అన్వేషించండి

సల్మాన్ తండ్రవుతాడట, రాజమౌళి 14 ఏళ్ల బాధ, తగ్గేదేలే అంటున్న అఖిల్ - ఈ రోజు సినీ విశేషాలివే!

పెళ్లి చేసుకోకుండా సల్మాన్‌కు తండ్రి కావాలని ఉందట, రాజమౌళి బాధేంటీ? అఖిల్ మరో భారీ బడ్జెట్ మూవీతో తగ్గదేలే అంటున్నాడు. ‘విరూపాక్ష’కు టైమ్ బాగుంది. ఇంకా విశేషాలెన్నో.

అఖిల్ అక్కినేని నెక్స్ట్ సినిమాకూ భారీ బడ్జెట్ - 'ఏజెంట్' తర్వాత యువితో ఫిక్స్?

కథానాయకుడిగా అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ఇప్పటి వరకు చేసిన చిత్రాలు ఐదు! అందులో భారీ డిజాస్టర్లు ఉన్నాయి! నటుడిగా ఆయనకు పేరు తీసుకొచ్చినవి ఉన్నాయి! క్యారెక్టర్స్ కోసం ఆయన శారీరకంగా కష్టపడినవీ ఉన్నాయి! అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్... 'ఏజెంట్'! అయితే... అఖిల్ ఆశించిన విజయాలు, హీరో గా ఇమేజ్ వచ్చాయా? అంటే చెప్పడం కష్టమే! 'ఏజెంట్' కోసం ఆయన పడిన కష్టం అంతా వృథా అయ్యిందని చాలా మంది చెబుతున్న మాట! ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా ఎవరితో? అనే ప్రశ్న మొదలైంది. దానికి సమాధానం లభించినట్టే! (పూర్తి వివరాలను ఇక్కడ చూడండి).

14 ఏళ్ల బాధను బయటపెట్టిన రాజమౌళి, ఇది మగధీర నాటి సంగతి!

ఇప్పుడు మన దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) స్థాయి దేశపు ఎల్లలు దాటింది. అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులకూ జక్కన్న తెలుసు. 'నాటు నాటు...' పాటకు ఆస్కార్ రావడం, హాలీవుడ్ ప్రముఖులతో పాటు వెస్ట్రన్ ఆడియన్స్ 'ఆర్ఆర్ఆర్' సినిమాను మెచ్చుకోవడంతో రాజమౌళి స్టార్ డమ్ పెరిగింది. బహుశా... అందుకేనేమో? ఆయన ముందు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఓ ప్రపోజల్ ఉంచారు. రిక్వెస్ట్ చేశారు. (పూర్తి వివరాలను ఇక్కడ చూడండి).

తండ్రిని కావాలని ఉంది - కానీ, మన చట్టాలు అందుకు ఒప్పుకోవు: సల్మాన్ ఖాన్

బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు సల్మాన్ ఖాన్. కండల వీరుడు సల్లూ భాయ్ 57 ఏళ్ల వయసు దాటినా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. ఇంకా సింగిల్ గానే జీవితం గడుపుతున్నాడు. అయితే ఇప్పుడు తనకు తండ్రి కావాలనే ఆలోచన ఉన్నట్లు నటుడు వెల్లడించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ మాట్లాడుతూ.. తాను ఒకప్పుడు బిడ్డను కనాలని అనుకున్నానని, కానీ భారతదేశంలోని చట్టాల కారణంగా అలా చేయలేకపోయానని చెప్పాడు. అలానే పెళ్లి ప్లాన్స్ గురించి కూడా మాట్లాడాడు. (పూర్తి వివరాలను ఇక్కడ చూడండి).

కమల్ హాసన్‌కు భారీ హిట్టిచ్చిన దర్శకుడితో రజనీ సినిమా!?

ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) పేరు రెండు మూడు రోజులుగా చాలా గట్టిగా వినబడుతోంది. కొత్తగా తమిళనాట కూడా ఆయన పేరు వినబడుతుంది. అయితే, రాజకీయాల్లో కాదు... సినిమాల్లో! ఆయన కొత్త సినిమా గురించి క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఇప్పుడు విజయ్ హీరోగా 'లియో' చేస్తున్నారు లోకేష్ కనగరాజ్. దాని తర్వాత ఏం చేస్తారు? ఎవరితో సినిమా చేస్తారు? అంటే చెప్పడం కష్టమే. అంటే... లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) పేరుతో వెండితెరపై పెద్ద ప్రపంచాన్ని క్రియేట్ చేయడానికి ఆయన రెడీ అయ్యారు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పదేళ్ల వరకు లోకేష్ కనగరాజ్ సినిమాలు ప్లాన్ చేసుకున్నాడని కమల్ హాసన్ పేర్కొన్నారు. ఆ సినిమాల్లో రజనీకాంత్ సినిమా కూడా ఉందని సమాచారం. (పూర్తి వివరాలను ఇక్కడ చూడండి).

ఏజెంట్, PS2 కంటే 'విరూపాక్ష'కు ఎక్కువ - ఆ ఫ్లాపులే కలిసొచ్చాయ్!  

'విరూపాక్ష'కు మొదటి రోజు, మొదటి ఆట నుంచి హిట్ వచ్చింది. బాక్సాఫీస్ బరిలో మంచి వసూళ్ళు కూడా వస్తున్నాయి. ఈ శుక్రవారం విడుదలైన సినిమాల ప్రభావం ఎంతో కొంత ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అయితే, అనూహ్యంగా థియేటర్లలోకి వచ్చిన కొత్త సినిమాలు రెండూ ఘోరంగా బోల్తా కొట్టడంతో సాయి ధరమ్ తేజ్ సినిమాకు మరో వారం లైఫ్ వచ్చినట్టు అయ్యింది. (పూర్తి వివరాలను ఇక్కడ చూడండి).

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Steve Smith Records: అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
AP Weather Updates: ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Steve Smith Records: అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
AP Weather Updates: ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Venkatesh: వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
Embed widget