Naveen Polishetty: ఫ్యాన్ కి షర్ట్ గిఫ్ట్ గా పంపిన మిస్టర్ పోలిశెట్టి!
'జాతి రత్నాలు' తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నవీన్ పోలిశెట్టి.. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో అలరించడానికి సిద్దమవుతున్నాడు. తన ఫ్యాన్ అడిగాడని షర్ట్ ను బహుమతిగా పంపించాడు.
ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి సక్సెస్ అయిన వారిలో టాలెంటెడ్ యాక్టర్ నవీన్ పోలిశెట్టి ఒకరు. కెరీర్ స్టార్టింగ్ లో కొన్ని సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ లో నటించిన నవీన్.. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' మూవీతో హీరోగా మారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం యంగ్ హీరో నటిస్తున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు తన అభిమాని అడిగాడని ఒక షర్ట్ ని గిఫ్ట్ గా పంపించి నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు నవీన్.
'జాతి రత్నాలు' సినిమా విజయం తర్వాత నవీన్ పోలిశెట్టి క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరిపోయిందనే సంగతి ప్రత్యేకంగ చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లోని బడా నిర్మాణ సంస్థలు అతనితో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. మరోవైపు యూత్ లో అతనికున్న ఫాలోయింగ్ చూసి పలు కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విల్స్ అనే ఫ్యాషన్ బ్రాండ్ నవీన్ ను ప్రచారకర్తగా నియమించుకుంది. ఈ విషయాన్ని నటుడు ఇటీవల ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
పోలిశెట్టి నవీన్ ట్వీట్ చేస్తూ.. ''భారతదేశంలోని ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్‌లలో ఒకటైన ట్విల్స్ లో వారి బ్రాండ్ అంబాసిడర్‌గా చేరడానికి చాలా సంతోషిస్తున్నాను. 'ట్విల్స్ X నవీన్ పోలిశెట్టి' కలెక్షన్ ఇప్పుడు వారి అన్ని స్టోర్‌లలో అందుబాటులో ఉంటుందని చెప్పడానికి ఆనందంగా ఉంది. కాబట్టి, ఇప్పుడే షాపింగ్ చేయడానికి మీ సమీపంలోని ట్విల్స్ స్టోర్‌కి వెళ్లండి'' అని పేర్కొన్నారు. మీరు కూడా నాలాగే మీకు నచ్చిన విధంగా దుస్తులు ధరించండి అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసాడు.
నవీన్ ట్వీట్ కి ఓ అభిమాని స్పందిస్తూ, 'మీరు వేసుకున్న షర్ట్ నాకు బాగా నచ్చింది.. అది గిఫ్ట్ గా ఇవ్వొచ్చుగా అన్నా. అది ఎక్కడ దొరుకుంటుందో లింక్ అయినా ఇవ్వన్నా' అని నవీన్ ను కోరాడు. దీనికి యువ హీరో రియాక్ట్ అవుతూ చొక్కా పంపిస్తాను, కాంటాక్ట్ డీటెయిల్స్ సెండ్ చేయమని అన్నాడు. అయితే చెప్పినట్లుగానే తన ఫ్యాన్ కి షర్ట్ ను బహుమతిగా పంపించారు. దీంతో ఖుషీ అయిన అతను తన ఫేవరేట్ హీరోకి థ్యాంక్స్ చెబుతూ, ఈ విషయాన్ని ట్విట్టర్ లో పంచుకున్నాడు. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా చాలా పెద్ద అవ్వాలని కోరుకున్నట్లు చెప్పాడు. నవీన్ పోలిశెట్టి దీనికి స్పందిస్తూ 'యూ ఆర్ వెల్ కమ్' అని రిప్లై ఇచ్చారు.
Your welcome ❤️ love always ❤️ https://t.co/290HAWAMZV
— Naveen Polishetty (@NaveenPolishety) August 18, 2023
సాధారణంగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వారి ఫేవరేట్ హీరోలను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతూ, తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. ఎవరో ఒకరిద్దరు తప్పితే హీరోలు పెద్దగా వాటికి రియాక్ట్ అవ్వరు. కానీ ఇప్పుడు నవీన్ పోలిశెట్టి అభిమాని ట్వీట్ కు స్పందించడమే కాదు, గిఫ్ట్ కూడా పంపించాడు. ఆయన ఇచ్చిన బహుమతి చిన్నదే అయ్యుండొచ్చు కానీ, ఒక ఫ్యాన్ కు అది పెద్దదే అని నెటిజన్లు యువ హీరోని కొనియాడుతున్నారు.
ఇదిలా ఉంటే 'జాతిరత్నాలు' తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నవీన్ పోలిశెట్టి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ అనుష్కతో 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాతో వస్తున్నాడు. మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 2023 సెప్టెంబర్ 7న విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే సితార ఎంటర్టైన్మెంట్స్ - ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్ బ్యానర్స్ లో 'అనగనగా ఒక రాజు' అనే సినిమాలో నటిస్తున్నాడు నవీన్. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.
Also Read: స్వాతంత్య్ర సమరయోధుడి బయోపిక్ తీసి ఆసుపత్రి పాలైన సినీ నిర్మాత
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial