Ammayi garu Serial Today july 11th: అమ్మాయి గారు సీరియల్: ఇళ్ల స్థలాల కుంభకోణంలో చిక్కుకున్న ఎమ్మెల్యే విరూపాక్షి.. రెచ్చిపోయిన సూర్య!
Ammayi garu Today Episode విరూపాక్షి పేదల భూమి కొట్టేసిందని పేదలు ఇంటికి వచ్చి గొడవ చేయడం సూర్య విరూపాక్షిని దారుణంగా తిట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రూప బంటీని తన ఒడిలో పడుకోపెట్టుకొని రాజుతో మన ప్రాబ్లమ్స్ సగం క్లియర్ అయిపోయావి రాజు రాఘవ వస్తే అమ్మా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే ఇక అంతా హ్యాపీనే అని అంటుంది. రాజు రూపతో అంతా మంచే జరుగుతుంది ఆనంద్ రాఘవ కోసం వెతుకుతున్నాడు రాఘవ దొరుకుతాడు అని అంటాడు.
ఇంతలో విజయాంబిక చప్పట్లు కొట్టుకుంటూ వస్తూ బాగానే కలలు కంటున్నారు. మీ నాటకం బయట పడని వరకే మీ ఆటలు నిజం తెలిస్తే మీకు ఉంటుంది అని అంటుంది. రాజు రూపలతో మీరు నాటకం ఆడుతున్నా మీ వెనక ఉంది ఆ విరూపాక్షి అందుకే ముందు దాని సంగతి చూస్తా అంటుంది. విరూపాక్షికి ఈ ఇంట్లో ఇదే చివరి రాత్రి రేపు ఉదయం మీ అమ్మకి ఉంటుంది అని అంటుంది. నేను రాజు ఉండగా మా అమ్మని ఏం చేయలేవు అని చెప్పాను కదా అని రూప అంటే ఇదే మాట రేపు ఉదయం చెప్పు అని విజయాంబిక వెళ్లిపోతుంది. రాజు, రూపలు ఏం జరుగుతుందా అని టెన్షన్ పడతారు.
ఉదయం పేద ప్రజలు సీఎం ఇంటికి వచ్చి విరూపాక్షి డౌన్ డౌన్ అని అంటారు. అందరూ బయటకు వస్తారు. సూర్యప్రతాప్ కూడా వస్తారు. విషయం ఏంటి అని సూర్యప్రతాప్ అడిగితే ఎమ్మెల్యే విరూపాక్షి గారు వీళ్లకి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి అందరి దగ్గర డీడీలుగా డబ్బు తీసుకున్నారని కానీ మమల్ని ముంచేశారని పేద ప్రజలు అంటారు. నేను మిమల్ని మోసం చేయడం ఏంటి అని విరూపాక్షి అంటుంది. ఏమైందని సూర్యప్రతాప్ అడిగితే మాకు ఇళ్ల స్థలాలకు ఇస్తానని చెప్పిన భూమిని అమ్మేశారు అని చెప్తారు. అందరూ షాక్ అయిపోతారు. అమ్మగారు అలా ఎందుకు చేస్తారని రాజు అంటాడు.
విరూపాక్షి వెనక సూర్యప్రతాప్ ఉన్నారని అంటారు. విరూపాక్షి తప్పు చేసినట్లు సాక్ష్యం ఉందని విరూపాక్షి సంతకం చేసిన సంతకాలు చూపిస్తారు. విరూపాక్షికి శాపనార్థాలు పెడతారు. తనకే తెలీదని విరూపాక్షి ప్రమాణాలు చేస్తుంది. పీఏకి కూడా కాల్ చేస్తే ఫోన్ స్విఛ్ ఆఫ్ వస్తుంది. మీడియా మొత్తం విరూపాక్షిని అవమానిస్తారు. సూర్యప్రతాప్ అందరితో మీ అందరికీ నేను అండగా ఉంటాను అని హామీ ఇస్తారు. విరూపాక్షిని అరెస్ట్ చేసి విచారించమని అంటారు. రాజు సూర్యప్రతాప్‌తో పెద్దయ్య అమ్మగారు ఏ తప్పు చేయలేదు చేస్తే ఇలా మీ ముందు నిల్చొరని అంటాడు. పీఏని తీసుకొచ్చి నిజం చెప్పిస్తాం అప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోవద్దని రాజు, రూపలు బతిమాలుతారు. దాంతో సూర్యప్రతాప్ 24 గంటల టైం ఇస్తాడు.
సూర్యప్రతాప్ ఇంటి లోపలికి వెళ్తుంటే విజయాంబిక విరూపాక్షిని తప్పుడు మనిషిగా చిత్రీకరించడానికి పరువు అంతా పోయింది అని అంటుంది. విరూపాక్షి తనకు ఏం తెలీదని ఆ తప్పు చేయలేదని రుక్మిణి మీద ప్రమాణం చేస్తానని అంటే సూర్యప్రతాప్ ఆగు అని అరిచి నువ్వు చేసిన తప్పులకు పిల్లల ఉసురు తీయడం ఏంటి? ఇప్పటికే నీ దొంగ ప్రమాణాల వల్ల ఒక బిడ్డ ప్రాణం తీశావ్ ఇప్పుడు తనని అయినా బతకనివ్వు అంటాడు. విరూపాక్షి సూర్య అని పిలిస్తే సూర్యప్రతాప్ పెద్దగా అరుస్తూ ముందు అలా పిలవడం ఆపేయమని అరుస్తాడు. అవినీతి పరురాలైన ఎమ్మెల్యే అని అంటాడు. మందారం కలుగజేసుకొని పెద్దయ్యా మీకు చెప్పే అంతటి దాన్ని కాదు కానీ నేను అమ్మగారితో పాటు వెళ్లాను అమ్మగారు భూమి చూశారు. రాత్రి పీఏ వచ్చి సంతకాలు తీసుకొని వెళ్లారని అంటుంది. పీఏ ఏమైనా చేసుంటాడు నాకు తెలీదు అని విరూపాక్షి అంటే దానికి తల్లీకొడుకులు నీకు నచ్చిన వాడిని పీఏగా పెట్టుకున్నావ్ మొత్తం కావాలనే చేశావని అంటారు.
రుక్మిణి తండ్రితో ఇదంతా కుట్రలా ఉందని అని అంటుంది. దానికి సూర్యప్రతాప్ తప్పు చేయడం పరువు తీయడం మీ అమ్మకి వెన్నతో పెట్టిన విద్య పాతికేళ్ల క్రితమే నా పరువు తీసింది అని అంటాడు. దానికి రుక్మిణి తండ్రితో పాతికేళ్ల ముందు తప్పు చేసింది మా అమ్మ కాదు నాయనా.. అత్త తప్పు చేసింది.. తప్పుగా అమ్మని అర్థం చేసుకొని మీరు తప్పు చేశారు.. పారిపోయి ఆ రాఘవ తప్పు చేశాడు. చిన్న వయసులో అత్తకి సాయం చేసి దీపక్ తప్పు చేశాడు అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: 100 కోట్ల స్కామ్‌లో లక్ష్మీ.. సస్పెండ్ చేసిన విహారి..!





















