By: ABP Desam | Updated at : 31 Jan 2023 07:21 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@7screenstudio/twitter
‘వారిసు’ బ్లాక్ బస్టర్ హిట్ తో తమిళ స్టార్ హీరో విజయ్ ఫుల్ జోష్ లో ఉండగా, ‘విక్రమ్’ సక్సెస్ తో దర్శకుడు లోకేష్ కనగరాజ్ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో ఓ సినిమా రూపొందుతోంది. దానికి ‘దళపతి 67’ అనే వర్కింగ్ టైటిలం ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా చిత్ర బృందం కీలక విషయాలను వెల్లడించింది. ఈ సినిమాలో బాలీవుడ్ టాప్ హీరో సంజయ్ దత్ నటించనున్నట్లు ప్రకటించింది. హీరోయిన్ గా త్రిష, కీలక పాత్రలో అర్జున్ ఫిక్స్ అయినట్లు తెలిపింది.
We feel esteemed to welcome @duttsanjay sir to Tamil Cinema and we are happy to announce that he is a part of #Thalapathy67 ❤️#Thalapathy67Cast #Thalapathy @actorvijay sir @Dir_Lokesh @Jagadishbliss pic.twitter.com/EcCtLMBgJj
— Seven Screen Studio (@7screenstudio) January 31, 2023
‘మాస్టర్’ మూవీతో హీరో విజయ్, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తమిళంతో పాటు తెలుగులో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు ఇద్దరికి మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‌లో ‘దళపతి 67’ రూపొందుతోంది. ఈ సినిమాను 7 స్క్రీన్ స్టూడియో నిర్మిస్తున్నది. ఈ మూవీకి సంబంధించి తాజాగా అధికారిక ప్రకటన చేసింది.
ఈ సినిమాకు సంబంధించి గత కొంతకాలంగా సినీ సర్కిల్స్ లో ఓ వార్త సర్క్యులేట్ అవుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ టాప్ హీరో సంజయ్ దత్ కీలక పాత్ర పోషించ బోతున్నారటనే చర్చ నడిచింది. ఈ వార్తలు వాస్తవమేనని తాజాగా తేలిపోయాయి. ‘దళపతి 67’ సినిమా సంజయ్ దత్ నటించబోతున్నట్లు 7 స్క్రీన్ స్టూడియో వెల్లడించింది. సంజయ్ దత్ తో పాటు ఇతర కీలక పాత్రల నటీనటులను పరిచయం చేసింది. ఈ మూవీలో విజయ్ సరసన త్రిష నటించబోతున్నట్లు వెల్లడించింది. అటు యాక్షన్ హీరో అర్జున్ సైతం ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపింది. మిస్కిన్, జీవీఎమ్, ప్రియా ఆనంద్ సహా పలువురు ఈ చిత్రంలో నటించనున్నట్లు ప్రకటించింది.
ఇక ఈ చిత్రానికి అనురుధ్ రవి చంద్రన్ సంగీతం అందించనున్నారు. ఇప్పటికే విజయ్ తో కలిసి ఆయన మూడు సినిమాలు చేశాడు. 'కత్తి', 'మాస్టర్', 'బీస్ట్' సినిమాలకు అద్భుత సంగీతం అందించాడు. ఈ మూడు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా నాలుగో సినిమాకు కూడా ఆయన సంగీతం అందించబోతున్నారు. ఇక ఈ సినిమాకి మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. యాక్షన్ కోసం అన్బరివ్ పని చేయనున్నారు. ఫిలోమిన్‌రాజ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. దినేశ్ కొరియోగ్రఫీ, డైలాగులు లోకేశ్ కనగరాజ్, రత్నకుమార్, దీరజ్ వైదీ అందించనున్నారు. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కించిన ‘విక్రమ్’ సినిమాతో లోకేశ్ అద్భుత విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో విజయ్ అభిమానులు.. ‘విక్రమ్’ తరహాలో మరో బ్లాక్‌బస్టర్ ఇస్తారనే ఆశతో ఉన్నారు.
లోకేశ్ కనకరాజ్, విజయ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘దళపతి 67’ మూవీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనుంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ రూ.160 కోట్ల ధర చెల్లించినట్లు తెలుస్తోంది. సౌత్ ఇండస్ట్రీలో ఓ సినిమా ఓటీటీ హక్కుల కోసం ఇంత భారీ మొత్తం చెల్లించడం ఇదే తొలిసారి.
Read Also: నన్నూ కమిట్మెంట్ అడిగారు, కాస్టింగ్ కౌచ్ పై నయనతార షాకింగ్ కామెంట్స్
Janaki Kalaganaledu March 23rd: జానకి, రామ హనీమూన్- మనవడిని చూసి మురిసిపోతున్న జ్ఞానంబ
Aditi Rao Hydari-Siddharth: సిద్దార్థ్‌తో రిలేషన్‌పై అదితి రావు ఘాటు స్పందన - అదేంటీ, అలా అనేసింది?
Rashmika Mandanna: ఇంట్లో పని మనుషుల పాదాలకు నమస్కరిస్తా - రష్మిక
NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల
Gruhalakshmi March 23rd: తులసి తన భార్య కాదని వాసుదేవ్‌కి చెప్పేసిన నందు- హీరోలాగా ఫైట్ చేసి దివ్యని కాపాడిన విక్రమ్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా
KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ
New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు
‘సూర్య’కుమార్ కాదు, ‘శూణ్య’కుమార్- 3 డకౌట్లతో మిస్టర్ 360ని ఆటాడుకుంటున్న నెటిజన్లు