడం అంటే డాక్టర్ దగ్గర అబద్ధం చెప్పినంత ఈజీ కాదు అని అంటుంది. రాజు విషయం పెద్దయ్యకి చెప్తా అంటే రూప ఆపి తనకి ఇప్పుడే తెలిసింది కదా చివరి అవకాశం ఇద్దాం.. నీ మేలు కోరి చెప్తున్నా నువ్వే వెళ్లి నీ తప్పు ఒప్పుకో అని అంటుంది. రాజు పెద్దయ్యకి విషయం చెప్తా అని వెళ్లబోతే విజయాంబిక ఆపేస్తుంది. నువ్వు నిజం చెప్తే మమల్ని మోసగాళ్లు అని గెంటేస్తారు అనుకున్నావా.. కోమలి గురించి నువ్వు ఏం చెప్పాలి అనుకున్నా నమ్మే పరిస్థితిలో మీ పెద్దయ్య లేడు.. ఇంట్లో జరుగుతుంది చూస్తే అర్థం కావడం లేదా ఈ కోమలి తన గుండె చప్పుడుగా మారింది అని.. ఇప్పుడు నువ్వు నిజం చెప్తే ఆ గుండె ఆగిపోతుంది అని విజయాంబిక అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















