Jailer Box Office Collection: బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ‘జైలర్’, రూ. 500 కోట్లు వసూళ్ళు!
సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఆగష్టు 10న విడుదలైన ఈ మూవీ రూ. 500 కోట్లకు చేరువైంది. తమిళనాట అత్యధిక వసూళ్లు నమోదు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ థియేటర్లలో దుమ్మురేపుతోంది. తొలి షో నుంచి మొదలుకొని ఇప్పటి వరకు సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు. తమిళనాట ఇప్పటీ థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులు పెట్టుకుంటున్నాయి. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తొలి రోజు నుంచి కలెక్షన్లలో దూసుకుపోతోంది. ఇప్పటికే తమిళ నాడులో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘జైలర్’ రికార్డు నెలకొల్పింది.
బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం
హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఆగష్టు 10న ఈ సినిమా విడుదల అయ్యింది. తొలి రోజు ఈ మూవీ రూ.48.35 కోట్లు సాధించింది. సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. రజనీకాంత్ నటించిన ఈ చిత్రం ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా రూ. 500 కోట్ల మార్కును దాటుతుందన ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ట్రేడ్ వెబ్‌సైట్ సక్‌నిల్క్ ప్రకారం, జైలర్ తొమ్మిదో రోజు రూ. 9 కోట్లు వసూళ్లు రాబట్టింది. తమిళ ఆక్యుపెన్సీ 34.53 శాతంగా ఉంది. ఇప్పటి వరకు ఇండియా నెట్ కలెక్షన్స్ 244.85 కోట్లుగా ఉంది. ఈ సినిమా తొలి వారంలో రూ. 235.85 కోట్లు రాబట్టగలిగింది. తమిళంలో రూ. 184.65 కోట్లు, తెలుగులో రూ. 47.05 కోట్లు, కన్నడలో రూ. 2.05 కోట్లు, హిందీలో రూ. 2.1 కోట్లు వసూళు అయ్యాయి.
రూ. 500 కోట్లు దాటే అవకాశం!
ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ ప్రకారం, “ఈ చిత్రం ఇవాళ(శనివారం) ప్రపంచ వ్యాప్తంగా రూ. 500 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. ‘జైలర్’ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ తొలి వారంలో రూ. 450.80 కోట్లు రాగా, రెండోవారంలో తొలి రోజు రూ. 19.37 కోట్లు సాధించింది. రెండో రోజు రూ. 17.22 కోట్లు వసూళు చేసింది. మొత్తం కలెక్షన్ రూ. 487.39 కోట్లు. ఇవాళ రూ. 500 కోట్లు దాటే అవకాశం ఉంది” అని ట్వీట్ చేసాడు.
#Jailer WW Box Office
— Manobala Vijayabalan (@ManobalaV) August 19, 2023
Week 1 - ₹ 450.80 cr
Week 2
Day 1 - ₹ 19.37 cr
Day 2 - ₹ 17.22 cr
Total - ₹ 487.39 cr
All set to BREACH ₹5⃣0⃣0⃣ cr today.
||#Rajinikanth | #ShivarajKumar | #Mohanlal|| pic.twitter.com/0bFt5bAktr
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఆగష్టు 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఇందులో తమన్నా, జాకీష్రాఫ్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, సునీల్, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ మరో కీలక పాత్రలో నటించింది. చాలా కాలం తర్వాత రజనీకాంత్ సినిమాలో రమ్యకృష్ణ నటించడం బాగా కలిసి వచ్చింది. అనిరుధ్ సంగీతం అందరినీ ఆకట్టుకుంది. తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ లభించింది.
Read Also: రజనీ సినిమాలో బిగ్ బీ - 3 దశాబ్దాల తర్వాత మళ్లీ కలుస్తున్న లెజెండరీ యాక్టర్స్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial