Thalapathy67 Title Reveal: రక్తంతో తడిసిపోయిన తలపతి - టైటిల్ అనౌన్స్‌మెంట్ రేపే!
‘తలపతి’ విజయ్, లోకేష్ కనగరాజ్‌ల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా టైటిల్‌ను శుక్రవారం అధికారికంగా ప్రకటించనున్నారు.
Thalapathy 67 Title Reveal: తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay), మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో ‘#Thalapathy67’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు. రేపు (ఫిబ్రవరి 3వ తేదీ) సాయంత్రం ఐదు గంటలకు అధికారికంగా ప్రకటించనున్నారు. ‘విక్రమ్’ తరహాలో ప్రోమో వీడియోను విడుదల చేస్తారా? లేకపోతే పోస్టర్ ద్వారా టైటిల్‌ను ప్రకటిస్తారా? అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.
ఈ టైటిల్ అప్‌డేట్‌కు సంబంధించి ఒక పోస్టర్‌ను చిత్ర బృందం ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. ఇందులో విజయ్ లుక్‌కు సంబంధించిన చిన్న టీజ్ కూడా ఉంది. పూర్తిగా బ్లడ్ ఆర్ట్‌లో గీసిన విజయ్ బొమ్మని పోస్టర్‌లో చూపించారు. దీన్ని బట్టి సినిమా బాగా వయొలెంట్‌గా ఉండనుందని అర్థం చేసుకోవచ్చు. లోకేష్ కనగరాజ్ సినిమాల్లో యాక్షన్, వయొలెన్స్‌కు పెద్ద పీట వేస్తాడు. ఈ సినిమా కూడా అలానే ఉండనుందని అర్థం అవుతుంది.
గత మూడు రోజుల నుంచి ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఇస్తూనే ఉన్నారు. ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా త్రిష నటించనుంది. సంజయ్ దత్, అర్జున్, ప్రియా ఆనంద్, దర్శకులు మిస్కిన్, గౌతమ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్, శాండీ మాస్టర్, మాథ్యూ థామస్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.
మ్యూజికల్ సెన్సేషన్ అనిరుథ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై ఎస్.ఎస్.లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫిలోమోన్ రాజ్ ఎడిటర్ కాగా, అన్బరివు యాక్షన్ కొరియోగ్రాఫర్లుగా వ్యవహరించనున్నారు. ఇక సినిమాటోగ్రాఫర్‌గా మనోజ్ పరమహంసను తీసుకున్నారు.
తమిళంలో విజయ్, త్రిషలది సూపర్ డూపర్ హిట్ జోడీ. సూపర్ స్టార్ మహేష్ బాబు 'ఒక్కడు' తమిళ రీమేక్ ‘గిల్లి’ సహా 'కురివి', 'తిరుప్పాచ్చి', 'ఆతి' సినిమాల్లో వాళ్ళిద్దరూ నటించారు. 14 ఏళ్ళ విరామం తర్వాత ఇప్పుడు మళ్ళీ విజయ్, త్రిష నటిస్తున్నారు.
త్రిష రోల్ అదేనా?
లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) లోనే ఈ సినిమా కూడా సాగనుంది. కార్తీ 'ఖైదీ', కమల్ హాసన్ 'విక్రమ్', సూర్య 'రోలెక్స్' క్యారెక్టర్లు, విజయ్ క్యారెక్టర్ అన్నీ ఈ కథలో భాగమే. డ్రగ్ మాఫియా, గ్యాంగ్‌స్టర్స్ చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో త్రిష పాత్ర ఏమిటి? అని చాలా మందికి సందేహం కలుగుతోంది.
లోకేష్ కనగరాజ్ సినిమాల్లో హీరోయిన్లకు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. 'ఖైదీ'లో అసలు హీరోయినే లేదు. 'విక్రమ్'లో ఫహాద్ ఫాజిల్ జోడీగా ఒక అమ్మాయి ఉన్నారు. ఆమె పాత్ర మధ్యలో ముగిసింది. విలన్స్ చేతిలో మర్డర్ అవుతుంది. 'దళపతి 67'లో త్రిష రోల్ కూడా అదే విధంగా ముగుస్తుందని టాక్. విజయ్ గ్యాంగ్‌స్టర్ కావడానికి ముందు ఆమెతో ప్రేమలో పడతాడని, ఆ పాత్రను మర్డర్ చేయడం ద్వారా మధ్యలో లోకేష్ ముగిస్తాడని చెన్నై టాక్. ఇందులో నిజం ఎంత? అనేది త్వరలో తెలుస్తుంది.
Naanga summave kaatu kaatunu kaatuvom.. 😉#Thalapathy67 TITLE is loading ■■■■■■■□□□ 67%
— Seven Screen Studio (@7screenstudio) February 2, 2023
Revealing at 5 PM Tomorrow 🔥#Thalapathy @actorvijay sir @Dir_Lokesh @trishtrashers @anirudhofficial @Jagadishbliss#Thalapathy67TitleReveal pic.twitter.com/FU61rBU55g