బాలయ్య మూవీ టైటిల్‌కు భారీ ప్లాన్, ఓంరౌత్ ముద్దు వివాదం - ఇంకా మరెన్నో సినీ విశేషాలు మీ కోసం
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన
తిరుమల శ్రీవారి (Tirumala Venkateswara Temple)ని ఈ రోజు (జూన్ 7వ తేదీ) ఉదయం 'ఆదిపురుష్' చిత్ర బృందం దర్శించుకుంది. చిత్ర దర్శకుడు ఓం రౌత్ (Om Raut), సీతా దేవి పాత్రలో నటించిన కథానాయిక కృతి సనన్ (Kriti Sanon) ఏడు కొండల వెంకటేశ్వర స్వామి వారి అర్చన సేవలో పాల్గొన్నారు. స్వామి వారి పాదాల చెంత మంగళవారం సాయంత్రం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. నేడు ఉదయమే స్వామి వారి ఆశీస్సుల కోసం దర్శకుడు, హీరోయిన్ ఇతరులు వచ్చారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి - బాలకృష్ణ సినిమా టైటిల్ ఆవిష్కరణకు భారీ ప్లాన్
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా 'భగవంత్ కేసరి' (NBK 108 Movie Titled Bhagavanth Kesari). 'ఐ డోంట్ కేర్'... అనేది ఉప శీర్షిక. ఇంకా టైటిల్ అధికారికంగా ప్రకటించలేదు. జూన్ 8వ తేదీన... అనగా రేపు టైటిల్ వెల్లడించడానికి ఏర్పాట్లు జరిగాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఓటీటీలోకి రాబోతున్న నాగ చైతన్య 'కస్టడీ' - ఎప్పటి నుంచంటే..
టాలీవుడ్ హీరో నాగ చైతన్య, హీరోయిన్ కృతి శెట్టిలు జంటగా నటించిన 'కస్టడీ' చిత్రం త్వరలో ఓటీటీ(OTT) ప్లాట్‌ఫామ్‌పైకి రావడానికి సిద్ధంగా ఉంది. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా జూన్ 9 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. ఈ చిత్రం మే 2023లో థియేటర్లలో విడుదలైంది. కాగా ఈ మూవీలో అరవింద్ స్వామి, ప్రియమణి, ఆర్ శరత్‌కుమార్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఓ కార్పొరేట్ బానిస కథ - ఆహా నుంచి 'అర్థమైందా అరుణ్ కుమార్'
సత్తిగాని రెండెకరాలు వెబ్ ఫిల్మ్, అంతకు ముందు 'న్యూసెన్స్' వెబ్ సిరీస్... గత నెలలో బ్యాక్ టు బ్యాక్ రెండు ఎంటర్టైనర్స్ వీక్షకులకు అందించింది 'ఆహా' ఓటీటీ. 'తెలుగు ఇండియన్ ఐడల్' అయితే డిజిటల్ స్క్రీన్లకు వీక్షకులకు అతుక్కుపోయి మరీ చూసేలా చేసింది. ఎప్పటికప్పుడు సరికొత్త వినోదాన్ని వీక్షకులకు అందించే 'ఆహా' ఓటీటీ... ఇప్పుడు ఓ కార్పొరేట్ కంపెనీ, అందులో ఉద్యోగుల నేపథ్యంలో కొత్త వెబ్ సిరీస్ తీసుకొస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో ప్రియాంక చోప్రా?
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' విడుదల ముందు వరకు ఓ లెక్క... ఆ సినిమా విడుదల తర్వాత మరో లెక్క! ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) కు భారత ప్రేక్షకులలో మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సొంతం అయ్యింది. అందుకు తగ్గట్టుగా ఆయన సినిమాల్లో హీరోయిన్లను, ఇతర నటీనటుల ఎంపికలో దర్శకులు జాగ్రత్త వహిస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)