News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

బాలయ్య మూవీ టైటిల్ ఇదేనా, సమంత చెప్పులు చాలా కాస్ట్లీ గురూ - ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలివే

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

FOLLOW US: 
Share:

ద్యావుడా - పవన్ షూ కంటే సమంత చెప్పుల రేటు డబుల్!

'బ్రో' సినిమాలో మామ అల్లుడు కలిసి ఉన్న పోస్టర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒక్కటే చర్చ... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షూ గురించి! దాని రేటు అక్షరాలా లక్ష రూపాయలు (Pawan Kalyan Shoes Cost)! పవన్ కోసం ప్రత్యేకంగా ఇటలీకి చెందిన గియుసేప్ జానోట్టి బ్రాండ్ షూస్ తెప్పించారు! అది పక్కన పెడితే... సినిమాల్లో కాదు, నిజ జీవితంలో సమంత ధరిస్తున్న చెప్పుల ఖరీదు వింటే నోరెళ్లబెట్టాలి! (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

అప్పుడేం మాట్లాడలేదు, ఇప్పుడెలా నమ్మాలి : కమల్ హాసన్‌కు సింగర్ చిన్మయి కౌంటర్

సింగర్-వాయిస్-ఓవర్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద... తమిళ సూపర్ స్టార్, యూనివర్సల్ స్టార్, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. జాతీయ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌‌పై.. రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేసి.. తమకు న్యాయం చేయాలని కోరుతూ గత కొన్ని రోజులుగా ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారికి సపోర్ట్ గా కమల్ హాసన్ ఇటీవల ట్వీట్ చేశారు. తాజాగా దానికి కౌంటర్ గా ఆమె రిప్లై ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

టాలెంట్ లేకే ఇన్నాళ్లు సినిమాల్లోకి రాలేదు: దగ్గుబాటి అభిరామ్

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు రెండో కొడుకు అభిరామ్ హీరోగా, తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అహింస’. గీతిక తివారీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సదా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాతో రానా సోదరుడు అభిరామ్ వెండి తెరకు హీరోగా పరిచయం అవుతున్నారు. షూటింగ్ మొదలైనప్పటి నుంచి రకరకాల ఇబ్బందులను ఎదుర్కొన్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు రెడీ అవుతోంది. జూన్ 2వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

నెల రోజుల్లోనే ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ '2018' - ఎప్పుడు? ఎక్కడ? అంటే...

2023 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలలో ‘2018’ ఒకటి. కేరళలో సంభవించిన వరదల ఇతివృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన ఈ సర్వైవల్ థ్రిల్లర్, బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టింది. మలయాళ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంకా థియేటర్లలో మంచి నంబర్స్ నమోదు చేస్తున్న ఈ మూవీ.. నెల రోజుల్లోనే డిజిటల్ వేదిక మీదకు వస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

టైటిల్ కన్ఫర్మ్ - NBK 108లో బాలకృష్ణ క్యారెక్టర్ పేరే సినిమాకు, అది ఏమిటంటే?

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ ఖరారు అయ్యింది. హీరోగా నట సింహానికి 108వ చిత్రమిది. ఇందులో ఆయన పేరే సినిమాకు పెట్టేశారని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. జూన్ 10న బాలకృష్ణ బర్త్ డే (Balakrishna Birthday). ఆ రోజు టైటిల్ పోస్టర్ విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Published at : 30 May 2023 05:00 PM (IST) Tags: Tollywood News Movie News entertainment news TV News CINEMA NEWS

ఇవి కూడా చూడండి

Sundeep Kishan New Movie : పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సందీప్ కిషన్ కొత్త సినిమా - డైరెక్టర్ ఎవరంటే?

Sundeep Kishan New Movie : పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సందీప్ కిషన్ కొత్త సినిమా - డైరెక్టర్ ఎవరంటే?

The Great Indian Suicide : ఆహాలో 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' - హెబ్బా పటేల్ సినిమా ఎక్స్‌క్లూజివ్‌ రిలీజ్!

The Great Indian Suicide : ఆహాలో 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' - హెబ్బా పటేల్ సినిమా ఎక్స్‌క్లూజివ్‌ రిలీజ్!

Chandramukhi 2: ‘చంద్రముఖి 2‘ విడుదలకు ముందు రజనీకాంత్ ఆశీర్వాదం తీసుకున్న రాఘవా లారెన్స్

Chandramukhi 2: ‘చంద్రముఖి 2‘ విడుదలకు ముందు రజనీకాంత్ ఆశీర్వాదం తీసుకున్న రాఘవా లారెన్స్

Prema Entha Madhuram September 26th: ఆర్య సహాయంతో ఉట్టిని కొట్టిన అక్కి - అనుని చూసిన ఆర్య!

Prema Entha Madhuram September 26th: ఆర్య సహాయంతో ఉట్టిని కొట్టిన అక్కి - అనుని చూసిన ఆర్య!

Gruhalakshmi September 26th: విక్రమ్-జానూ వేషాలు, దివ్య ఫైర్, తులసికి రత్నప్రభ స్వీట్ వార్నింగ్!

Gruhalakshmi September 26th: విక్రమ్-జానూ వేషాలు, దివ్య ఫైర్, తులసికి రత్నప్రభ స్వీట్ వార్నింగ్!

టాప్ స్టోరీస్

Chandrababu News: చంద్రబాబు పిటిషన్‌లపై విచారణ రేపటికి వాయిదా, సెలవులో ఏసీబీ కోర్టు జడ్జి

Chandrababu News: చంద్రబాబు పిటిషన్‌లపై విచారణ రేపటికి వాయిదా, సెలవులో ఏసీబీ కోర్టు జడ్జి

Telangana Cabinet: రెండు మూడు రోజుల్లో తెలంగాణ కేబినెట్ భేటీ, ప్రధాన అజెండాలు ఇవే!

Telangana Cabinet: రెండు మూడు రోజుల్లో తెలంగాణ కేబినెట్ భేటీ, ప్రధాన అజెండాలు ఇవే!

Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం, ఆస్పత్రికి తరలింపు

Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం, ఆస్పత్రికి తరలింపు

Kumbham Anil: BRSకు బై, కాంగ్రెస్‌కు హాయ్ చెప్పిన కుంభం అనిల్, 2 నెలల్లోనే సొంతగూటికి చేరడానికి కారణం ఏంటంటే?

Kumbham Anil: BRSకు బై, కాంగ్రెస్‌కు హాయ్ చెప్పిన కుంభం అనిల్, 2 నెలల్లోనే సొంతగూటికి చేరడానికి కారణం ఏంటంటే?