అన్వేషించండి

Leo Movie: ‘లియో’ను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయడం విజయ్‌కు ఇష్టం లేదా? చివరికి ఎలా అంగీకరించారు?

స్టార్ హీరో విజయ్ దళపతి, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో 'లియో' చిత్రం తెరకెక్కుతోంది. పాన్ ఇండియన్ మూవీగా ఈ చిత్రం రూపొందుతోంది.

తమిళ నాట అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో విజయ్ ఒకరు. ఆయన నటించిన 'వారసుడు' సినిమా రీసెంట్ గా పలు భాషల్లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ స్టార్ హీరో సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో 'లియో' చిత్రంలో నటిస్తున్నారు. విజయ్, కనగరాజ్ కలిసి గతంలో ‘మాస్టర్’ అనే సినిమా చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం ‘లియో’ మూవీతో మరోసారి కలిసి పని చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించి షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lokesh Kanagaraj (@lokesh.kanagaraj)

‘లియో’ విషయంలో మనసు మార్చుకున్న విజయ్

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. వాస్తవానికి ‘లియో’ మూవీ పాన్ ఇండియన్ చిత్రంగా తెరకెక్కించడం విజయ్ కి ఇష్టం లేదట.  'లియో' సినిమా తమిళ ప్రేక్షకులకు నచ్చితే చాలని ఆయన కోరుకున్నారట. అయితే, నిర్మాతలు ఆయనను కొద్ది రోజుల పాటు ఒప్పించడంతో మనసు మార్చుకున్నారట. తాజాగా ఈ విషయాన్ని ‘లియో’ నిర్మాత లలిత్ కుమార్ వెల్లడించారు.  ‘‘లియో.. సినిమా పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కడం విజయ్ కి ఇష్టం లేదు. తమిళ ప్రేక్షకులను సంతృప్తి పరిస్తే చాలు అని చెప్పారు. అయితే, నిర్మాతలం (లలిత్, జగదీష్) ఆయనను కష్టపడి ఒప్పించడంతో మనసు మార్చుకున్నారు. సినిమా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కావడానికి ఒరిజినల్ కథలో కొన్ని మార్పులు కూడా చేశారు” అని ఆయన వెల్లడించారు.

అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా ‘లియో’ విడుదల

ఇక ‘లియో’  చిత్రాన్ని ప్రముఖ సెవెన్ స్కీన్స్ బ్యానర్ పై నిర్మాతలు ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళానిసామి రూ.200 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. ‘ఖైదీ’,‘విక్రమ్’ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజు... ఇప్పటికే విజయ్ తో ‘మాస్టర్’ తెరకెక్కించి హిట్ అందుకున్నారు. దీంతో ‘లియో’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రూ.400కు పైగా జరిగిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష నటిస్తుండగా, సంజయ్ దత్, అర్జున్, ప్రియా ఆనంద్, మైస్కిన్, గౌతమ్ వసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్, మనోబాలా వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం సమకూరుస్తున్నారు. 2023 అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా 'లియో' రిలీజ్ కాబోతుండడంతో విజయ్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. 

Read Also: చిరంజీవి, బాలయ్య రికార్డులను వెనక్కి నెట్టిన అఖిల్, ఆ విషయంలో అయ్యగారే నెంబర్ వన్!

టాప్ హెడ్ లైన్స్

Jabardasth Varsha: బుల్లితెర గ్లామర్ క్వీన్.. జబర్దస్త్ వర్ష రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
బుల్లితెర గ్లామర్ క్వీన్.. జబర్దస్త్ వర్ష రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Illu Illalu Pillalu Serial Today August 14th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అయ్యో ముగ్ధ కొంప ముంచేశావే! ప్రేమ ముందే హగ్‌లు ముద్దులు!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అయ్యో ముగ్ధ కొంప ముంచేశావే! ప్రేమ ముందే హగ్‌లు ముద్దులు!
Gundeninda Gudigantalu August 14th:ముగ్గురు మనవళ్లపై బామ్మపెట్టిన బాధ్యత ఏంటి..?రోహిణికి ప్రభావతి వేసిన శిక్ష ఏంటి..?
గుండెనిండా గుడిగంటలు:ముగ్గురు మనవళ్లపై బామ్మపెట్టిన బాధ్యత ఏంటి..?రోహిణికి ప్రభావతి వేసిన శిక్ష ఏంటి..?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
YS Jagan Kurnool Tour: జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
Embed widget