Ammayi garu Serial Today April 1st: అమ్మాయి గారు సీరియల్: రూప, రాజులను షూట్ చేస్తానని సూర్య అనడానికి కారణం ఏంటి? దీపక్ మాయకు మాధవి హగ్!
Ammayi garu Today Episode మాధవి జీవన్ మనిషి అని రాజు, రూపలు సూర్యప్రతాక్ చెప్పడం మాధవిని చివరి నిమిషంతో దీపక్ కాపాడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode మాధవి జీవన్‌తో మాట్లాడటం.. ఫైల్ మీద సంతకం పెట్టిస్తానని చెప్పడం రాజు, రూపలు చాటుగా వింటారు. మాధవి జీవన్ మనిషే అని విరూపాక్షి ఫైల్‌లో తమకు కావాల్సిన పేపర్లు పెట్టి సంతకం పెట్టించాలని అనుకుంటుందని తన బండారం బయట పెడదామని రూప, రాజులు అనుకుంటారు. మాధవి సూర్యప్రతాప్ దగ్గరకు వెళ్లి సంతకం పెట్టమని చెప్తుంది.
ఫైల్ మీద సంతకం పెట్టొద్దు నాన్న..
సూర్యప్రతాప్ సంతకం పెట్టే టైంకి రూప, రాజులు ఆపుతారు. ఆ ఫైల్‌ని చెక్ చేయమని చెప్తారు. మళ్లీ ఎందుకు చెక్ చేయడం అని ఎమ్మెల్యే విరూపాక్షి గారు తెచ్చిన ఫైలే అని మాధవి అంటుంది. అయినా సరే చెక్ చేయమని రూప అంటుంది. మాధవి గారు ఏదో దాస్తున్నారని.. అమ్మగారి ఫైల్స్‌తో పాటు వేరే వాటి మీద కూడా సంతకాలు పెట్టమని చెప్పడం విన్నామని రాజు చెప్తాడు. మాధవి చాలా భయపడుతుంది. సూర్యప్రతాప్ పేపర్లు చెక్ చేస్తాడు.
కూతురు అల్లుడిని తిట్టిన సూర్య..
డాక్యుమెంట్స్ చెక్ చేసిన సూర్యప్రతాప్ రాజు, రూపల్ని తిడతాడు. మీ ప్రాబ్లమ్ ఏంటి ఎవరినీ ప్రశాంతంగా ఉండనివ్వరా అని అడుగుతారు. దాంతో మాధవి మనసులో నేను పెట్టిన పేపర్లు ఎవరు తీశారని అనుకుంటుంది. మాధవి పేపర్లు దొరకకపోవడంతో రాజు, రూపల మీద నింద వేస్తుంది. కావాలనే నన్ను ఇబ్బంది పెడుతున్నారని ఇలాంటి వాళ్ల మధ్య పని చేయలేనని మీరు అనుమతి ఇస్తే రిజైన్ చేస్తానని అంటుంది. అవసరం లేదని సూర్యప్రతాప్ చెప్తాడు. సిన్సియారిటీ మీద బురద జల్లాలని చూస్తే కన్న కూతురు అయినా ఒప్పుకోనని అంటాడు. జీవన్‌ని మాధవి కలవడం చూశామని రాజు చెప్తాడు.
రాఘవ.. రాఘవ.. వాడిని నా ముందుకి తెస్తే చంపేస్తా..
జీనవ్ మన శత్రువు అని తెలిసి కూడా వాడి దగ్గరకు మీరు ఎందుకు వెళ్లారని సూర్యప్రతాప్ అడిగితే రూప రాఘవ కోసం వెళ్లామని చెప్తుంది. జీవన్ రాఘవని కిడ్నాప్ చేశాడని చెప్తుంది. దాంతో సూర్యప్రతాప్ చాలా సీరియస్ అవుతారు. రాఘవ.. రాఘవ రాఘవ ఇంకోసారి ఆ రాఘవ వాడిని నా ముందుకి తీసుకొస్తే వాడిని షూట్ చేసేస్తా.. ఇంకోసారి వాడి టాపిక్ నా ముందు పెడితే మిమల్ని షూట్ చేసేస్తా అని సూర్యప్రతాప్ కేకలేస్తాడు. అసలు మిమల్ని చూడాలి అంటేనే కంపరంగా ఉంది పొండి అని అంటాడు.
మాధవి ఫోన్ చెక్ చేసిన రూప..
ఒకసారి మాధవి ఫోన్ చెక్ చేయమని రాజు, రూపలు చెప్తారు. ఒకసారి చెక్ చేయండి ఏం లేకపోతే ఈమె జోలికి వెళ్లమని అంటారు. ఇదే చివరి సారి అని సూర్యప్రతాప్ మాధవి ఫోన్ తీసుకొని రూప చేతిలో పెడతాడు. మీరే చెక్ చేయండి అంటాడు. రూప, రాజులు మొత్తం చెక్ చేసిన జీవన్‌తో మాట్లాడినట్లు ఆధారం ఉండదు. మాధవి ముందు జాగ్రత్తగా అన్నీ డిలీట్ చేస్తుంది. రూప, రాజులు తలదించుకుంటారు. విరూపాక్షికి తాను పీఏగా ఉండటం ఇష్టం లేక వీళ్లతో కలిసి నాటకం ఆడుతుందని మాధవి చెప్తుంది. సూర్యప్రతాప్ రూపకి వార్నింగ్ ఇచ్చి పంపేస్తాడు.
డాక్యుమెంట్స్ మిస్సింగ్..
మాధవి డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టిస్తుంది. జీవన్ ఇచ్చిన డాక్యుమెంట్స్ లేకపోవడంతో మాధవి డిసప్పాయింట్ అవుతుంది. విజయాంబిక, దీపక్‌లు మాధవికి జాగ్రత్తలు చెప్తారు. రూప, రాజులతో జాగ్రత్త అని చెప్తారు. దీపక్ మాధవి అందాన్ని పొగుడుతాడ. నా ప్రాణాల మీదకు వచ్చేలా ఉంటే ఇప్పుడు పొగుడుతావేంటి నా ప్రాణాలకు ఏమైనా అయితే కాపాడుతావా అని మాధవి అడుగుతుంది. దానికి దీపక్ ఆల్రెడీ కాపాడేశానని మిస్స్ అయిన పేపర్లు మాధవి చేతిలో పెడతాడు.
దీపక్ మాయ.. హగ్ ఇచ్చిన మాధవి..
రాజు, రూపలు ఫైల్ గురించి మాట్లాడటం విన్న దీపక్ ముందే ఆ ఫైల్ నుంచి పేపర్లు తీసేస్తాడు. దీపక్ చేసిన పనికి మాధవి థ్యాంక్యూ చెప్పి హగ్ ఇస్తుంది. దీపక్ మాధవి మత్తులో ఉంటే విజయాంబిక షాక్ అయిపోతుంది. దీపక్ మాధవిని పట్టుకొని నలిపేస్తాడు. మాధవిగారు రాజు, రూపలతో జాగ్రత్త మీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేనని అంటాడు.
రాజు, రూపల ఎంట్రీ..
ముగ్గురు గూడు పుటానీ చేస్తుంటే రాజు, రూపలు ఎంట్రీ ఇస్తారు. ముగ్గురు షాక్ అయిపోతారు. తప్పించుకున్నానని సంతోషపడుతున్నారా మిస్ మాధవి గారు అని రాజు అడుగుతాడు. నిన్నే మాకు తెలిసింది వీళ్లు వదిలిన బాణం అని తెలిసిందని అంటాడు. దానికి మాధవి విరూపాక్షి ఫైల్ ఇవ్వమని దీపక్‌కి చెప్పడానికి వచ్చానని అంటుంది. మూలికలు వశీకరణం కోసమని తెలిసిందని రూప మాధవికి షాక్ ఇస్తుంది. వశీకరణం ఉందా అని మాధవి రివర్స్‌లో ప్రశ్నిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: ఉష, చిన్నిలకు డీఎన్‌ఏ టెస్ట్.. ఈసారి కావేరి దొరికిపోవడం ఖాయం.. చేతులెత్తేసిన రాజు!





















