‘ఆదిపురుష్’ టీమ్‌ను వెంటాడుతున్న భయం, కళ్యాణికి ‘మా’ షాక్ - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
కరాటే కళ్యాణికి షాకిచ్చిన ‘మా’ - షోకాజ్ నోటీసులు జారీ
ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సినీనటి కరాటే కళ్యాణి తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. కరాటే కళ్యాణికి మా అసోసియేషన్ షోకాస్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల సీనియర్ ఎన్టీఆర్ గారిపై చేసిన వ్యాఖ్యలపై తగిన వివరణ ఇవ్వాలని కోరింది. లేకపోతే ఆమెపై తగిన విధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈనెల 28వ తేదీన ఖమ్మంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు చాలా గ్రాండ్ గా జరగబోతున్నాయి. ఇక ఈ ఉత్సవాల్లో భాగంగా ఖమ్మంలో లకారం ట్యాంక్ బండ్ వద్దా సుమారు 54 అడుగుల పొడవైన శ్రీకృష్ణుని రూపంలో ఉన్న సీనియర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈ విగ్రహ ఆవిష్కరణకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
తన బాడీగార్డ్స్ చేసిన పనికి షాకైన రష్మిక - ఫ్యాన్స్ మనసు దోచుకున్న నేషనల్ క్రష్!
'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయిన హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలోనే ఆమెకున్న పాపులారిటీ కారణంగా ఆమెతో ఫొటోలు దిగడానికి అభిమానులు ఎగబడ్డారు. అందులో ఓ యువకుడు రష్మికతో సెల్ఫీ దిగడానికి రాగా, అతన్ని ఆమె బాడీగార్డులు దూరంగా తోసేశారు. దీంతో షాకైన రష్మిక.. బాడీగార్డులను ఆపడానికి ప్రయత్నించింది. అంతే కాకుండా ఆమె ముందుకు నడుస్తూ కూడా అతను బాగున్నాడా అని పరిశీలించింది. ఆ తర్వాత ఆమె వెనకే సెల్ఫీ కోసం వచ్చిన ఆ బాలికతో ఫొటో ఫోజిచ్చి అందర్నీ ఆకర్షించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రష్మిక.. తెలుపు రంగు సంప్రదాయ కుర్తీని ధరించి, మినిమల్ మేకప్ లో అందంగా కనిపించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
జూన్ తొలివారంలో శర్వానంద్ పెళ్లి - ఎప్పుడు, ఎక్కడ అంటే?
యంగ్ కథానాయకుడు శర్వానంద్ (Sharwanand) అతి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. రక్షిత (Sharwanand fiance Rakshita)తో ఏడు అడుగులు వేయడానికి ఆయన రెడీ అయ్యారు. శర్వా నిశ్చితార్థం, పెళ్లి గురించి సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. అయితే, వాటిని హీరో టీమ్ ఖండించింది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... ఆయన పెళ్లి తేదీ ఖరారు అయ్యింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
'ఆదిపురుష్' టీమ్ భయపడుతోందా? - ప్రభాస్ ఫ్యాన్స్‌లో భయం భయం!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. పురాణ ఇతిహాస గ్రంథమైన రామాయణం ఆధారంగా ఆయన చేసిన సినిమా 'ఆదిపురుష్'. ప్రభు శ్రీరామచంద్రుడి పాత్రలో ప్రభాస్ నటించిన సంగతి తెలిసిందే. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. అయితే, జూన్ 13న ట్రిబెకా చలన చిత్రోత్సవాల్లో ప్రీమియర్ వేయడానికి సన్నాహాలు చేశారు. దాంతో విడుదలకు రెండు రోజుల ముందు టాక్ తెలుసుకోవచ్చని ఫ్యాన్స్ సంబరపడ్డారు. అయితే, ఇప్పుడు ఆ అవకాశం లేదు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
10 రోజుల్లో రూ.100 కోట్లు వసూల్, తెలుగులోకీ రాబోతున్న మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ!
జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వంలో టోవినో థామస్, అపర్ణ బాలమురళీ, తన్వి రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘2018'. కేవలం రూ.15 కోట్లతో రూపొందించిన ఈ మలయాళం సినిమా కేవలం 10 రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. మలయాళీ బాక్సాఫీస్ దగ్గర పలు సంచలనాలు సృష్టిస్తోంది. త్వరలో ఈ మూవీ తెలుగులో కూడా విడుదల కానుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)