అన్వేషించండి

Krishnamma kalipindi iddarini July 3rd: బోల్తా కొట్టిన సౌదామిని ప్లాన్.. తల్లితో చెప్పుకుంటూ కోపంతో రగిలిపోతున్న అఖిల?

సౌదామిని భారీగా చేసిన ప్లాన్ వర్కౌట్ కాలేకపోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది తెలుసుకుందాం.

Krishnamma kalipindi iddarini July 3rd: గౌరీ తో పందిరి గుంజ నాటు పూజ చేయిస్తూ ఉంటారు. ఇక సౌదామిని కాసేపట్లో గౌరీ పని అయిపోతుంది అని తెగ సంతోషపడుతుంది. ఇక గౌరీ దీపం పెట్టగా అక్కడ గుంజ కాలకపోవటంతో సౌదామిని షాక్ అవుతుంది. అంత పవర్ఫుల్ కెమికల్ రాసినప్పుడు కాలాలి కానీ ఇలా జరిగిందేంటి అని అనుకుంటుంది. తర్వాత అందరూ దండం పెట్టుకుంటారు.

పూజ అనంతరం గౌరీ ఈశ్వర్ కోసం ఒక చిన్న గిఫ్ట్ తీసుకొని వస్తుంది. కానీ అతని స్థాయికి అది చిన్నది అని ఇవ్వడానికి ఇబ్బంది పడుతుండటంతో.. ఈశ్వర్ ఏం జరిగింది అని అడుగుతాడు. దానితో గిఫ్ట్ విషయం చెప్పటంతో మీరు ఏది ఇచ్చినా నాకు అది చాలా పెద్ద గిఫ్ట్ అని అనటంతో ఆ మాటలకు గౌరీ ఫిదా అయి ఈశ్వర్ చేతికి రుద్రాక్ష కడుతుంది.

ఇదంతా చూసిన అఖిలకు బాగా మండుతుంది. ఇక రుద్రాక్ష ఎప్పుడు నా గుర్తుగా మీ దగ్గరే ఉండాలి అని ఎప్పుడు తీయొద్దు అని చెబుతుంది. దాంతో ఈశ్వర్ నా ప్రాణం ఉన్నంతవరకు మీ చేతిని కానీ ఈ రుద్రాక్షను కాని వదిలిపెట్టను అని అంటాడు. ఇక అఖిల ప్రేమ అంటే గుడ్డిదంటే ఇదేనేమో అని అనుకుంటుంది. ఆ తర్వాత ఈశ్వర్ కూడా గౌరీ కి ఒక గిఫ్ట్ ఇవ్వటంతో గౌరీ అది చూసి ఫిదా అవుతుంది.

ఇక ఈరోజు నుంచి మన పెళ్లిరోజు వరకు నీకు స్పెషల్ గిఫ్ట్ లు ఇస్తాను అని అంటాడు. ఇప్పుడు ఇచ్చే జ్ఞాపకాలు అన్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను అని అంటాడు. అది చూసి అఖిల ఇప్పుడే ఇలా చేస్తున్నాడు అంటే పెళ్లయ్యాక ఇంటి పెత్తనం మొత్తం తనకే ఇస్తాడేమో అప్పుడు నాకు పనిమనిషి పోస్ట్ వస్తుందేమో అని అనుకుంటుంది. అదే సమయంలో ఆదిత్య అక్కడి నుంచి వెళ్తుండగా ఆదిత్యను పిలుస్తుంది అఖిల.

వాళ్ళు చూడు ఎలా గిఫ్టులు ఇచ్చుకుంటున్నారు నీకు నా మీద ప్రేమ లేదా నిశ్చితార్థం కూడా అయింది కదా అని అనటంతో గిఫ్టులు ఇవ్వకున్న కూడా ప్రేమ ఉంటుంది అని ఆదిత్య అంటాడు. ఇక వీరి మాటలు విని ఈశ్వర్, గౌరీలు అక్కడికి వస్తారు. ఇక మాటల్లో మాట ఈశ్వర్ మేమిద్దరం అన్నదమ్ములం రామ లక్ష్మణ లాగా ఉన్నాము. పెళ్లయ్యాక కూడా ఇలాగే ఉంటాము.. దానికి మీరిద్దరూ అక్క చెల్లెలు బాగా ఉంటే చాలు అని అంటాడు.

దాంతో అఖిల తన మనసులో ఇంట్లోకి అడుగుపెట్టగానే మొదట చేసే పని మీ ఇద్దరిని విడగొట్టడం అని గౌరీ వల్ల వీరి విడిపోయారు అని గౌరీని ఇరికిస్తాను అని అనుకుంటుంది. ఇక ఈశ్వర్ అఖిలను ఇలా అంటున్నందుకు ఫీలయ్యావా అనటంతో అలా ఏమీ లేదు బావ గారు.. పెళ్లయ్యాక కూడా నేను అనువుగా ఉంటాను అని భారీ భారీ డైలాగులు కొట్టడంతో ఆ మాటలు సునంద విని ఫిదా అవుతుంది.

దాంతో తన చిన్న కోడలిని కూడా మెచ్చుకుంటుంది. ఇక వాళ్ళందరూ అక్కడ నుంచి వెళ్లాక అఖిల ఆస్తిలో తనకు పెత్తనం ఇవ్వకపోతే అప్పుడు చెబుతాను అని అనుకుంటుంది. మరోవైపు సౌదామిని తన కూతురితో కలిసి పందిరి గుంజ దగ్గరికి వస్తుంది. ఇక అక్కడున్న దీపాన్ని గుంజకు పెట్టి చూస్తుంది. అది కాలకపోటంతో షాక్ అవుతుంది. ఇక నువ్వు చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి మమ్మీ అంటూ కూతురు అరుస్తుంది.

కానీ ఆ కెమికల్ చాలా పవర్ఫుల్ మంట తగలకుండా అసలు ఉండే ఛాన్స్ లేదు అని సౌదామిని అంటుంది. నాకే ఆశ్చర్యంగా ఉంది అని అంటుంది. ఉజ్వల మాత్రం తన నోటికొచ్చినట్లు కోపంగా మాట్లాడుతూ ఉండగా అప్పుడే సౌదామినికి తను కెమికల్ పూసిన గుంజ కనిపించడంతో.. అక్కడికి వెళ్లి అదే అని గుర్తు పడుతుంది.

ఇక ఇది ఇక్కడ ఎందుకు పడేశారు అని పనిచేసే వ్యక్తిని అడగటంతో అది తుప్పు పట్టిందని అందుకే ఉదయాన్నే కొత్తది తీసుకొచ్చారు అని చెప్పటంతో తన ప్లాన్ వర్కౌట్ కాలేదు అని బాగా కోపంగా కనిపిస్తుంది సౌదామిని. ఇక ఉజ్వల తల్లి పై అరిచి అక్కడ నుంచి వెళ్తుంది. మరోవైపు ఇంట్లో వాళ్లంతా పెళ్లి కార్డులు సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే సునంద వాళ్ల కార్డులు వాలే సెలెక్ట్ చేసుకోవాలి అని ఈశ్వర్, గౌరీ అని పెళ్లి కార్డు సెలెక్ట్ చేయమని అంటారు.

దాంతో అఖిలకు కోపం వస్తుంది. ఇక వారిద్దరూ ఒకే రకమైన కార్డు సెలక్షన్ చేయటంతో ఇంట్లో వాళ్ళు మురిసిపోతారు. ఇక అఖిల మాత్రం తన అక్కను ఒక్కదాన్నే కోడలుగా చూస్తున్నారు అని తనను చూడటం లేదు అని తన తల్లితో చెప్పటంతో.. పెళ్లి జరిగాక అందరి పనులు చేస్తాను అని అంటుంది భవాని.

Also Read: Madhuranagarilo July 3rd: రాధ, శ్యామ్ ల పెళ్లికి ఒప్పుకున్న మధుర.. అత్త తల పగలగొట్టిన సంయుక్త?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Maharashtra News: మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో కొత్త తరహా మోసం- తాపీ మేస్త్రీలే టార్గెట్‌గా పన్నాగం
ఆదిలాబాద్ జిల్లాలో కొత్త తరహా మోసం- తాపీ మేస్త్రీలే టార్గెట్‌గా పన్నాగం
Srikakulam Latest News: తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
Embed widget