Ammayi garu Serial Today july 2nd: అమ్మాయిగారు సీరియల్: రారండోయ్ వేడుక చూద్దాం.. సూర్యవిరూపాక్షిల సాక్షిగా ఒక్కటైన రాజురూప
Ammayi garu Today Episode రూప, రాజుల పెళ్లి సూర్య, విరూపాక్షిల చేతుల మీదగా అంగరంగ వైభవంగా జరగడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode బంటీ సూర్యప్రతాప్‌తో తన తండ్రి రాజుకి రుక్మిణి అమ్మకి పెళ్లి చేయమని అడుగుతాడు. సూర్యప్రతాప్ రుక్మిణితో పీటల మీద పెళ్లి ఆగిపోవడం ఏ ఆడపిల్లకి మంచిది కాదు నన్ను క్షమించు అమ్మా అంటాడు. ఇక దీపక్‌కి మెలకువ వస్తుంది. తల్లి ముఖం మీద నీరు కొట్టి విజయాంబికను లేపుతాడు.
దీపక్ తల్లితో జరిగింది మర్చిపోయావా మమ్మీ రూప గురించి మామయ్యకి చెప్పాలి పద అని పరుగులు తీస్తారు. వెళ్లే సరికి డోర్ తెరుచుకోదు. మండపంలో ఏం జరుగుతుందో అని టెన్షన్ పడతారు. రుక్మిణి తండ్రితో నువ్వు నా మంచి కోసమే తాపత్రయపడ్డావ్ ఈ పెళ్లి ఆగిపోయింది అని నేను ఫీలవ్వడం లేదు నాయనా.. ఇది ఆగిపోయింటే అంటే ఇంతకంటే మంచి సంబంధం వస్తుంది అని అంటుంది. సూర్యప్రతాప్ రుక్మిణితో నువ్వు ఒకే అంటే ఇప్పుడే నీ పెళ్లి చేస్తా అంటారు. రుక్మిణి కంగారు పడుతుంది. ఇప్పుడే అంటే ఎలా నాయనా అంటుంది.
సూర్యప్రతాప్ రుక్మిణితో తప్పడం లేదు అమ్మా అని రాజుని పిలుస్తాడు. రూప తల్లిని చూసి హ్యాపీగా ఫీలవుతుంది. తర్వాత సూర్యప్రతాప్ రుక్మిణితో రాజు చాలా మంచోడమ్మా ఒక మనిషిని నమ్మతే ప్రేమికుడు అవుతాడు. రక్షకుడు అవుతాడు నిన్ను బంగారంలా చూసుకుంటాడు అని గొప్పగా చెప్తాడు. నీకు అభ్యంతరం లేకపోతే రాజుని పెళ్లి చేసుకుంటావా అంటాడు. రూప మనసులో చేసుకుంటా నాన్న అప్పుడు అమ్మ చేతితో జరిగిన పెళ్లి ఇప్పుడు మీ ఇద్దరి చేతుల మీదగా జరిగితే హ్యాపీ అనుకుంటుంది. దీపక్, విజయాంబికలు ఎలా అయినా రూప, విరూపాక్షిల గురించి చెప్పాలి అనుకుంటారు. వీడియో తీయడం గుర్తొచ్చి ఫోన్ గురించి చూస్తే ఫోన్ ఉండదు. దాంతో దీపక్ తల్లితో మళ్లీ దెబ్బ కొట్టారు మమ్మీ అని అంటాడు.
బంటీ రుక్మిణి దగ్గరకు వెళ్లి అమ్మ నా కోసం ఈ పెళ్లికి ఒప్పుకో అని అడుగుతాడు. విరూపాక్షి కూడా రుక్మిణితో ఒప్పుకో అమ్మ రాజు లాంటి మంచి వ్యక్తి భర్తలా రావడం అంటే చాలా అదృష్టం ఉండాలి. ఈ అవకాశం మళ్లీ రాదు ఒప్పుకో అమ్మా అంటుంది. చంద్ర కూడా ఒప్పుకో అని అంటాడు. రుక్మిణి అందరితో మీ అందరూ ఇంతలా చెప్తున్నారు కదా ఒకే అని అంటుంది. ఇక నాయనతో బావగారికి ఇష్టమో లేదో అడగండి అని అంటుంది. దానికి రాజు పెద్దయ్య గారు మాటే నాకు శాసనం ఆయన చెప్పాలి కానీ నా తల అయినా తీసి ఇచ్చేస్తా అంటాడు. బంటీ తండ్రితో తల తీసి ఇవ్వొద్దు కానీ వచ్చి పెళ్లి పీటల మీద కూర్చొని అమ్మని పెళ్లి చేసుకోనాన్న అంటాడు.
రాజు పెళ్లి పీటల మీద కూర్చొంటాడు. పంతులు పెళ్లి కూతురు తల్లిదండ్రుల్ని రమ్మని పిలుస్తాడు. సూర్యప్రతాప్ గతంలో విరూపాక్షి రాఘవతో తప్పు చేసినట్లు తలచుకొని ఆగిపోతాడు. రుక్మిణి రమ్మని పిలుస్తుంది. సూర్యప్రతాప్ వస్తాడు. రాజు, రూపలు చాలా సంతోషపడతారు. సూర్యప్రతాప్ రాజు కాళ్లు కడగడానికి కాళ్లు పట్టుకుంటే రాజు వద్దని అంటాడు. సూర్యప్రతాప్ ఉండు రాజు అని కాళ్లు కడుగుతాడు. విరూపాక్షి, సూర్యప్రతాప్ దగ్గరుండి కన్యాదానం చేస్తారు. రూప రాజుని చూసి తండ్రిని చూపించి సైగ చేస్తుంది. అందరూ చాలా సంతోషపడతారు. కన్యాదానం చేసి నీళ్లు నెత్తిమీద చల్లుకుంటారు. అందరూ చాలా సంతోషపడతారు.
రాజు రూపలు జీలకర్రా బెల్లం పెట్టుకుంటారు. ఇక దీపక్ డోర్ తన్ని డోర్ తీస్తాడు. విజయాంబిక దీపక్‌తో చైతన్య రూపల పెళ్లి జరిగిపోతే అదే వాళ్లకి పెద్ద శిక్ష మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ పెళ్లి ఆగే పరిస్థితి వస్తే నిజం చెప్పేద్దాం ఇద్దరూ పరుగులు తీస్తారు. ఇంతలో రాజు రూపకి తాళి కట్టేస్తాడు. రాజు, రూపల పెళ్లి చూసి తల్లీకొడుకులు బిత్తరపోతారు. రూప తాళికి దండం పెట్టుకొని విజయాంబికను చూసి కళ్లు ఎగరేసి తాళి చూపిస్తుంది. విజయాంబిక నిజం చెప్పాలని వెళ్తే నిరూపించడానికి మన దగ్గర సాక్ష్యం లేదు అని దీపక్ ఆపేస్తాడు.
రాజు రూపలు దండలు మార్చుకుంటారు. సందడిగా తలంబ్రాలు పోసుకుంటారు. ఉంగరం ఆట ఆడుతారు. తర్వాత ఏడు అడుగులు వేస్తారు. రూప మేనత్తని చూసి నవ్వుతుంది. విజయాంబిక ఏం చేయలేక ముఖం తిప్పేసుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్ ప్రోమో: విరూపాక్షి గ్యాంగ్ గెలిచిందోచ్.. ఈ సారి తల్లిదండ్రుల చేతుల మీదగా 'రూపాకల్యాణం'





















