శరత్ బాబు ఇక లేరు, శ్రీనగర్‌లో చెర్రీ, బ్రహ్మాండంగా బ్రహ్మీ రెండో కొడుకు నిశ్చితార్థం - ఇవీ ఈ రోజు సినీ విశేషాలు
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
టాలీవుడ్ దిగ్గజ నటుడు శరత్ బాబు ఇకలేరు
సినీ ప్రేమికులకు బ్యాడ్ న్యూస్. 50 వసంతాల పాటు టాలీవుడ్‌లో దిగ్గజ నటుడిగా వెలుగొందిన శరత్ బాబు ఇక లేరు. తన తోటి కళాకారులు, అభిమానులు, బంధువులను వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. శరత్ బాబు గత కొద్ది రోజులుగా కిడ్నీస్ ఫెయిల్యూర్, బ్లడ్ ఇన్ఫెక్షన్‌తో బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం ఇటీవలే హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్‌కు తరలించారు. సోమవారం తీవ్ర అస్వస్థతకు గురైన శరత్ బాబు 2 గంటల సమయంలో కన్ను మూశారు. శరత్ బాబు పార్థీవ శరీరాన్ని చెన్నైకు తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. శరత్ బాబు మరణంపై తెలుగు సినీ పరిశ్రమ, ఆయన అభిమానాలు దీగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఈ వారంలో చిన్న సినిమాల దూకుడు - థియేటర్, ఓటీటీ మూవీస్ ఇవే!
మే చివరి వారంలో పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఈ వారం విడుదలయ్యే సినిమాలలో ఎక్కువగా చిన్న చిత్రాలే ఉన్నాయి. ఇక ఓటీటీలోనూ పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
నాకు ఒక శక్తి అండగా ఉంది, కష్టపడి నా కలలు నెరవేర్చుకున్నా: పవిత్ర లోకేష్
సీనియర్ నటుడు నరేష్, ప్రముఖ నటి పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం 'మళ్ళీ పెళ్లి'. ఎంఎస్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విజయ కృష్ణ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. నరేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నరేష్, పవిత్ర మధ్య ప్రేమయాణాన్ని 'మళ్ళీ పెళ్లి' పేరుతో వెండితెరపై చూపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, ట్రైలర్ ఇదే విషయాన్ని కన్ఫామ్ చేస్తున్నాయి. త్వరలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో నరేష్, పవిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
అట్టహాసంగా బ్రహ్మానందం రెండో కొడుకు ఎంగేజ్మెంట్, వధువు ఎవరంటే?
టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. త్వరలోనే ఆయన చిన్న కొడుకు సిద్దార్థ్ పెళ్లి కొడుకు కాబోతున్నాడు. డాక్టర్ పద్మజ వినయ్ కూతురు ఐశ్వర్య మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. తాజాగా సిద్దార్థ్ నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం వీరి నిశ్చితార్థ వేడుకకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకలో కమెడియన్ ఆలీ, రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త సుబ్బిరామిరెడ్డి సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
శ్రీనగర్‌కు రామ్ చరణ్ - షూటింగ్‌కు కాదు, జీ 20 సదస్సుకు!
జమ్ము కశ్మీర్ లోని శ్రీనగర్ లో జరుగుతున్న జీ 20 సదస్సులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొననున్నారు. అందుకోసం ఇప్పటికే ఆయన శ్రీనగర్ చేరుకున్నారు. ఈ సమ్మిట్ కు హాజరైన అనంతరం టూరిజం వర్కింగ్ గ్రూప్ మీట్ లో ఆయన అంతర్జాతీయ ప్రతినిధులతో భేటీ అవుతారు. కాగా వివిధ దేశాల నుంచి వచ్చిన సెలబ్రెటీలు, ప్రముఖులు ఈ సమావేశంలో ఫిల్మ్ టూరిజం, ఎకో ఫ్రెండ్లీ టూరిజంపై చర్చించనున్నారు. జమ్మూకశ్మీర్ లో అందుబాటులో ఉన్న అవకాశాలు, ప్రోత్సాహకాలపై చర్చ జరగనుందని అధికారులు ఇప్పటికే వెల్లడించారు. మన దేశంలో టూరిజం పరంగా ముఖ్యమైన జమ్మూకశ్మీర్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో సినిమా షూటింగ్ ల కోసం సింగిల్ విండోను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. ఇదిలా ఉండగా ఈ సదస్సుకు ధర్మం, నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)