Ammayi garu Serial Today February 8th: అమ్మాయి గారు సీరియల్: నిమిషం ముందు అంతా సర్వనాశనం.. మందారానికి సవతి.. సూర్యప్రతాప్ ఎవరికి న్యాయం చేస్తారో!
Ammayi garu Today Episode మందారాన్ని రాజు తీసుకొచ్చేలోపు సూర్యప్రతాప్ దీపక్, మౌనికలకు పెళ్లి చేసేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రాజు మందారాన్ని తీసుకెళ్లి పెళ్లి ఆపాలని పరుగులు తీస్తాడు. ఇక సూర్యప్రతాప్‌కి ఎంత చెప్పినా ఒప్పుకోడు. పెళ్లి జరగాలని అంటాడు. పంతులు దీపక్‌కి తాళి కట్టమని చెప్తాడు. దీపక్ మౌనిక మెడలో తాళి కట్టేస్తాడు. సరిగ్గా పెళ్లి అయిపోయిన తర్వాత రాజు మందారాన్ని ఎత్తుకొని అక్కడికి వస్తాడు. అందరూ మందారాన్ని చూసి షాక్ అయిపోతారు. పెళ్లి అయిపోవడం చూసి రాజు షాక్ అయిపోతాడు. మందారం అని సూర్యప్రతాప్ దగ్గరకు వెళ్తాడు.
రూప: రాజు అంతా అయిపోయింది. మందారానికి అన్యాయం జరిగిపోయింది. మందారం బతికే ఉంది నువ్వు తీసుకొస్తున్నావ్ అని ఎంత చెప్పినా వీళ్లెవరూ నమ్మలేదు రాజు. అందరూ కలిసి మందారానికి అన్యాయం చేసేశారు. చూడండి నాన్న మందారం బతికే ఉంది. నేను నాటకాలు ఆడలేదు. మీరు ఒక్క సారి నా మాట విని ఉంటే మందారానికి అన్యాయం జరిగేది కాదు.
సూర్యప్రతాప్: మనసులో ఛా మందారానికి అన్యాయం చేశాను. ఒక 5 నిమిషాలు వెయిట్ చేసుకుంటే బాగుండేది. తొందర పడ్డాను. మందారానికి అన్యాయం చేసేశాను.
దీపు: ఎవరు మమ్మీ ఆవిడ.
రూప: ఆవిడ ఎవరో కాదు దీపు నీ కన్నతల్లి.
దీపు: అమ్మా.. అమ్మా లేమ్మా.
చంద్ర: ఇది ఎలా సాధ్యం రాజు. ఆ రోజు మందారం నీ చేతిలో చనిపోయింది అని నువ్వే చెప్పావ్. ఆ చావుకి నువ్వే కారణం అని రూపని వదిలేశావ్ కూడా కదా. మందారం ఆబ్దికం కూడా చేశావ్ కదా. ఇదెలా సాధ్యం రాజు.
పెళ్లికూతురుతల్లి: మందారం లాంటి మరో మనిషిని తీసుకొచ్చారేమో. అందులోనూ ఆమె స్ప్రుహాలో కూడా లేదు.
రాజు: పెద్దయ్యా నేను చితి కాల్చాను కూడా కానీ మందారం బతికే ఉంది.
పెళ్లికూతురితల్లి: బాగుందయ్యా నువ్వే నిప్పు పెట్టా అన్నావ్ మళ్లీ నువ్వే బతికింది అన్నావ్. మీరు మీరు ఏవేవో కారణాలతో నా కూతురి జీవితం నాశనం చేయకండి.
మౌనిక: నా పెళ్లి చెల్లదు అని ఇప్పుడు అంటే నేను బతకను.
మందారం ఇంట్లోనే ఉంటే చంపేయొచ్చు అనుకొని విజయాంబిక నాటకం మొదలు పెడుతుంది. తను మందారమే అని దొంగ ఏడుపు ఏడుస్తుంది. దీపక్ కూడా నా మందారం మందారం అని దొంగ ఏడుపు ఏడుస్తాడు. రూప ఈ పెళ్లి చెల్లదు అని పెళ్లి కూతురికి సర్ది చెప్పమని అంటుంది. రాజు సూర్యప్రతాప్‌తో పెద్దయ్య గారు మీరే మందారానికి జీవితం ఇచ్చారు ఇప్పుడు మందారానికి మీరే న్యాయం చేయమంటాడు. మందారాన్ని తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇద్దామని దీపక్ చెప్తాడు. నా పరిస్థితి ఏంటి అని మౌనిక అడిగితే నువ్వు మాతో పాటే ఉంటావని చెప్తాడు.
మందారాన్ని డాక్టర్ పరిశీలిస్తారు. మందారం కోలుకోకూడదని తల్లీకొడుకులు కోరుకుంటారు. మౌనిక కూడా మందారాన్ని తిట్టుకుంటుంది. మందారం కండీషన్ కొంచెం క్రిటికల్ గానే ఉందని డాక్టర్ చెప్తుంది. విజయాంబిక, దీపక్ మా బంగారం మా మందారంఅని ఓవర్ యాక్షన్ చేస్తారు. అయితే మందారం 100 శాతం కోలుకుంటుందని డాక్టర్ చెప్తారు. మందారం కోలుకుంటే మనం కోలుకోవడం కష్టమని దీపక్ తల్లితో అంటాడు. ఇక రూప రాజుతో బంటీ గురించి నాన్నకి చెప్దామని అంటుంది. ఇంతలో కొత్త నెంబరు నుంచి జీవన్ రూప ఫోన్‌కి కాల్ చేస్తాడు. వీడియో కాల్ చేసి రాఘవని చూపిస్తాడు. బంటీ గురించి సూర్యప్రతాప్‌కి చెప్తే రాఘవని చంపేస్తాను అని అంటాడు. దాంతో ఇద్దరూ బంటీ విషయం చెప్పకూడదని అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: శ్రీధర్‌కి షాక్ మీద షాక్‌లు.. పుల్ల పెట్టేసిన మేన కోడలు.. హోమం దగ్గర ఏం గొడవో!





















