Krishnamma kalipindi iddarini July 4th: సౌదామినికి గట్టి వార్నింగ్ ఇచ్చిన ఆదిత్య.. అఖిల చేసిన పనికి కోపడ్డ గౌరీ?
సౌదామిని అవకాశం చూసుకుని మరోసారి ఇంట్లో రచ్చ చేయడం మొదలుపెట్టడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Krishnamma kalipindi iddarini July 4th: సునంద కుటుంబమంతా ఈశ్వర్, గౌరీ లను పెళ్లి కార్డు సెలెక్ట్ చేయమని అంటారు. దాంతో అఖిలకు కోపం వస్తుంది. ఇక వారిద్దరూ ఒకే రకమైన కార్డు సెలక్షన్ చేయటంతో ఇంట్లో వాళ్ళు మురిసిపోతారు. ఇక అఖిల మాత్రం తన అక్కను ఒక్కదాన్నే కోడలుగా చూస్తున్నారు అని తనను చూడటం లేదు అని తన తల్లితో చెప్పటంతో.. పెళ్లి జరిగాక అందరి పనులు చేస్తాను అని అంటుంది భవాని. అంతవరకు కాస్త ఓపిక పట్టు అని అంటుంది. కానీ అఖిల కు మాత్రం మరింత కోపం వస్తూ ఉంటుంది.
ఇదంతా సౌదామిని గమనిస్తూ సునంద పెద్ద కోడల్ని పట్టించుకుంటుందని చిన్నకోడల్ని పట్టించుకోవడంలేదని అనుకుంటుంది. దీంతో మళ్లీ చిచ్చు పెట్టాలి అని చూస్తుంది. ఇక ఇంట్లో వాళ్లంతా గౌరీ, ఈశ్వర్లను పొగుడుతూ ఉండగా అప్పుడే సౌదామిని వచ్చి న్యాయం, ధర్మం ఉండాలి అన్నట్లుగా మాట్లాడుతుంది. దానితో అందరు ఏం జరిగింది అని ఆశ్చర్యంగా చూస్తుంటారు.
ఇక సునంద కూడా ఏం మాట్లాడుతున్నావ్ అని అనటంతో.. వెంటనే సౌదామిని మ్యాటర్ లోకి వస్తుంది. పెళ్లికి ముందే పెద్ద కోడల్ని ఒకలా చిన్న కోడలి మరోలా చూస్తున్నావు. ఇంత పక్షవాతం ఎందుకు అనటంతో వెంటనే అఖిల, భవాని షాక్ అవుతారు. పెద్ద కోడలికి కార్డ్స్ చూడమని చెప్పావు కానీ చిన్న కోడలికి చెప్పలేదు.. ఇక్కడే తెలుస్తుంది నువ్వు ఇద్దరి మధ్య ఎటువంటి ప్రేమ చూపిస్తున్నావో అంటూ కావాలని గొడవ చేసి రచ్చ చేస్తూ ఉంటుంది.
ఇక వెంటనే సునంద తన మనసులో పెళ్లి హడావిడిలో అఖిలను మర్చిపోయాను అని అనుకుంటుంది. అదే విషయం సౌదామినితో చెప్పటంతో మరిపెద్ద కోడల్ని ఎలా మర్చిపోలేదు అని పెద్ద రాద్దాంతం చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య అత్తపై ఫైర్ అవుతూ ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చేయొద్దు అని అంటాడు. అన్నయ్య వాళ్లకు ఏది నచ్చితే మాకు కూడా అదే ఆ నచ్చుతుంది అని.. అమ్మ అందర్నీ సమానంగా చూస్తుంది ఆ విషయం నీకు కూడా తెలుసు అంటూ.. అయినా మా అన్నయ్యని ఎన్నిసార్లు అవమానించినా కూడా నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు అంటూ ఆమెపై కోప్పడి అక్కడి నుంచి బయటికి వెళ్తాడు.
ఇక వెనకాలే గౌరీ కూడా వెళ్తుంది. ఆదిత్య బయటికి వచ్చి అమృతను తలుచుకుంటూ మర్చిపోవడం కష్టమని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే గౌరీ వచ్చి ఏం జరిగింది.. అందరూ పెళ్లి హడావిడిలో సంతోషంగా ఉంటే నువ్వు మాత్రం ఇలా ఉన్నావు.. నీకు నిజంగా అఖిలను పెళ్లి చేసుకోవడం ఇష్టమా లేదా అని అడుగుతూ ఉంటుంది. అంతేకాకుండా అమృత చేతులు పట్టుకొని కూడా బ్రతిమాలవు ఎందుకోసం అని అడుగుతూ ఉంటుంది.
దాంతో ఆదిత్య గౌరీకి తనపై అనుమానం వచ్చింది అని తన బిజినెస్ పరంగా లాస్ వచ్చినందుకు బాధగా ఉన్నానని అబద్ధం చెబుతాడు. ఆ ప్రాబ్లం క్లియర్ అయినట్టే ఇప్పటినుండి సంతోషంగా ఉంటాను అని అంటాడు. దాంతో గౌరీ కూడా సంతోషపడుతుంది. ఇంటికి వెళ్లిన తర్వాత అఖిల.. ఈశ్వర్ గౌరీ కి ఇచ్చిన గిఫ్ట్ ను పడేస్తూ ఉండగా వెంటనే గౌరీ వచ్చి దాన్ని పట్టుకుంటుంది.
ఇది పొరపాటున జరిగింది అని అఖిల అనటంతో.. ఇదంతా నేను చూస్తున్నాను నువ్వే ఉద్దేశంతో పగలగొట్టావో అది నీకు కూడా తెలుసు అంటూ తనకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఏదైనా నీ మంచి కోసమే చెబుతాను అని.. నీపై కోపడ్డాను అంటే నీకు మంచి సలహాలు ఇస్తున్నాను అని అర్థం అని చెప్పి అక్కడ నుంచి వెళ్తుంది. ఇక మరోసారి తన జోలికి రాకూడదు అని చెప్పి వెళ్తుంది. అఖిల మాత్రం పెళ్లయ్యాక అప్పుడు నీ సంగతి చూస్తాను అని అనుకుంటుంది. ఆ తర్వాత సునంద కొడుకు కోడల్ని తీసుకొని జువెలరీ షాప్ కి వెళ్లి అక్కడ వాళ్ళని నగలు సెలెక్ట్ చేసుకోమని అంటుంది. ఇక గౌరీ తో నీకు నచ్చిన నగలు సెలెక్ట్ చేసుకోమని అనడంతో పక్కనే ఉన్న అఖిలకు బాగా కోపం వస్తుంది.
Also Read: Trinayani July 4th: మగాడి గొంతుతో షాకిచ్చిన సుమన.. దెబ్బకు వణికిపోయిన కుటుంబ సభ్యులు?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial