‘సింహాద్రి’ కలెక్షన్స్ అదుర్స్, కల్లు తాగిన రానా - ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
‘మెన్ టు’ ట్రైలర్: బేసిగ్గా అమ్మాయిలంతా మంచోళ్ళు - మరి, మగాళ్ళ బాధలు ఏంటి?
'మత్తు వదలరా', 'సేనాపతి', 'పంచతంత్రం' ఫేమ్ నరేష్ అగస్త్య (Naresh Agastya) కథానాయకుడిగా రూపొందిన సినిమా '# మెన్ టూ' (Men Too Movie). ఇందులో ఆయనకు జోడీగా నాని 'మజ్ను', 'పేపర్ బాయ్', 'టాప్ గేర్' ఫేమ్ రియా సుమన్ కథానాయికగా నటించారు. ప్రముఖ నటుడు బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, మౌర్య సిద్ధవరం, కౌశిక్ ఘంటశాల, ప్రియాంక శర్మ ఇతర ప్రధాన తారాగణం. ఈ నెల 26న సినిమా విడుదల అవుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
లండన్ థియేటర్‌లో తారక్ ఫ్యాన్స్ హంగామా - మూవీ నిలిపివేత
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆల్ టైమ్ హిట్ 'సింహాద్రి' సినిమా స్క్రీనింగ్ సమయంలో థియేటర్లో అభిమానులు పటాసులు పేల్చడంతో సినిమాను నిలిపివేశారు. వెస్ట్ లండన్‌లో జరిగిన ఈ సంఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో సినిమా వీక్షించడానికి వచ్చిన కొందరు అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో నిర్వాహకులు వెంటనే సినిమాను నిలిపివేసి, థియేటర్ ను ఖాళీ చేయించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
కమెడియన్ ఇంట్లో రూ.2 వేల నోట్ల కట్టలు - మంచు విష్ణు ట్వీట్ వైరల్
తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ప్రముఖ నటుడు మంచు విష్ణు ఎంత కామెడీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరితో కలిసి మెలిసి ఉంటూ ఫుల్ ఫన్ చేస్తుంటారు. ఆయన వచ్చారంటే ఎంత సీరియస్ మ్యాటర్ అయినా, ఫన్ తో తేలికగా మారిపోతుంది. తాజాగా మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా పెట్టి ఓ పోస్టు కూడా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
రానాకు కల్లు దావత్ ఇచ్చిన గంగవ్వ, నిషాలో నిజం చెప్పి ‘పరేషాన్’ చేసిన బళ్లాల దేవుడు!
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి సమర్పణలో రూపొందుతున్న తాజా చిత్రం ‘పరేషాన్’. ‘ఘాజీ’, ‘మల్లేశం’, ‘జార్జిరెడ్డి’, ‘పలాస’,‘మసూద’ లాంటి చిత్రాలతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నతిరువీర్.. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. తెలంగాణ యాసలో ఫుల్ ఫన్ తో అందరినీ అలరిస్తోంది. ఈ మూవీ టీజర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ సైతం అందిరనీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు, ఈ సినిమాను రానా సమర్పిస్తున్నట్లు ప్రకటించినప్పుడే ఓ రేంజిలో అంచనాలు పెరిగాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
‘సింహాద్రి’ రీరిలీజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ అదుర్స్ - న్యూ రిలీజ్‌కు కూడా ఇంత రాదేమో!
ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో భారీ అంచనాల నడుమ 9 జులై 2003వ సంవత్సరంలో విడుదలైన 'సింహాద్రి'(Simhadri) మరో సారి ట్రెండింగ్ లో నిలిచింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) పుట్టినరోజు సందర్భంగా మే 20న మేకర్స్ ఇటీవలే మరోసారి థియేటర్లలో రిలీజ్ చేశారు. భూమిక చావ్లా , అంకిత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా.. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి 'సింహాద్రి' అదే కలెక్షన్లను కొనసాగిస్తోంది. విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.5.2 కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది. దీంతో 'సింహాద్రి' 'ఆల్ టై రికార్డ్ సినిమా'ల జాబితాలో మరోసారి చేరిపోయింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)