అన్వేషించండి

Ammayi garu Serial Today December 4th: అమ్మాయి గారు సీరియల్: సూర్యప్రతాప్‌తో నిజం చెప్పేసిన పింకీ.. డీఎన్‌ఏ రిపోర్స్ మార్చే పనిలో జీవన్!

Ammayi garu Today Episode పింకీ ఇంట్లో వాళ్లతో తనకు జీవన్ ఎలా పెళ్లి చేసుకున్నాడో చెప్పడం అందరూ కలిసి జీవన్ అంతు చూడాలని నిర్ణయించుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode జీవనే హారతి తండ్రి అని అనుమానంగా ఉందని రాజు, రూపలు చెప్పండంతో సూర్యప్రతాప్ డీఎన్ఏ టెస్ట్‌ చేయిస్తారు. జీవన్‌ని పెళ్లి చేసుకున్న పింకీ జీవితం నాశనం అయిపోయిందని పింకీ తల్లిదండ్రులు, సూర్యప్రతాప్ అక్కడికి వెళ్లి పింకీకి నిజం చెప్పమని అడుగుతారు. దాంతో పింకీ పెద్దనాన్న కాళ్ల మీద పడిపోయి ఏడుస్తుంది. సూర్యప్రతాప్‌తో సహా అందరూ ఏమైందని పింకిని అడుగుతారు. ఇప్పటికైనా నిజం చెప్పమని అంటారు.

పింకీ: ఏడుస్తూ ప్రమాణ స్వీకారం రోజు నాన్న పిలిస్తే బయల్దేరాను. పోలీసులు బ్యాగ్ చెక్ చేసి బ్యాగ్‌లో డ్రగ్స్ ప్యాకెట్లు తీసి అరెస్ట్ చేస్తామని పోలీస్ స్టేషక్‌కి అని ఎక్కడికో తీసుకెళ్లారు పెద్దనాన్న. తర్వాత నాతో డ్రగ్స్ టేస్ట్ చేయించి నేను కళ్లు తిరిగి పడిపోయిన తర్వాత నా మెడలో తాళి ఉంది జీవన్ భర్తగా ఉన్నాడు పెద్దనాన్న. నా బ్యాగ్‌లో డ్రగ్స్ దొరికినప్పటి నుంచి భర్తగా పక్కన ఉన్న వరకు వీడియో తీసి ఇంటి పరువు మీ పదవి తీస్తానని బెదిరించాడు పెద్దనాన్న. మీ పరువు పోకూడదని వాడు చెప్పినట్లు చేస్తున్నా.
సూర్యప్రతాప్‌: ఏడ్వకమ్మా ఇంత చిన్న వయసులోనే నా పదవి గురించి మన పరువు గురించి ఆలోచిస్తున్నావా ఇంత నరకం అనుభవిస్తున్నావా ఏడ్వకమ్మా నీకేం కాదు.
చంద్ర: నా కూతురి కన్నీళ్లకు కారణం అయిన వాడిని వదలను. 
సూర్యప్రతాప్‌: చంద్ర ఆవేశపడకు. వాడి దగ్గర పింకీకి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. పైగా డ్రగ్స్‌వి. పింకీ మన పరువు కాపాడుతూ వచ్చింది ఇప్పుడు మనం తొందరపడితే ఎలా. పైగా వాడు పింకీ మెడలో తాళి కట్టాడు. మనం ఏమైనా చేసి తొందర పడితే పింకీ పసుపు కుంకుమలు మనమే తీసేసినట్లువుతుంది.
రూప: అవును బాబాయ్ ఎలాగూ జీవన్ ప్రవర్తన అనుమానంగా ఉంది కాబట్టి డీఎన్‌ఏ రిపోర్ట్స్ వస్తే తేలుతుంది. మా అనుమానం ప్రకారం జీవన్, హారతి బిడ్డకు తండ్రి కాబట్టి పింకీని మనం కాపాడుకోవచ్చు. తాళి కట్టడానికి ముందు తర్వాత ఏం జరిగిందో తెలుసు కానీ ఆ మధ్యలో ఏం జరిగిందో తెలుసుకోవాలి.
పింకీ: పెద్దనాన్న మీ ముందు నాతో మొగుడిలా అధికారం చెలాయిస్తాడు. ఆ తర్వాత కనీసం నాతో మాట్లాడడు. మన ఇంట్లో ఎవరికీ మనస్శాంతి లేకుండా చేయడానికే నన్ను పెళ్లి చేసుకున్నానని అంటుంటాడు.
సూర్యప్రతాప్‌: సరే అందరూ ఒక విషయం గుర్తుంచుకోండి. పింకీ మనకి ఏం చెప్పలేదు మనం ఏం వినలేదు. వాడి చెల్లితో రాజు పెళ్లి ఆగిపోయింది. నా వల్ల వాడు ఎలక్షన్‌లో ఓడిపోయాడు. సో వాడి టార్గెట్ మేం ముగ్గురు మాత్రమే కాబట్టి మీ ఎవరి జోలికి రాడు కాబట్టి మీరు నార్మల్‌గా ఉండండి. అమ్మా పింకీ నువ్వు జాగ్రత్తాగా ఉండాలి వాడికి ఏమాత్రం అనుమానం వచ్చినా ఊరుకోడు. 

జీవన్ డాక్టర్ దగ్గరకు వెళ్లి ఫేక్ రిపోర్ట్స్ కావాలని అంటాడు. డాక్టర్ నా వల్ల కాదు అని అంటాడు. దాంతో జీవన్ డాక్టర్‌కి డబ్బు ఆశ చూపుతాడు. అయినా డాక్టర్ ఒప్పుకోకపోవడంతో చంపేస్తా అన్నట్లు బెదిరించి డబ్బు ఇచ్చి ఫేక్ రిపోర్ట్స్ సిద్ధం చేయమని అంటాడు. మరోవైపు విరూపాక్షి, ముత్యాలు, అప్పలనాయుడు గుడికి వెళ్లాలని బయల్దేరుతారు. ముత్యాలు చేతిలో ఉన్న దేవుడి కోసం సిద్ధం చేసిన పసుపు, కుంకుమ అన్నీ కింద పడిపోతాయి. విరూపాక్షి ఆందోళన చెందుతుంది. కీడు శంకిస్తుందని గుడికి రావాలంటే భయంగా ఉందని అంటుంది. ఇక ముత్యాలు రాజు, రూపలు వస్తారనే కదా మనం వెళ్తున్నాం అంటే అందుకే భయంగా ఉందని విరూపాక్షి అంటుంది. మొత్తానికి అప్పలనాయుడు విరూపాక్షిని ఒప్పిస్తాడు. ఇక రాజు, రూపలతో పాటు ఫ్యామిలీ మొత్తం గుడికి వెళ్తారు. శివుడికి అభిషేకం చేస్తారు. అందరూ తమ కోరికలు కోరుకుంటారు. జీవన్ బండారం బయట పడాలని కోరుకుంటారు. ఇక చంద్ర కూతురు కోసం కోరుకుంటారు. మరోవైపు విరూపాక్షి వాళ్లు గుడికి వచ్చి సూర్యప్రతాప్‌ వాళ్లకి ఎదురవుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: జీవనే హారతి బిడ్డ తండ్రి.. మళ్లీ డీఎన్‌ఏ టెస్ట్.. జీవితం నాశనమైందంటూ పింకీ ఏడుపు!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
Nindu Manasulu Serial Today August 20th: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 20th:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget