అన్వేషించండి

సీనియర్ నటులు, హీరో చంద్రమోహన్ మృతి, ‘దీపావళి’ రివ్యూ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

సీనియర్ నటులు, హీరో చంద్రమోహన్ మృతి
సీనియర్ నటులు, కథనాయకులు చంద్ర మోహన్ ఇక లేరు. ఈ రోజు ఉదయం ఆయన కన్ను మూశారు. భాగ్య నగరం (హైదరాబాద్ సిటీ)లోని ప్రముఖ ఆస్పత్రి అపోలో 9 గంటల 45 నిమిషాలకు హృద్రోగంతో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం చంద్ర మోహన్ వయసు 82 సంవత్సరాలు. ఆయనకు ఓ భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చంద్ర మోహన్ భార్య పేరు జలంధర. ఇద్దరు కుమార్తెలకు వివాహాలు చేశారు. ఉన్నారు. సోమవారం హైదరాబాద్ సిటీలో అంత్యక్రియలు నిర్వహిస్తారని చంద్ర మోహన్ కుటుంబ సభ్యులు తెలిపారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మిశ్రమ టాక్​లోనూ తగ్గని ‘జపాన్‘, తమిళంతో పోలిస్తే తెలుగులో ఓపెనింగ్స్ అదుర్స్
తమిళ హీరో కార్తీకి తెలుగులోనూ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. కార్తీ మూవీ వస్తుందంటే తెలుగు ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘ఆవారా’ తెలుగులో ఓ రేంజిలో సక్సెస్ అందుకున్నాడు కార్తీ.  ఏకంగా 100 డేస్ ఆడి అప్పట్లో రికార్డు సృష్టించింది. ఈ సినిమా తర్వాత కార్తీకి తెలుగులో అభిమానులు పెరిగిపోయారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ప్రతి సినిమా తెలుగులో విడుదల అవుతుంది. తెలుగు హీరోలతో సమానంగా వసూళ్లు వస్తున్నాయి. రీసెంట్ గా ‘సర్దార్’తో బ్లాక్ బస్టర్ కొట్టారు. తాజాగా ‘జపాన్‘ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మొదటి రోజు మార్నింగ్ షోలతో పోల్చితే మధ్యాహ్నం  తర్వాత షోలు మంచి ఆక్యుపెన్సీని సాధించినట్లు తెలుస్తోంది. ఊహించని విధంగా చాలా థియేటర్లు హౌస్‌ఫుల్‌ అయినట్లు సమాచారం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

హరీష్ శంకర్ కాదు, ఈ దర్శకుడితో రవితేజ కొత్త సినిమా?
మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమాకు ఓకే చెప్పారా? ప్రస్తుతం ఆయన కథలు వినే పనిలో ఉన్నారా? అంటే... 'అవును' అని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. రవితేజ నటించిన 'ఈగల్' సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది. దాని తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయవచ్చని ఆ మధ్య వార్తలు వినిపించాయి. అయితే వాటిని దర్శకుడు ఖండించారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయడానికి రవితేజ రెడీ అవుతున్నారట. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

దీపావళి సినిమా రివ్యూ : మేక ప్రాణం మీదకు తెచ్చిన మనవడి కోరిక - కంటతడి పెట్టించే క్లైమాక్స్!
దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదలైన సినిమా 'దీపావళి'. ప్రముఖ తెలుగు నిర్మాత, శ్రీ స్రవంతి మూవీస్ అధినేత 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా 'కిడ'కు తెలుగు అనువాదం ఇది. నవంబర్ 11న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు. ప్రేక్షకులకు చూపించడానికి ముందు చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. ప్రీమియర్ షోల నుంచి మంచి స్పందన అందుకున్న ఈ సినిమా ఎలా ఉంది? ఏమిటి? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

నిన్న మోహన్ లాల్, నేడు శరత్ కుమార్ - ‘కన్నప్ప’ కోసం మంచు ఫ్యామిలీ ఎక్కడా తగ్గట్లేగా
వరుస పరాజయాలతో కెరీర్ కొనసాగిస్తున్న మంచు విష్ణు, ఓ ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నారు. దిగవంగత నటుడు కృష్ణంరాజు హీరోగా తెరకెక్కిన కల్ట్ క్లాసిక్ మూవీ ‘భక్త కన్నప్ప’ చిత్రాన్ని తిరిగి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్ లో కొనసాగుతోంది. ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు అగ్ర హీరోలు నటిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ మేకర్స్ ఫోటోలను షేర్ చేశారు. ఈ సినిమాలో ఇద్దరు స్టార్‌ హీరోలు జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలిపారు. వారిలో ఒకరు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కాగా, మరొకరు తమిళ స్టార్ హీరో శరత్ కుమార్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - నలుగురు మృతి
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - నలుగురు మృతి
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
YS Sharmila: రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
The Raja Saab Exclusive Update : ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్హనుమంత వాహనంపై పద్మావతి అమ్మవారుVenkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - నలుగురు మృతి
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - నలుగురు మృతి
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
YS Sharmila: రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
The Raja Saab Exclusive Update : ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
Sajjala Bhargav Reddy Latest News: సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
5G Smartphones Under 20000: రూ.20 వేలలో బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - బడ్జెట్ ధరలో వర్త్ అనిపించే మొబైల్స్!
రూ.20 వేలలో బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - బడ్జెట్ ధరలో వర్త్ అనిపించే మొబైల్స్!
Tiger Attacks in Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి టెన్షన్, దాడి నుంచి రక్షించుకునేందుకు ఈ కొత్త టెక్నిక్ తెలుసా?
ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి టెన్షన్, దాడి నుంచి రక్షించుకునేందుకు ఈ కొత్త టెక్నిక్ తెలుసా?
Farmers Protest: ఈ 6 నుంచి రైతుల ‘ఢిల్లీ ఛలో’ పాదయాత్రతో అలర్ట్, భారీగా పోలీసుల మోహరింపు
ఈ 6 నుంచి రైతుల ‘ఢిల్లీ ఛలో’ పాదయాత్రతో అలర్ట్, భారీగా పోలీసుల మోహరింపు
Embed widget