అన్వేషించండి

Ammayi garu Serial Today December 18th: అమ్మాయి గారు సీరియల్: రూప ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న రాజు.. దీపక్, విజయాంబికల కన్నింగ్ ప్లాన్! 

Ammayi garu Today Episode రూప ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న రాజు ఫ్యామిలీ రాజుని తీసుకొని రూప ఇంటికి రావడం విజయాంబిక వాళ్లు వాళ్లని ఆపేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రాజు రూప మీద చాలా సీరియస్ అయి మందారం బాడీ తీసుకెళ్లిపోయిన తర్వాత రూప కళ్లు తిరిగి పడిపోతుంది. డాక్టర్ చూసి రూప ప్రెగ్నెంట్ అని చెప్తారు. సూర్యప్రతాప్‌ ఫ్యామిలీ మొత్తం షాక్ అయిపోతారు. విజయాంబిక దీపక్తో రాజు వెళ్లిపోయాడు ఇక రూప నీకు దక్కుతుంది అనే టైంలో ఇలా జరిగింది ఏంటి అని అనుకుంటారు. రూపకి డాక్టర్ జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోతుంది. సూర్యప్రతాప్‌ రూప దగ్గర కూలబడిపోతాడు.

ముత్యాలు ఇంటి దగ్గర ముత్యాలు ఫొటోకి దీపం పెట్టి దండ వేసి అందరూ అక్కడ కూర్చొని మందారాన్ని గుర్తు చేసుకొని ఏడుస్తుంటారు. మందారం మీ ఇద్దరూ కలిసి ఉండాలని కోరుకుందని మీరు ఇలా దూరంగా ఉంటే మందారం ఆత్మ శాంతించదని ముత్యాలు రాజుతో అంటుంది. ఇక అప్పలనాయుడు మీ ఇద్దరూ కలిసి ఉండాలని కావాలనే మేం మీ ఇద్దరికీ దూరంగా ఉన్నామని అంటాడు. రూపతో అలా మాట్లాడటం తప్పని రూప చాలా బాధ పడుంటుందని అంటారు. అందరూ రాజుకి రూప విషయంలో సర్దిచెప్తారు. అయినా ఏం మాట్లాడకుండా రాజు మందారం ఫొటో దగ్గరే కూర్చొని ఉంటాడు. భర్తకు 20 ఏళ్లగా దూరంగా ఉన్న తనకు ఆ బాధ తెలుసని రూపకి ఆ శిక్ష వద్దని విరూపాక్షి అంటుంది. అందరూ రాజుని ఒప్పించాలని ప్రయత్నిస్తే దానికి రాజు నేను ఆ ఇంటికి వెళ్లను  ఆ రూపని చూడను ఆ రూపని చూస్తే మందారం గుర్తొస్తుందని అంటాడు. దానికి ముత్యాలు అలా రూప రూప అనొద్దని అమ్మాయిగారు అనమని చెప్తుంది. విరూపాక్షి ఏడుస్తూ నాలా నా బిడ్డ జీవితం అయిపోకూడదు రూపని వదిలేయకు మందారం కోసం అయినా రూపని క్షమించమని అంటుంది. దానికి అప్పలనాయుడు మనమే వీడిని ఈడ్చుకెళ్లి క్షమాపణ చెప్పిద్దామని అంటాడు. 

ఇక రూప వాళ్లు మందారం ఫొటోకి సంతాపం తెలుపుతారు. రూప మందారం ఫొటోకి క్షమాపణ చెప్తుంది. నిన్ను వదిలి వెళ్లకుండా ఉండాల్సింది అని ఏడుస్తుంది. పోయిన నీ ప్రాణమే నాకడుపులో జీవం పోసుకున్నట్లుందని అంటుంది. మందారం బిడ్డకు ఏలోటు రాకుండా చూసుకుంటానని ఫోటోతో చెప్పుకొని బాధ పడుతుంది. రూప బాధతో గదిలోకి వెళ్లిపోతుంది. ఇక సూర్య ప్రతాప్ మందారం ఫొటోకి దండం పెట్టి తన కోసం నా ప్రాణాలు పణంగా పెట్టావని నీ ప్రాణాలు తీసిన వాడిని కనిపెట్టి ఎన్‌కౌంటర్ చేయిస్తానని నీ కొడుకుని చదివిస్తానని మందారానికి మాటిస్తాడు. ఇక విజయాంబిక దీపక్ సంతోషంగా ఉంటారు. మమల్ని ఫాలో అయి నీ ప్రాణాలు పోగొట్టుకున్నావని అనుకుంటారు. ఇక రూప గదిలో బాధగా ఉండటం చూసిన పింకీ అక్క మీద కోపంతో వెళ్లిన రాజుకి అక్క ప్రెగ్నెంట్ అని తెలిస్తే అందరూ కలిసిపోతారని అనుకొని పింకీ రాజుకి కాల్ చేస్తుంది.

రాజు కాల్ లిఫ్ట్ చేయడు. దాంతో అప్పలనాయుడు కాల్ లిఫ్ట్ చేస్తాడు. రాజు మాట్లాడటం లేదు అని అంటే పింకీ స్పీకర్ పెట్టమని చెప్తుంది. అప్పలనాయుడు స్పీకర్ పెడితే పింకీ ఏంటి రాజు నువ్వు నాతో కూడా మాట్లాడటం లేదు నాకు ఏ కష్టం వచ్చినా తీర్చుతా అన్నావ్ తీర్చుతావా అని అంటుంది. మా అక్క రూప ప్రెగ్నెంట్ అయిందని చెప్తుంది. రాజు షాక్ అయిపోతాడు. అందరూ సంతోషిస్తారు. రాజు కన్నీరు పెట్టుకుంటాడు. ఈ టైంలో అక్క పక్కన నువ్వు ఉంటే బాగుంటుందని అంటుంది. అందరూ రాజుని అక్కడికి వెళ్దామని అంటారు. మందారమే రూప కడుపులో పుట్టబోతుందని అందరూ రాజుని బలవంతంగా రూప దగ్గరకు తీసుకెళ్తారు. రాజు వాళ్లని చూసిన విజయాంబిక, దీపక్ వాళ్లని గేటు దగ్గరే ఆపేస్తారు. రాను అని చెప్పి ఏ ముఖం పెట్టుకొని వచ్చావని రాజుని తిడుతుంది. ఇంట్లో ఉన్నది రాజు భార్య రాజు నువ్వు వెళ్లు అని అంటుంది. రూప రాజు ముఖం చూడటానికి ఒప్పుకోవడం లేదని దీపక్ అంటాడు. ఇక సూర్యప్రతాప్ రాజు వాళ్లని చూస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: మందారాన్ని పొడిచి పొడిచి చంపేసిన దీపక్.. రూప మీద విరుచుకుపడ్డ రాజు.. రూప ప్రెగ్నెంట్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana News:తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Sivaji Reaction : ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..

వీడియోలు

ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ
టీమిండియా ప్లేయర్ల కెరీర్ ని సెలెక్టర్లు నాశనం చేస్తున్నారు: మహమ్మద్ కైఫ్
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News:తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Sivaji Reaction : ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
The Paradise Movie : నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
Vaibhav Suryavanshi: 36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
Embed widget