అన్వేషించండి
Advertisement
South Indian Movie Update: దివాలీకి 'గని', అమెజాన్ తో 'గజిని'..
ఈరోజు (ఆగస్టు 5) టాలీవుడ్ లో కొన్ని హాట్ అప్డేట్స్..
దివాలీ కి 'గని' :
మెగా హీరో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తోన్న చిత్రం 'గని'(Ghani). కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను తాజాగా అనౌన్స్ చేశారు. దీపావళి సందర్భంగా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు వరుణ్ తేజ్ తన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ స్పెషల్ గా బాక్సింగ్ లో శిక్షణ తీసుకున్నాడు. అలానే సినిమాలో యాక్షన్ సన్నివేశాలు యూనిక్ గా ఉండాలని.. విదేశీ స్టంట్ మాస్టర్లను రంగంలోకి దించారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ సయీ మంజ్రేకర్ హీరోగా నటిస్తోంది. అల్లు బాబీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
అమెజాన్ తో సూర్య డీల్ :
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవల 'ఆకాశం నీ హద్దురా' సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అమెజాన్ తో సూర్య ఓ స్పెషల్ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఆయనకు సంబంధించిన మొత్తం నాలుగు సినిమాలు అమెజాన్ లో రాబోతున్నాయి. అందులో మూడు సినిమాలను ఆయన నిర్మించగా.. ఒక సినిమాలో ఆయనే లీడ్ రోల్ పోషించారు. 'జై భీమ్'(JaiBhim) అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సూర్య లాయర్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాను అమెజాన్ లో విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.
రష్మిక విషయంలో పేరెంట్స్ అప్సెట్ :
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక (Rashmika) ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బిజీ ఆర్టిస్ట్ గా మారింది. ప్రస్తుతం తెలుగులో 'పుష్ప', 'ఆడాళ్ళూ మీకు జోహార్లు' వంటి సినిమాల్లో నటిస్తుంది. కరోనా ముప్పు కొనసాగుతుండగా.. ఇలా ఆమె గ్యాప్ లేకుండా షూటింగ్ లలో పాల్గొనడం.. ప్రయాణాలు చేస్తూ అందరినీ కలుస్తుండడంతో రష్మిక తల్లితండ్రులు బాధ పడుతున్నారట. కొంతకాలం షూటింగ్ లకు దూరంగా ఉండాల్సిందంటూ చెప్పారట. కానీ తాను చేస్తున్నవన్నీ పెద్ద సినిమాలు కావడంతో.. షూటింగ్ కి రాలేనని చెప్పలేని పరిస్థితి అని.. అందుకే జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లో పాల్గొంటున్నానని చెప్పుకొచ్చింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
అమరావతి
పాలిటిక్స్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion