News
News
X

Tollywood Drugs Case: ఈడీ ముందుకు నటి చార్మి.. కెల్విన్ ఆధారాలతో విచారణ మొదలుపెట్టిన అధికారులు

టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా నటి చార్మీ గురువారం ఈడీ ముందుకు హాజరయ్యారు.

FOLLOW US: 
Share:

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో నటి చార్మీ గురువారం (సెప్టెంబరు 2) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు హాజరైంది. ఆమె ఈడీ కార్యాలయానికి చేరుకోగానే మీడియా చుట్టుముట్టింది. దీంతో కాసేపు అసహనానికి గురైంది. తనకు కోవిడ్ అంటే భయమని, దయచేసి దూరంగా జరగండని కోరింది. అయితే, చార్మి భౌన్సర్లు మీడియా ప్రతినిధులను పక్కకు నెట్టేస్తూ ఆమెను లోపలికి తీసుకెళ్లారు.

ఈడీ అధికారులు చార్మీని విచారించడం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఆమెను పలు ప్రశ్నలు అడుగుతున్నారు. ఆమె వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల వివరాలతోపాటు ప్రొడక్షన్ హౌస్ నుంచి జరిగిన లావాదేవీలను కూడా ఈడీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కెల్విన్ చెప్పిన వివరాల ప్రకారం దాదా అనే అకౌంట్‌కు నగదు లావాదేవీలు జరుగుతున్నట్లు ఈడీకి సమాచారం అందినట్లు  తెలిసింది.

చార్మీ ప్రస్తుతం నటనకు స్వస్తి పలికి దర్శకుడు పూరీ జగన్నాథ్ కలిసి ‘పూరీ కనెక్ట్స్’ బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తోంది. ఈ సంస్థకు ఆమె సహ వ్యవస్థాపకురాలిగా వ్యవహరిస్తోంది. కొద్ది రోజుల కిందట ఈడీ పూరి జగన్నాథ్‌‌ బ్యాంకు ఖాతాల  వివరాలను ఈడీ అధికారులు తీసుకున్నారు. దాదాపు 10 గంటల సేపు పూరిని విచారించారు. అయితే డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న కెల్విన్‌ ఈడీ అధికారుల ముందు లొంగిపోయిన నేపథ్యంలో ఈ కేసు టాలీవుడ్‌ను మరింత టెన్షన్ పెట్టిస్తోంది. కెల్విన్ అప్రూవర్‌గా మారిపోవడంతో ఏయే విషయాలు బయటకొస్తాయా అనే ఆందోళనలో సినీ ప్రముఖులు ఉన్నారు. ఈ నెల 6న నటి రకుల్ ప్రీత్ సింగ్‌ను కూడా ఈడీ విచారించనుంది. 

టాలీవుడ్‌‌లో కలకలం రేపిన డ్రగ్స్ కేసుపై మంగళవారం (ఆగస్టు 31) నుంచి మళ్లీ విచారణకు వచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ జారీ చేసిన నోటీసుల ప్రకారం దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈడీ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా డ్రగ్స్ కొనుగోలుకు లావాదేవీలు ఎలా జరిగాయనే విషయంపై పూరీని ప్రశ్నించినట్లు తెలిసింది. పూరీ తర్వాత మరికొందరు తారలను కూడా ఈడీ విచారించనుంది. ఈ నెల 22 వరకు 12 మంది సినీ ప్రముఖులు ఈడీ ముందుకు హాజరవుతారు. 

ఇప్పటికే కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు దాఖలైంది. ఈ కేసుకు డ్రగ్స్ వినియోగంతో సంబంధం లేదు. కేవలం వాటిని కొనుగోలు చేయడానికి జరిగిన లావాదేవీలు గురించే విచారణ జరగనుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ సెక్షన్ 3, 4 కింద కేసులు నమోదయ్యాయి. విచారణలో అక్రమ లావాదేవీలు గుర్తిస్తే ఆ మేరకు అదనపు కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. విచారణలో భాగంగా ఈడీ పూరీ జగన్నాథ్ ఆరేళ్ల ట్రాన్సాక్షన్స్ కావాలని కోరింది. ఈ సందర్భంగా పూరీ తన మూడు అకౌంట్లలో 2015 - 2021 మధ్య జరిగిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వివరాలను ఈడీకి అందించినట్లు సమాచారం. ఈ కేసుతో సంబంధం ఉన్న మిగతా సినీ ప్రముఖుల ఖాతాలను కూడా ఈడీ తనిఖీ చేయనుంది. 

మాదక ద్రవ్యాల తరలింపుపై తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు గతంలో మొత్తం 62 మందిని ప్రశ్నించారు. ఇప్పుడు ఈడీ కూడా అందర్నీ ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే పాత నేరస్తుల్ని ప్రశ్నించి వివరాలు రాబట్టారు. మరో వైపు ఈడీ వర్గాలు చాలా సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నట్లుగా సంకేతాలు అందుతున్నాయి. డ్రగ్స్ ఎలా తెప్పించేవారు..?  డబ్బులు ఎలా చెల్లించారు..? అన్న వాటిపై పూర్తి సమాచారం ఈడీ అధికారులు సేకరించారని.. ఆ ఆధారల ప్రకారమే సినీ ప్రముఖులను ప్రశ్నించనున్నట్లుగా తెలుస్తోంది. 

డ్రగ్స్ కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలన్నీ హవాలా మార్గంలో జరిగినట్లుగా భావిస్తున్నారు. అలాగే నేరం చేసినట్లుగా నిరూపితమైతే ఆస్తులు జప్తు చేస్తే అవకాశం ఉంది. పబ్ నిర్వహించే ఓ సినీ ప్రముఖుడు పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను తెప్పించి సినీ వర్గాలకు సరఫరా చేసినట్లు తెలిసింది. దీంతో అతడి ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. డ్రగ్స్ కేసు మళ్లీ తెరుచుకోవడంతో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈడీ కేసు పరోక్షంగా తెలంగాణ ఎక్సైజ్ పోలీసుల విచారణకు కూడా పరోక్షంగా సహాయపడనుంది. ప్రస్తుతం వారికి ఎలాంటి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని చార్జిషీట్‌లో పోలీసులు పేర్లు పెట్టలేదు. ఈడీ విచారణ తర్వాత చార్జిషిట్లను సవరిస్తూ పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందనే భయం వారిని వెంటాడుతోంది. ఇప్పుడు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా ఈడీ తేల్చితే వారిపై ఎక్సైజ్ శాఖ కూడా కొత్తగా చర్యలు తీసుకోక తప్పదు. దీంతో టాలీవుడ్ స్టార్ల పరిస్థితి దయనీయంగా మారుతుంది. రెండు రకాలుగా ఇరుక్కొనే పరిస్థితి నెలకొంటుంది. మున్ముందు ఈ కేసు మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.  

Published at : 02 Sep 2021 10:42 AM (IST) Tags: ED tollywood drugs case puri jagannath DRUGS MONEY LAUNDARING PURI DRUGS CASE STARS టాలీవుడ్ డ్రగ్స్ కేసు పూరీ జగన్నాథ్ Charmi Kaur Charmi Kaur ED Charmme Kaur

సంబంధిత కథనాలు

Adipurush Update : వైష్ణో దేవి ఆశీస్సులు తీసుకున్న 'ఆదిపురుష్' దర్శక, నిర్మాతలు - ప్రభాస్ సినిమాకు నయా ప్లాన్

Adipurush Update : వైష్ణో దేవి ఆశీస్సులు తీసుకున్న 'ఆదిపురుష్' దర్శక, నిర్మాతలు - ప్రభాస్ సినిమాకు నయా ప్లాన్

Upasana Baby Bump : ఉపాసన బేబీ బంప్ అదిగో - ఇంకా ఎనీ డౌట్స్?

Upasana Baby Bump : ఉపాసన బేబీ బంప్ అదిగో - ఇంకా ఎనీ డౌట్స్?

Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా 

Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా 

Janaki Kalaganaledu March 28th: ఒక్కటైన రామ, జానకి- సంతోషంలో జ్ఞానంబ, అనుమానించిన మల్లిక

Janaki Kalaganaledu March 28th: ఒక్కటైన రామ, జానకి- సంతోషంలో జ్ఞానంబ, అనుమానించిన మల్లిక

డేటింగ్‌పై నెటిజన్ వింత ప్రశ్న, తన స్టైల్ లో రిప్లై ఇచ్చిన సమంత

డేటింగ్‌పై నెటిజన్ వింత ప్రశ్న, తన స్టైల్ లో రిప్లై ఇచ్చిన సమంత

టాప్ స్టోరీస్

Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్‌కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్

Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్‌కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్

Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్

Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!

Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!

Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!