అన్వేషించండి

Nara Lokesh: బాలయ్యకు ఆ ఒక్కరంటే భయమే! బాలకృష్ణ ఐకానిక్ డైలాగ్ చెప్పిన నారా లోకేష్.. షో టెలికాస్ట్ ఎప్పుడంటే

Jayammu Nishchayammu Raa – Season 2 | ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్‌ ‘జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా’ సీజ‌న్‌2లో సంద‌డి చేశారు. బాలకృష్ణకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • జయమ్ము నిశ్చయమ్మురా షోకు మంత్రి నారా లోకేష్ అతిథిగా.
  • లోకేష్ స్కూలు అల్లరి, బాలయ్య భయం గురించి తెలిపారు.
  • లోకేష్ బాలకృష్ణ డైలాగు పలికి, నవంబర్ 8న ప్రసారం.

విలక్షణ నటుడు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్ 2కు అద్భుతమైన స్పందన వస్తోంది. లేటెస్ట్ సీజ‌న్‌లో తొలి ఎపిసోడ్ సాయి ప‌ల్ల‌వితో ప్రారంభం కాగా, ఇటీవల డైరెక్టర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌, మ్యూజిక్ డైరెక్టర్ థ‌మ‌న్ కాంబోలో సెకండ్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. న‌టుడు సునీల్ స్పెష‌ల్ గెస్ట్‌గా క‌నిపించి తెలుగు ప్రేక్షకులను అల‌రించారు. ఇప్పుడు అందరి దృష్టి మూడో ఎపిసోడ్‌పై పడింది. ఎందుకంటే ఈ ఎపిసోడ్‌లో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక అతిథిగా పొల్గొననున్నారు. అందుకు సంబంధించిన ప్రోమో విడుదల కాగా, అందులో మంత్రి నారా లోకేష్.. తన మామయ్య బాలకృష్ణ డైలాగ్ చెప్పడంతో పాటు ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను షేర్ చేసుకున్నారు. నారా లోకేష్ అనే నేను అని వినిపిస్తుండగా లోకేష్ ఎంట్రీ ఇచ్చినట్లు ప్రోమోలో కనిపించింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zee 5 Telugu (@zee5telugu)

స్కూల్ డేస్‌లో అల్లరి పిల్లాడు
నారా లోకేష్ ఈ షోలో భాగంగా స్కూల్ రోజుల్లో తాను చేసిన అల్లరి పిల్లాడిని అని పాత రోజులను గుర్తుచేసుకున్నారు. టీచర్ల నుంచి ఎక్కువ పనిష్మెంట్లు వచ్చేవని చెబుతూ నవ్వేశారు.  నిజంగానే అంత అల్లరి చేసేవారా? అని హోస్ట్ జగపతిబాబు అడిగారు. తన మామయ్య నందమూరి బాలకృష్ణ (Balakrishna)తో పోటీ పడాల్సి వచ్చేదంటూ లోకేష్ ఫన్నీగా బదులిచ్చారు. 

పెళ్లి సమయంలో ఆసక్తికర ఘటన.. నారా లోకేష్ తన పెళ్లి సమయంలో జరిగిన ఓ సరదా సంఘటనను గుర్తుచేసుకున్నారు. ఓ రోజు బాలకృష్ణ తనను అల్లుడుగారు అని పిలవడంతో ఏదో ఫిట్టింగ్ పెట్టేలా ఉన్నారేమోనని అనుకున్నానని సరదాగా చెప్పారు.

బాలయ్యకు ఒకరంటే భయమా ?
సినిమాల్లో తన పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో, మాస్ డైలాగ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే నందమూరి బాలకృష్ణ గురించి అల్లుడు నారా లోకేష్ ఓ ఆసక్తికరమైన విషయం తెలిపారు. మామయ్య బాలయ్య తన జీవితంలో ఒకే ఒక్క వ్యక్తికి భయపడతారంటూ ఈ విషయాన్ని సరదాగా చెప్పుకొచ్చారు. 

బాలయ్య డైలాగ్‌తో అదరగొట్టిన నారా లోకేష్  

బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ సినిమాలోని పాపులర్ డైలాగ్‌ను నారా లోకేష్ చెప్పి ప్రేక్షకులను అలరించారు. ఫ్లూటు జింక ముందు ఊదు... సింహం ముందు కాదు.. అంటూ బాలయ్య డైలాగ్ చెప్పడంతో ఈ ఎపిసోడ్ ప్రోమో ఆసక్తికరంగా ముగిసింది. 

జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా సీజ‌న్‌2లో నారా లోకేశ్ ఎపిసోడ్ న‌వంబ‌ర్ 6న ప్రీమియ‌ర్ కానుంది. న‌వంబ‌ర్ 8 రాత్రి 7గంట‌ల 30 నిమిషాల‌కు జీ తెలుగు ఛానెల్‌లో టెలికాస్ట్ కానున్న ఈ ఎపిసోడ్ గురించి ఆసక్తి నెలకొంది. ఎన్నికల హడావుడిలో ఉండి కూడా నారా లోకేష్ ఈ ప్రోగ్రాంకు వెళ్లారా అని టీడీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Frequently Asked Questions

'జయమ్ము నిశ్చయమ్మురా' సీజన్ 2 మూడో ఎపిసోడ్‌కు ప్రత్యేక అతిథి ఎవరు?

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఈ సీజన్ మూడో ఎపిసోడ్‌కు ప్రత్యేక అతిథిగా పొల్గొననున్నారు.

నారా లోకేష్ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం కానుంది?

నవంబర్ 6న ఈ ఎపిసోడ్ ప్రీమియర్‌ కాగా, నవంబర్ 8 రాత్రి 7:30 గంటలకు జీ తెలుగు ఛానెల్‌లో టెలికాస్ట్ కానుంది.

నారా లోకేష్ తన బాల్యం గురించి ఏమని పంచుకున్నారు?

తాను స్కూల్ రోజుల్లో అల్లరి పిల్లవాడినని, టీచర్ల నుంచి చాలా పనిష్మెంట్లు వచ్చేవని నారా లోకేష్ గుర్తుచేసుకున్నారు. బాలకృష్ణతో పోటీ పడేవారట.

నందమూరి బాలకృష్ణ ఎవరికి భయపడతారని నారా లోకేష్ చెప్పారు?

తన మామయ్య బాలయ్య తన జీవితంలో ఒకే ఒక్క వ్యక్తికి భయపడతారని నారా లోకేష్ సరదాగా చెప్పుకొచ్చారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 26th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: బొమ్మల కొలువులో క్రిష్‌ కారణంగా గొడవ! కారు గుర్తు పట్టి వణికిపోయిన అంబిక!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: బొమ్మల కొలువులో క్రిష్‌ కారణంగా గొడవ! కారు గుర్తు పట్టి వణికిపోయిన అంబిక!
Nindu Manasulu Serial Today October 26th: నిండు మనసులు: రౌడీలను చితక్కొట్టిన ప్రేరణ! ఒక్క అబద్ధంలో ఇంట్లో అందరూ హ్యాపీ!
నిండు మనసులు: రౌడీలను చితక్కొట్టిన ప్రేరణ! ఒక్క అబద్ధంలో ఇంట్లో అందరూ హ్యాపీ!
Godavari Serial Today October 26th: 'గోదావరి' సీరియల్: స్థలం అమ్మితే కమీషన్ ఇస్తానని జానుకి సంజయ్ టాస్క్! రాత్రి వేళ దెయ్యం కోసం జాను వేట!
'గోదావరి' సీరియల్: స్థలం అమ్మితే కమీషన్ ఇస్తానని జానుకి సంజయ్ టాస్క్! రాత్రి వేళ దెయ్యం కోసం జాను వేట!
Podarillu Serial Today Oct 24: కన్నా పుట్టుక గురించి భయంకరమైన నిజం తెలుసుకున్న మహా..నారాయణకు చేతులెత్తి మొక్కిన మహాలక్ష్మీ
పొదరిల్లు: కన్నా పుట్టుక గురించి భయంకరమైన నిజం తెలుసుకున్న మహా..నారాయణకు చేతులెత్తి మొక్కిన మహాలక్ష్మీ
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Ishan Kishan Out: మూడో టీ20 నుంచి ఇషాన్ కిషన్ ఔట్.. నంబర్ 3లో సూర్యవంశీ ఫ్లాప్ షోపై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
మూడో టీ20 నుంచి ఇషాన్ కిషన్ ఔట్.. నంబర్ 3లో సూర్యవంశీ ఫ్లాప్ షోపై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Rahul Gandhi Convoy Accident: రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న కార్లు
రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న కార్లు
Arnab Cyclone: ఏపీ వైపు దూసుకొస్తోన్న'అర్నబ్' తుపాను.. బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం.. రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్!
ఏపీ వైపు దూసుకొస్తోన్న'అర్నబ్' తుపాను.. బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం.. రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్!
Tadipatri Tension: తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మంచం వేసుకుని నిద్రించిన నేత
తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మంచం వేసుకుని నిద్ర
Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన స్కీమ్.. ముగ్గురు కుమార్తెలకు SSY అకౌంట్లు సాధ్యమేనా?.. పూర్తి వివరాలు ఇవే!
సుకన్య సమృద్ధి యోజన స్కీమ్.. ముగ్గురు కుమార్తెలకు SSY అకౌంట్లు సాధ్యమేనా?.. పూర్తి వివరాలు ఇవే!
Embed widget