By: ABP Desam | Updated at : 19 Aug 2023 05:14 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం ( Image Source : Pixabay )
బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ‘జైలర్’, రూ. 500 కోట్లు వసూళ్లు!
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ థియేటర్లలో దుమ్మురేపుతోంది. తొలి షో నుంచి మొదలుకొని ఇప్పటి వరకు సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు. తమిళనాట ఇప్పటీ థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులు పెట్టుకుంటున్నాయి. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తొలి రోజు నుంచి కలెక్షన్లలో దూసుకుపోతోంది. ఇప్పటికే తమిళ నాడులో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘జైలర్’ రికార్డు నెలకొల్పింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
స్ట్రాంగ్‌గా ఉండాలనుకున్నా కానీ - వెక్కివెక్కి ఏడ్చిన అనసూయ
రంగుల ప్రపంచంలో మహిళలపై విమర్శలు చేసే వ్యక్తులు సమాజంలో ఉన్నారు. ఆ విమర్శలను స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ సైతం ఎదుర్కొన్నారు. అయితే... విమర్శలకు ధీటుగా బదులు ఇవ్వడం ఆమె స్టైల్. అటువంటి అనసూయ కన్నీళ్లు పెట్టుకోవడం సంచలనమైంది. 'ఫైర్ బ్రాండ్' పదానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లు కనిపించే అనసూయ వెక్కి వెక్కి ఏడ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో స్వయంగా ఆమె పోస్ట్ చేశారు. దాంతో పాటు నెటిజనులకు భారీ లేఖ కూడా రాశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
అత్తారింట అల్లు అర్జున్‌కు గ్రాండ్ వెల్కమ్ - మామగారి ఫంక్షన్ హాల్ ఓపెనింగ్‌లో...
'తగ్గేదే లే' - 'పుష్ప' సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) చెప్పిన డైలాగ్ ఇది. ఇవాళ నల్గొండలో ఆయన్ను చూడటానికి వచ్చిన ప్రజలను చూస్తే... 'పబ్లిక్ లో ఆయన క్రేజ్ తగ్గేదే లే' అని చెప్పాలేమో!? ఆ స్థాయిలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి స్వస్థలం నల్గొండ. బన్నీ మామ, స్నేహ తండ్రి కంచర్ల చంద్రశేఖర్ ఒక ఫంక్షన్ హాల్ కట్టారు. ఆ హాల్ ప్రారంభోత్సవం కోసం హైదరాబాద్ నుంచి నల్గొండ జిల్లాలోని పెద్దవూర మండలంలోని బట్టు గూడెం వెళ్లారు బన్నీ. ఆయనకు అక్కడి ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
రజనీ సినిమాలో బిగ్ బీ - 3 దశాబ్దాల తర్వాత మళ్లీ కలుస్తున్న లెజెండరీ యాక్టర్స్
‘జైలర్’ సినిమా తర్వాత రజనీకాంత్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘జై భీమ్’తో అద్భుత విజయాన్ని అందుకున్న జ్ఞానవేల్, ‘జైలర్’తో బ్లాక్ బస్టర్ అందుకున్న రజనీ కాంబోలో తెరకెక్కబోయే ఈ పాన్ ఇండియా చిత్రంపై ప్రేక్షకులలో ఓ రేంజిలో అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం #Thalaivar170 అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకోబోతోంది. ఈ నెలలోనే మూవీ షూటింగ్ మొదలుకానున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రను చేయబోతున్నారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత రజనీకాంత్, అమితాబ్‌బచ్చన్ కలిసి ఈ సినిమాలో నటించబోతున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ఫ్యాన్ కి షర్ట్ గిఫ్ట్ గా పంపిన మిస్టర్ పోలిశెట్టి!
ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి సక్సెస్ అయిన వారిలో టాలెంటెడ్ యాక్టర్ నవీన్ పోలిశెట్టి ఒకరు. కెరీర్ స్టార్టింగ్ లో కొన్ని సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ లో నటించిన నవీన్.. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' మూవీతో హీరోగా మారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం యంగ్ హీరో నటిస్తున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు తన అభిమాని అడిగాడని ఒక షర్ట్ ని గిఫ్ట్ గా పంపించి నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు నవీన్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Hebah Patel: ఆ ప్రశ్నకు హెబ్బా పటేల్ ఆగ్రహం - ఇంటర్వ్యూ మధ్యలోనే వాకౌట్
Month of Madhu: కథ వినకుండానే ఈ సినిమా చేశాను, కనీసం డైలాగ్స్ కూడా ముందు చెప్పలేదు: నవీన్ చంద్ర!
Rashmika - Gam Gam Ganesha Song : 'గం గం గణేశా'లో సాంగ్ విడుదల చేసిన రష్మిక - 'ప్రేమిస్తున్నా' కంటే పెద్ద హిట్ కావాలి ఆనందా
AR Rahman: ఏఆర్ రెహమాన్‌కు ఆగ్రహం, సర్జన్స్ అసోసియేషన్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా
రణ్ బీర్, సాయి పల్లవి, యశ్ కాంబోలో 'రామాయణం' - 2024లో షూటింగ్ స్టార్ట్
Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం
APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్ సర్వీసులు - ఈ నగరాల నుంచే
Minister KTR: పంప్ హౌస్ వల్ల నిర్మల్ వాసుల కల సాకారమైంది, మంత్రి కేటీఆర్
'డుంకీ', 'సలార్'లో దేన్ని ఎంచుకుంటారు? 'మాస్టర్' బ్యూటీ డేరింగ్ ఆన్సర్!
/body>