Rangula Ratnam June 17th: వర్ష దాచిన విషయాన్ని తెలుసుకొని బాధపడుతున్న ఆకాష్-రేఖకు షాకిచ్చిన శంకర్ ప్రసాద్?
త్వరలో వర్ష చనిపోబోతుందన్న విషయం ఆకాష్ తెలుసుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం
Rangula Ratnam June 17th: పూర్ణ.. ఆరోజే చెప్పాను కదా అండి డాక్టరమ్మ తనకు ఈ రూపంలో ప్రాణం పోసింది అని అందుకే ఈరోజు తీసుకొచ్చాను అని.. ఇప్పటికైనా నిజం తెలుసుకోమని ఏడుస్తూ వేడుకుంటుంది. ఇక వెంటనే ఆ డాక్టరమ్మ జరిగిన విషయం శంకర్ ప్రసాద్ కు చెబుతుంది. తన ముఖం కాలిపోవడంతో రూపం లేనందుకు తన కూతురు రూపం ఇచ్చాను అని అంటుంది. ఇక తను గతాన్ని మర్చిపోవడంతో తన కూతురు అర్చన లాగా ఉంటుంది అనుకున్నాను అని కానీ అదే సమయంలో రకుల్ అన్ని విషయం తెలుసుకున్నాడు అని చెబుతుంది.
దాంతో అర్చన మీ ఇంటికి వచ్చిందని.. ఇక రఘు తనకు గతాన్ని గుర్తు చేయటం కోసం ఇక్కడికి వచ్చాడు అని.. నిజం ఎవరికీ చెప్పకుండా దాచాడు అని ఇక అర్చనకు గతం గుర్తుకురావడంతో తనే పూర్ణ అని తెలుసుకుందని చెబుతుంది. మీ మధ్య ఉన్న జ్ఞాపకాలు పంచుకుంటే మీరిద్దరూ ఒకటవుతారు అని శంకర్ ప్రసాద్ కు చెబుతుంది. అదే సమయంలో రేఖ వచ్చి కథ బాగా అల్లుతున్నారు అని అంటూ.. ఇన్ని రోజులు లేనిది ఆ డాక్టరమ్మని ఈరోజే ఎలా వచ్చింది అని ప్రశ్నిస్తుంది.
మళ్లీ తనే ఈవిడ ఎక్కడ నిజం చెబుతుందో అని ఆ డాక్టరమ్మని నేనే కిడ్నాప్ చేయించాను అని.. తెలివిగా తప్పించుకొని నిన్ను కలిసింది అని అంటుంది. వెంటనే డాక్టరమ్మ కోపంలోనైనా నిజం చెప్పావు రేఖ ఇప్పటికైనా తప్పులు ఒప్పుకో అని అంటుంది. వెంటనే రేఖ డాక్టరమ్మ పై ఫైర్ అవుతుంది. దాంతో తిరిగి పూర్ణ రేఖపై అరుస్తూ ఉండటంతో.. శంకర్ ప్రసాద్ పూర్ణపై కోప్పడతాడు.
ఇక డాక్టరమ్మ తను నిజంగానే కిడ్నాప్ చేయించింది అని అనటంతో వెంటనే రేఖ నటిస్తుంది. తిరిగి వారినే గట్టిగా హెచ్చరిస్తుంది. రఘు పూర్ణ తన తల్లి అని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ డీఎన్ఏ టెస్ట్ ఎందుకు మ్యాచ్ కాలేదు అని తిరిగి ప్రశ్నిస్తుంది రేఖ. దాంతో రఘు రిపోర్ట్స్ సిద్దు మార్పించాడు అని అంటాడు. ఇక నీ మాయమాటలు విని మా నాన్న అని అంటుండగా.. వెంటనే శంకర్ ప్రసాద్ రఘు చెంప పగలగొడతాడు.
వారిని ఎందుకు టార్గెట్ చేశావు.. నా దృష్టిలో పూర్ణ చనిపోయింది అని.. ఇక్కడి నుంచి మీరు వెళ్లిపోండి అని చెప్పి సిద్దుతో వాళ్లను బయటకు గెంటయ్యమని చెబుతాడు. దాంతో పూర్ణ వాళ్ళు చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు వర్ష అత్తమామలు భోజనం చేస్తూ ఉండగా అప్పుడే అక్కడికి వర్ష వస్తుంది. ఇక తన అత్త తనకు కూడా భోజనం పెడుతుంది.
కొత్త ఆవకాయ పచ్చడి వేసుకోమని చెబుతుంది. కానీ వర్ష ఇప్పుడు తనని డాక్టర్ ఆయిల్, కారం తినొద్దు అన్నదని మనసులో అనుకుంటుంది. తన అత్తయ్య మాత్రం వినకుండా పచ్చడి పెట్టి కలుపుతుంది. అది తింటే తన ప్రాణం మీదికి వస్తుంది అని మనసులో భయపడుతూ ఉంటుంది. లేకపోతే మీరు బాధపడతారు అని అనుకుంటుంది.
ఇక మిమ్మల్ని బాధ పెట్టలేను అనుకొని ఆ కారంతో ఉన్న అన్నం తినబోతుంటే అప్పుడే ఆకాష్ వచ్చి తన తల్లిపై అరుస్తాడు. తనకు అలవాటు లేదు అని భార్యను వెనకేసుకొస్తూ ఉంటాడు. తర్వాత గదిలోకి వెళ్లిన వర్షను ఉప్పు, కారం తినొద్దు అని చెప్పాను కదా అంటూ రిపోర్ట్స్ తీసుకొచ్చి చూపిస్తాడు ఆకాష్. ఆకాష్ కి నిజం తెలిసింది అని బాధపడుతుంది వర్ష.
ఇదంతా ఎప్పుడో తెలిసింది అని నీతో చెప్పలేక బాధపడుతున్నాను అని అంటాడు ఆకాష్. ఇక తను దూరం అయిపోతుందన్న బాధతో మాట్లాడుతూ ఉంటాడు. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవాలని అనుకుంటున్నాను అంటూ ఏడుస్తాడు. వెంటనే వర్ష మీరు ఇలా బాధపడతారని నేను చెప్పలేకపోయాను అని ఏడుస్తుంది.
ఆకాష్ కూడా చాలా బాధపడుతూ నిన్ను దగ్గరుండి చూసుకుంటాను అని ఎమోషనల్ అవుతాడు. ఓసారి ఇటువంటి జరగకూడదు అంటే అమ్మ వాళ్లకు కూడా నిజం చెప్పాలి అని అంటాడు. కానీ వర్ష అడ్డుపడుతుంది. ఈ విషయం తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు అని బాధపడుతుంది. ఈ నిజాన్ని వాళ్లకు చెప్పొద్దు అని ఒట్టు వేస్తుంది.
తరువాయి భాగంలో.. శంకర్ ప్రసాద్ ఖాళీ బాండ్ పేపర్ మీద సంతకం చేసి రేఖకు ఇస్తాడు. నీ పేరు మీద పట్టాని రాయించుకో అప్పుడు నిన్ను ఎవరు అడ్డుకోలేరు అని.. అవమానించలేరు.. నీ గౌరవానికి భంగం కలిగించలేరు అని అనటంతో రేఖ షాక్ అవుతుంది.