చీర కట్టుకుంటా, బీచ్‌లో బికినీ వేసుకుంటా - ట్రోలర్స్‌కు పూనమ్ కౌర్ దిమ్మతిరిగే ఆన్సర్!
అందాల తార పూనమ్ కౌర్ మరోసారి దిమ్మతిరిగే ట్వీట్ చేసింది.. ఆడవారి వస్త్రధారణ గురించి మాట్లాడే వారికి గట్టి వార్నింగ్ ఇచ్చింది.. అత్యాచారాలు జరిగిన మహిళల్లో చాలా మంది నిండైన దుస్తులు ధరించిన వారేనని..
పూనమ్ కౌర్... తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అవసరం లేని నటీమణి. తెలుగు, తమిళం, మలయాళం సినిమా పరిశ్రమల్లో పలు సినిమాలు చేసినా.. పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘మాయాజాలం’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో అడుగు పెట్టిన పూనమ్.. ‘ఒక విచిత్రం’, ‘నిక్కి అండ్ నీరజ్’ సహా పలు సినిమాలు చేసింది. ఏ సినిమా ఆమెకు కలిసి రాలేదు. రానురాను.. ఆమె సినిమాలతో కంటే పలు వివాదాలకు కేంద్రంగా మారి.. పాపులారిటీ సంపాదించుకుంది.
సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన ట్వీట్స్ పెను దుమారాన్ని రేపిన సందర్బాలు చాలా ఉన్నాయి. ఆమె కామెంట్లు కాసేపట్లోనే నెట్టింట్లో వైరల్ గా మారుతాయి. ఒక్కోసారి వివాదాస్పద ట్వీట్లు చేయడమే కాకుండా.. వాటిని డెలిట్ చేసి కూడా చర్చలకు తెరలేపింది ఈ అమ్మడు. ఆమె చేసిన ట్వీట్లు వివాదం అయ్యాక.. మళ్లీ కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉండటం.. మరో తేనెతుట్టెను కదపడం కామన్ అయ్యింది. గత కొంత కాలంగా సైలెంట్‌గా ఉన్న పూనమ్.. మళ్లీ యాక్టివేట్ అయ్యింది.
ఆడవారి దుస్తులపై మాట్లాడే వారికి క్యూట్ బ్యూటీ పూనమ్ కౌర్ చెంపచెళ్లుమనే సమాధానం చెప్పింది. యువతులు, మహిళలు వేసుకునే దుస్తుల మూలంగానే వారిపై అత్యాచారాలు జరుగుతున్నాయిన చాలా మంది కామెంట్ చేస్తున్న వేళ.. పూనమ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘నేను బురఖా వేసుకుంటా.. చీరకట్టుకుంటా.. బీచ్ లో బికినీ వేసుకుంటా.. మీకు లిమిట్స్ క్రాస్ చేసే హక్కు లేదు. నాకు కంఫర్ట్ గా ఉన్న దుస్తులనే నేను ధరిస్తాను’’ అని చెప్పింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. అత్యాచారాలకు గురైన చాలా మంది మహిళలు నిండైన దుస్తులు ధరించిన వారేనని పూనమ్ చురకలు అంటించింది.
పూనమ్ కౌర్ తాజాగా నటించిన సినిమా ‘నాతిచరామి’. క్రైమ్, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పూనమ్ కౌర్, అరవింద్ కృష్ణ, సందేశ్ బూరి సహా పలువురు నటించారు. నాగు గవర దర్శకత్వం వహించారు. జై వైష్ణవి నిర్మాతగా వ్యవహరించగా.. నవీన్ గణేష్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో పూనమ్ తన అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది.
View this post on Instagram