‘మళ్లీ పెళ్లి’ ఎలా ఉంది? ‘మేమ్ ఫేమస్’ బాగుందా? మహేష్ కూతురికి భారీ ఆఫర్ - నేటి సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
'మేమ్ ఫేమస్' రివ్యూ : 'మేజర్', 'రైటర్ పద్మభూషణ్' తర్వాత ఛాయ్ బిస్కెట్‌కు మరో హిట్టేనా?
యూట్యూబ్ సిరీస్, మ్యూజిక్ వీడియో సాంగులతో ఫేమస్ అయిన యువకుడు సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas). అతను కథానాయకుడిగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా 'మేమ్ ఫేమస్' (Mem Famous Movie). 'మేజర్', 'రైటర్ పద్మభూషణ్' తర్వాత ఛాయ్ బిస్కెట్ అధినేతలు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించిన చిత్రమిది. లహరి ఫిల్మ్స్ చంద్రు మనోహర్ నిర్మాణ భాగస్వామ్యంతో తెరకెక్కించారు. విడుదలకు ముందు ప్రముఖులు చాలా మంది ప్రమోట్ చేశారు. ప్రచారంతో హోరెత్తించారు. మరి, సినిమా ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
సత్తిగాని రెండెకరాలు' రివ్యూ : ఆహాలో వినోదాత్మక నేర చిత్రం - ఎలా ఉందంటే?
'పుష్ప' సినిమాతో నటుడు జగదీష్ ప్రతాప్ బండారి (Jagadeesh Prathap Bandari)కి మంచి గుర్తింపు వచ్చింది. అందులో అల్లు అర్జున్ స్నేహితునిగా, కేశవ పాత్రలో నటించారు. జగదీష్ కథానాయకుడిగా నటించిన సినిమా 'సత్తిగాని రెండెకరాలు' (Sathi Gani Rendu Ekaralu Movie). 'పుష్ప' సహా పలు హిట్ చిత్రాలు నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే ఈ చిత్రాన్నీ నిర్మించింది. 'వెన్నెల' కిశోర్, మోహన శ్రీ, మురళీధర్ గౌడ్, అనీషా దామా తదితరులు నటించారు. ఈ సినిమా ఆహా ఓటీటీ (Aha Original Movie)లో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
'గురూజీకి కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తే నిర్మాత అయిపోవచ్చు' - బండ్ల ట్వీట్ త్రివిక్రమ్‌ను ఉద్దేశించేనా?
బండ్ల గణేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్యనటుడుగా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత కాలంగా ప్రొడ్యూసర్ గా అగ్ర హీరోలతో సినిమాలు నిర్మించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇటీవల బండ్ల తన ట్వీట్స్ తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే ఆయన, లేటెస్టుగా 'గురూజీ' అంటూ పెట్టిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
'మళ్ళీ పెళ్లి' రివ్యూ : నరేష్, పవిత్ర తప్పు చేశారా? లేదంటే రమ్యా రఘుపతిది తప్పా? ఏం చూపించారంటే?
నవరస రాయ డా. నరేష్ (Naresh VK), పవిత్రా లోకేష్ (Pavitra Lokesh) వ్యక్తిగత జీవితంలో జరిగిన అంశాలను తీసుకుని 'మళ్ళీ పెళ్లి' తీశారా? అనే సందేహం చాలా మందిలో ఉంది. ఈ సినిమాకు వ్యతిరేకంగా నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి కోర్టును ఆశ్రయించారు కూడా! ఎంఎస్ రాజు (MS Raju) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉంది (Malli Pelli Review)? అందరూ భావిస్తున్నట్టు 'మళ్ళీ పెళ్లి' నరేష్, పవిత్రాల బయోపిక్ యేనా? లేదంటే కల్పిత కథతో తీశారా? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్‌గా సితార - ఇండియాలోనే ఫస్ట్ స్టార్ కిడ్‌గా రికార్డ్!
టాలీవుడ్ అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార కి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చిన్నప్పటి నుంచి ఎంతో యాక్టివ్ గా ఉండే సితార సోషల్ మీడియాలో ఎంతోమంది ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. సోషల్ మీడియాలో డాన్స్ వీడియోలు, ఫోటోలను పోస్ట్ చేస్తూ మంచి పాపులారిటీని తెచ్చుకుంది. సినిమాల్లోకి రాకపోయినా సితార పాపకి సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశక్తి కాదేమో. ఇటీవల తన తండ్రి నటించిన 'సర్కారు వారి పాట' సినిమాలో స్పెషల్ స ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ స్టార్ కిడ్ మరో ముందడుగు వేసింది. ఏకంగా ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ అవతారం ఎత్తింది సితార. ప్రీమియం జ్యువెలరీ బ్రాండ్ ను ఆమోదించే అతిపెద్ద కాంట్రాక్టు పై సైన్ చేసిన ఫస్ట్ ఇండియన్ స్టార్ కిడ్ గా సరికొత్త రికార్డును నెలకొల్పింది సితార. ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ PMJ జ్యువెలరీ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది మహేష్ కూతురు సితార. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)