Ammayi garu Serial Today February 14th: అమ్మాయి గారు సీరియల్: మూలికలు పని చేయకుండా చేసిన జీవన్.. ప్రాణాలకు తెగించినా ఫలితం శూన్యం!
Ammayi garu Today Episode రూప తెచ్చిన మూలికలు జీవన్ కెమికల్ కలపడంతో పని చేయవు దాంతో స్వామీజీ మహా మృత్యుంజయ హోమం గురించి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రాజు రౌడీలను చితక్కొట్టి రూపని కాపాడి మూలికలు తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారని అనుకుంటుంటారు. ఇక సూర్య ప్రతాప్ రూప రాత్రి అయినా ఇంటికి రాలేదని టెన్షన్ పడతాడు. చంద్రని పంపుదామని తన బావతో చెప్తే ఏం కంగారు అవసరం లేదని చెప్తాడు.
విజయాంబిక: దీపక్ రూప ఇంటికి రాదు. రూప, రాజులను జీవన్ చంపేస్తాడు.
దీపక్: మమ్మీ ఒకసారి జీవన్‌కి కాల్ చేద్దాం పద.
స్వామీజీ: విజయాంబిక రూప మూలికలు తెచ్చే టైం అయింది వాటిని నూరడానికి ఏర్పాట్లు చేయ్.
విజయాంబిక: నేనా అండీ.
స్వామీజీ: విజయాంబిక అంటే నువ్వే కదా.
విజయాంబిక: సరేనండీ.
రూప: థ్యాంక్స్ రాజు మామయ్య చెప్పిన మూలికలు ఇక్కడి వరకు వచ్చేలా చేశావ్.
రాజు: మందారాన్ని కాపాడుకోవడం మన బాధ్యత కదా అమ్మాయిగారు. మీరు లోపలికి వెళ్లండి జాగ్రత్త. రూప వెళ్తూ వెనక్కి వచ్చి రాజుకి హగ్ ఇచ్చి జాగ్రత్త చెప్పి వెళ్తుంది. రాజు వెళ్లిపోతాడు.
విజయాంబిక: రూప వస్తుంది అంటావా దీపక్.
దీపక్: నాకు అయితే జీవన్ కంటే ఆ రాజు మీదే నమ్మకం ఉంది మమ్మీ.
రూప: మామయ్య ఇదిగో మీరు చెప్పిన మూలికలు.
స్వామీజీ: చెప్పాను కదా బావగారు రూప మహాజ్జాతకురాలు. తనకి ఏ ప్రమాదం వచ్చినా కాపాడటానికి తన చుట్టూ ఒక రక్షణ కవచం ఉంటుంది. ఏ దుష్ట శక్తి తన వరకు రాకుండా ఆ రక్షణ కవచం కాపాడుతుంది అందుకే రూపని పంపాను. రండి బావగారు. రా విజయాంబిక. విజయాంబిక ఈ మూలికలు నూరి పసరు సిద్ధం చేయ్.
విజయాంబిక: ఈ మందారాన్ని ఎలా చంపాలా అని నేను చూస్తుంటే నా చేతితోనే ఈ మందారాన్ని బాగు చేసేలా ఉన్నారు.
చంద్ర: చాలా థ్యాంక్స్ బావగారు మందారం గురించి తెలియగానే తిరిగి వచ్చారు. అసలు మందారం గురించి మీకు ఎవరు చెప్పారు.
సూర్య: అదేంటి చంద్ర అలా అడిగావు బావ సామాన్యులు కాదు దైవ సమానులు వాళ్లకి అన్నీ అలా తెలిసిపోతాయి.
విజయాంబిక, దీపక్‌లు పసరు సిద్ధం చేస్తారు. స్వామీజీ మందారానికి పసురు తాగిస్తారు. వెంటనే మందారంలో చలనం వస్తుందని అంటారు. అయినా మందారంలో చలనం రాకపోవడంతో స్వామీజీ ఆందోళన పడతారు. పసరు కచ్చితంగా పని చేయాలి కానీ మందారంలో ఏ మార్పు కనిపించడం లేదు ఇలా జరగడానికి వీల్లేదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని అంటారు. ఫ్లాష్ బ్యాక్‌లో విజయాంబిక, దీపక్‌లు జీవన్‌కి కాల్ చేసి రాజు రూపల్ని ఏం చేయలేకపోయావ్ కనీసం మూలికలు ఇంటికి రాకుండా ఆపాల్సిందని కోప్పడుతుంది. దాంతో జీవన్ ఆ మూలికలు పని చేయవు వాటి మీద అవి వాటి సహజత్వం పని చేయకుండా ఓ కెమికల్ కలిపానని అంటాడు. ఏం ఆందోళన చెందొద్దని చెప్తాడు. దాంతో విజయాంబిక, దీపక్‌లు హ్యాపీగా ఉంటారు. ఇక తర్వాత స్వామీజీ దగ్గర తల్లీ కొడుకులు నాటకం మొదలు పెడతారు. మందారం ఎలా అయినా బతకాలి అని దొంగ ఏడుపు ఏడుస్తారు.
స్వామీజీ సూర్యప్రతాప్ వాళ్లతో వైద్యానికి స్పందించని ఎంతో మంది దైవకటాక్షానికి కళ్లు తెరుస్తారని శివరాత్రి రోజున మహా శివుడికి మృత్యుంజయ హోమం చేయాలని చెప్తారు. హోమం దగ్గర కలుద్దామని చెప్పి వెళ్లిపోతారు. రూప మందారం దగ్గర కూర్చొని ఏంటి మందారం ఇలా అయిపోయింది ప్రాణానికి తెగించి తెచ్చిన మూలికలు పని చేయలేదని ఫీలవుతుంది. తర్వాత రాజుకి కాల్ చేసి మూలికలు పని చేయలేదని చెప్తుంది. రాజు షాక్ అవుతాడు. హోమం గురించి చెప్తుంది. దానికి రాజు ఏం కాదులే మీరు తిని పడుకోండి అని చెప్తాడు. రూప బాధ పడుతూ ఉంటుంది. సుమ వచ్చి తినమని చెప్తే వద్దని అంటుంది. దాంతో సుమ ఎవరికి చెప్తే నువ్వు తింటావో నాకు తెలుసు అని ఫోన్ తీస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: తండ్రీ, మరదలు వచ్చిన ఫంక్షన్‌లోనే పనోడిగా కార్తీక్.. పరువు పాయే!!





















