By: ABP Desam | Updated at : 03 May 2023 05:25 PM (IST)
Representational Image/Pixabay
ప్రముఖ తమిళ నటుడు, కమెడియన్ మనోబాల కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కాలేయ సమస్యతో బాధపడుతున్న ఆయన బుధవారం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. దీంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. మనోబాల మృతి అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగులో ఆయన చివరిగా.. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో నటించారు. అందులో జడ్జి పాత్రలో కనిపించారు. అంతకు ముందు ఆయన ‘మహానటి’ సినిమాలో దర్శకుడు పి.పులయ్య పాత్రలో నటించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ఉంటున్నది తమిళనాడులో! ఆయన ఓటు హక్కు ఉన్నది కూడా తమిళనాడులో! అయితే, గత కొన్ని రోజులుగా ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారుమోగుతోంది. అందుకు కారణం ఏమిటి? అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శక పురుషుడు ఎన్టీ రామారావు (NT Rama Rao) శత జయంతి (NTR 100th Birth Anniversary Celebrations) ఉత్సవాలలో పాల్గొనడం, ఆ వేదిక మీద చంద్రబాబు మీద పొగడ్తల వర్షం కురిపించడమే ఆయన చేసిన పాపం అయ్యింది. తాజాగా దీనిపై జగపతిబాబు కూడా స్పందించారు. రజినీకాంత్‌కు సపోర్ట్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
హీరో విక్రమ్‌కు ప్రమాదం జరిగింది. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘తంగళన్’ మూవీ షూటింగ్‌లో ఆయన ప్రమాదవశాత్తు పై నుంచి కిందపడ్డారని, దీంతో ఆయన పక్కటెముకులు విరిగాయని తెలిసింది. ప్రమాదం వార్త తెలియగానే షూటింగ్ సిబ్బంది హుటాహుటిన ఆయన్ను హాస్పిటల్‌కు తరలించారు. విక్రమ్ ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విక్రమ్ ఇటీవలే ‘పొన్నియెన్ సెల్వన్’ మూవీ సీరిస్‌తో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ప్రమోషన్స్ పూర్తి కావడంతో ఆయన కొద్ది రోజుల కిందటే తిరిగి షూటింగ్స్‌లో బిజీ అయ్యారు. ఇంతలోనే ఇలా జరగడంతో చియాన్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్ లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. వరుణ్ ధావన్ తో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకుంటోంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ దర్శకులు రాజ్, డీకే ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్ షూటింగ్ లండన్ లో కొనసాగుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
పాన్ ఇండియా సెన్సేషన్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కథానాయకుడిగా ఈ రోజు (మే 3, బుధవారం) కొత్త సినిమా పూజా కార్యకమ్రాలతో మొదలైంది. హీరోగా విజయ్ దేవరకొండ 12వ చిత్రమిది (VD 12 Movie). (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!
ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి
రామ్ చరణ్ సినిమా కోసం 'RRR' ఫార్ములాను ఫాలో అవుతున్న బుచ్చిబాబు!
వివాదంలో ‘2018’ మూవీ - జూన్ 7 నుంచి థియేటర్స్ బంద్, ఎందుకంటే..
Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్ క్యాలెండర్ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!
Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక
Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!
Kakinada MP Vanga Geetha: వైసీపీ ఎంపీ వంగా గీత నుంచి ప్రాణహాని! స్పందనలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఆడపడుచు