Ammayi garu Serial Today April 2nd: అమ్మాయి గారు సీరియల్: జీవన్ ఫైల్స్ మీద సంతకం పెట్టేసిన సూర్య.. సీఎం పదవి పోయినట్లేనా!
Ammayi garu Today Episode మాధవికి దీపక్ వాళ్ల అమ్మ డైమండ్ నెక్లెస్ గిఫ్ట్‌గా ఇవ్వడం మాధవి జీవన్ ఫైల్స్ మీద సంతకం చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రాజు, రూపలు మూలికలు వశీకరణ గురించి చెప్తారు. దాంతో మాధవి మీరు ఏ కాలంలో ఉన్నారు మూలికలు వశీకరణ ఏంటి అని అడుగుతుంది. దాంతో రాజు మీరు ఏ కాలంలో ఉన్నారు.. వాంతులకు మూలికలు వాడటం ఏంటి అని రివర్స్ కౌంటర్ వేస్తారు. జీవన్‌ని కలవడం మాట్లాడటం అన్నీ చూశామని చెప్తారు. ఈ రోజు తప్పించుకున్నావ్ కానీ మా నుంచి తప్పించుకొని ఏం చేయలేవని అంటారు.
రేపే లెక్క సెట్ చేద్దాం..
రూప వాళ్లతో మీరంతా కలిసి మా నాన్నని మోసం చేయాలని ప్రయత్నిస్తున్నా మీ పప్పులేం ఉడకవు. అత్తయ్య మాతో పెట్టుకుంటే ఏమవుతుందో తనకి చెప్పండి అని అంటుంది. మీ గురించి సీఎంకి చెప్తానని మాధవి అంటే చెప్పు క్షమాపణ చెప్పడానికి రెడీగా ఉండని అంటుంది. మాధవికి జాగ్రత్తగా ఉండమని విజయాంబిక చెప్తుంది. రేపే మాధవి సంగతి చూద్దామని రాజు అంటే మాధవి కూడా రేపే సంతకాలు పెట్టించి వీళ్ల పని చెప్తా అంటుంది.
రాధికా రాధికా.. దీపక్ భజన
దీపక్ రాత్రి రాధికా రాధికా అంటూ మాధవిని ఫాలో అయి వాళ్ల ఇంటికి వెళ్తాడు. మాధవి దీపక్‌తో ఇలా వచ్చేవేంటి అని అడిగితే నీకు పడిపోయానని అంటాడు. నాకు పెళ్లి అయి బాబు ఉన్నాడని మాధవి అంటే నాకు పెళ్లి అయి బాబు ఉన్నాడని దీపక్ అంటాడు. నా మనసు నిన్నే కోరుకుంటుంది రాధిక అని అంటాడు. మీ ఆయన ఉన్నాడా అని దీపక్ అడుగుతాడు. దానికి మాధవి ఉంటే పెళ్లి సంబంధం మాట్లాడుతావా అంటుంది. మీ ఆయన ఎక్కడ అని అడిగితే పైకి పోయాడని మాధవి అంటే నీ మనసులో మంగళసూత్రం లేకపోవడం చూసే డౌట్ వచ్చిందని దీపక్ చెప్పి.. నువ్వు ఒప్పుకుంటే నీకు భర్త లేని లోటు తీర్చుతానని అంటాడు. మాధవి దీపక్‌ని ఒక్కటి కొడుతుంది.
ఒక్క హగ్‌తో నీ వశం అయిపోయా..
నువ్వు నాకు ఇచ్చిన ఒక్క హగ్ వల్ల నేను నీ వంశం అయిపోనానని దీపక్ అంటాడు. అదేదే నువ్వు నన్ను కాపాడావని ఇచ్చానని అంటుంది. ఇక దీపక్ డైమండ్ నెక్లెస్ రాధికకు గిఫ్ట్‌గా ఇస్తాడు. మెలికలు తిరుగుతూ మాధవి మెడలో పెడుతుంటే గొర్రె వచ్చి దీపక్‌ని ఒక్కటిస్తుంది. నా బుజ్జితల్లిని ఈ గజ్జిగాడు కెలికితే ఊరుకుంటానా అంటుంది. మాధవి దీపక్‌తో దీపక్ ఇది నన్ను మొన్నటి నుంచి వదలడం లేదు అంటే దీపక్ వశీకరణ మందు కలిపిన పచ్చడి ఇది తినేసిందని అంటాడు. నీ వెనకాలే కుక్కలా తిరుగుతాను అని గొర్రె మాధవిని సతాయిస్తుంది. నువ్వు పోరా అంటే నువ్వు పోరా అని గొర్రె దీపక్ తిట్టుకుంటారు. ఇద్దరూ ఇక్కడి నుంచి పొండి అని రాధిక తిడుతుంది. ఇద్దరూ వెళ్లిపోతారు. సంతకం పెట్టించి వాటా తీసుకొని తొందరగా జంప్ అయిపోవాలని మాధవి అనుకుంటుంది.
మాధవి మీద రాజు రెక్కీ..
మాధవి గురించి తెలుసుకుంటానని రాజు బయటకు వెళ్తూ ఇంట్లో మాధవి చేసిన ఎత్తులను తిప్పికొట్టమని రూపతో చెప్తాడు. మాధవి ఇంటికి రాగానే రాజు వెళ్తాడు. సంతకం పెట్టించి ఇక ఈ ఇంట్లో అడుగుపెట్టను అని మాధవి అనుకుంటుంది. రాధిక మెడలో నక్లెస్ చూసిన విజయాంబిక నా నెక్లెస్‌లా ఉంది ఏంట్రా అని అడుగుతుంది. దీపక్ నీకు కాదు అని కవర్ చేస్తాడు. విజయాంబిక నెక్లెస్ నాదే అని చూడ్డానికి వెళ్తుంది.
సంతకం పెట్టించేసిన మాధవి..
మాధవి చాలా ఫైల్స్ తీసుకొచ్చి సంతకం పెట్టమని అంటుంది. సూర్యప్రతాప్ సంతకం పెట్టడానికి రెడీ అవుతుంటే రూప ఆపుతుంది. అన్ని ఫైల్స్ చెక్ చేయమని అంటుంది. నాకు తెలుసు వీటిలో నేను సంతకం పెట్టకూడని ఫైల్స్ కూడా ఉన్నాయి వాటి మీద సంతకం పెడితే నా సీఎం పదవి పోతుంది ఇదేనా నువ్వు చెప్పింది అని అంటాడు. సూర్య సంతకం పెట్టేస్తారు. రాజు మాధవి గురించి ఎంక్వైరీ చేస్తుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: అనంత్ పక్కనే గాయత్రీ.. ఊర్వశి దొరికిపోతుందా.. కంకణం కట్టించుకునేదెవరు?





















