అన్వేషించండి

Telugu movies in February 2024: ఫిబ్రవరిలో ఏకంగా 10 సినిమాలు విడుదల, ఆ రెండు వెరీ స్పెషల్!

జనవరి నెలలో పలు సినిమాలు విడుదలై ప్రేక్షకులను బాగా అలరించాయి. ‘హనుమాన్’ మూవీ అన్ని సినిమాలను వెనక్కినెట్టి బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజిలో సత్తా చాటింది. ఫిబ్రవరిలోనూ 10 సినిమాలు విడుదలకాబోతున్నాయి.

Telugu Movies Releasing In February 2024: కొత్త సంవత్సరం(2024)లో తెలుగు సినిమా పరిశ్రమకు మంచి జోష్ వచ్చింది. జనవరిలో పలు సినిమాలు విడుదలై చక్కటి ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. ‘గుంటూరు కారం’, ‘హనుమాన్’, ‘సైంధవ్’, ‘నా సామిరంగ’ లాంటి సినిమాలు ప్రేక్షకులను బాగా అలరించాయి. అయితే, ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన ‘హనుమాన్’ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది. చిన్న సినిమాగా విడుదలై ఏకంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి వారెవ్వా అనిపించింది. ఫిబ్రవరిలోనూ బాక్సాఫీస్ దగ్గర ఫుల్ జోష్ నెలకొనబోతుంది. ఏకంగా 10 సినిమాలు విడుదల కాబోతున్నాయి. వాటిలో రవితేజ ‘ఈగల్’, వరుణ్ తేజ్ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.  

‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’- ఫిబ్రవరి 2న విడుదల

‘కలర్‌ ఫోటో’ ఫేమ్ సుహాస్‌  హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్’. దుశ్యంత్‌ కటికినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మ్యారేజ్ బ్యాండ్ ను నమ్ముకుని జీవితాన్ని గడుపుతున్న ఓ యువకుడి కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. గీతా ఆర్ట్స్‌ 2, మహాయణ మోషన్ పిక్చర్స్‌, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. ఇదే రోజున ‘హ్యాపీ ఎండింగ్’ అనే మరో సినిమా కూడా విడుదల కాబోతోంది.  ఇందులో యష్ పూరి హీరోగా నటిస్తున్నాడు.

‘యాత్ర-2’- ఫిబ్రవరి 8న విడుదల

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర'. ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘యాత్ర-2’ ఫిబ్రవరి 8న విడుదల కానుంది.  ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'యాత్ర 2'ను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని మహి వి రాఘవ్ తెరకెక్కించారు.

‘ఈగల్’- ఫిబ్రవరి 9న విడుదల

రవితేజ హీరోగా, కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఈగల్‌’. అనుపమ పరమేశ్వరన్‌, నవదీప్‌, కావ్య థాపర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా, ఫిలిమ్ ఛాంబర్ విజ్ఞప్తితో ఫిబ్రవరి 9న విడుదలకు రెడీ అవుతోంది.  ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించనున్న ‘లాల్ సలామ్’ సినిమా సైతం అదే రోజున విడుదల కానుంది.

‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’- ఫిబ్రవరి 16న విడుదల

వరుణ్‌తేజ్‌ హీరోగా తెలుగు, హిందీలో రూపొందించిన చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌, రినైసెన్స్‌ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. శక్తిప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వం వహిస్తున్నారు. మానుషి చిల్లర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.   

‘ఊరు పేరు భైరవకోన’-ఫిబ్రవరి 16న విడుదల

టాలీవుడ్ యంగ్ నటుడు సందీప్ కిషన్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రీసెంట్ విడుదలైన ఈ మూవీ ట్రైలర్ మరింత క్యూరియాసిటీని పెంచింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. దైవభక్తి, క్షుద్రశక్తి, కర్మ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని రూపొందించిన ఈ చిత్రం ఫిబ్రవరి 16న విడుదల కానుంది.  

‘మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా!’- ఫిబ్రవరి 23న విడుదల

అభినవ్‌ గోమఠం ప్రధాన పాత్రలో ‘మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా!’ చిత్రాన్ని తిరుపతి రావు ఇండ్ల తెరకెక్కిస్తున్నారు. తరుణ్‌ భాస్కర్‌, అలీ రేజా, వైశాలి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని భవాని కాసుల, ఆరెమ్‌ రెడ్డి, ప్రశాంత్‌.వి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్ని భావోద్వేగాల మేళవింపుతో మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందించాం. ప్రతి పాత్ర ఎంతో సహజంగా, ఆకట్టుకునే విధంగా ఉంటుందన్నారు దర్శకుడు.  ఈ సినిమా ఫిబ్రవరి 23న విడుదల కానుంది’ అని అన్నారు. అటు ‘సుందరం మాస్టర్’,  ‘తిరగబడరా సామి’ లాంటి సినిమాలు కూడా ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో ప్రేక్షకులను పలకరించనున్నాయి.

Read Also: నా సినిమా చూడండి ప్లీజ్, మోకాళ్ళ మీద పడి ప్రేక్షకుల్ని వేడుకున్న సోహైల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు
పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు
Hyderabad News: చంచల్‌గూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత, రేవంత్ సర్కార్‌కు కొత్త చిక్కులు
చంచల్‌గూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత, రేవంత్ సర్కార్‌కు కొత్త చిక్కులు
Suman About Laddu: తిరుమల లడ్డూ కల్తీపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, పార్లమెంట్‌లో చట్టం తేవాలని డిమాండ్
తిరుమల లడ్డూ కల్తీపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, పార్లమెంట్‌లో చట్టం తేవాలని డిమాండ్
HYDRA Ranganath: హైడ్రా పరిధి అంతవరకే, ఆ కూల్చివేతలతో మాకు ఏ సంబంధం లేదు: రంగనాథ్
హైడ్రా పరిధి అంతవరకే, ఆ కూల్చివేతలతో మాకు ఏ సంబంధం లేదు: రంగనాథ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్తిరుమలలో మరోసారి చిరుత కలకలం, సీసీటీవీ ఫుటేజ్‌తో సంచలనంతమిళనాడు డిప్యుటీ సీఎంగా ఉదయ నిధి స్టాలిన్, ప్రకటించిన డీఎమ్‌కేకేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు
పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు
Hyderabad News: చంచల్‌గూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత, రేవంత్ సర్కార్‌కు కొత్త చిక్కులు
చంచల్‌గూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత, రేవంత్ సర్కార్‌కు కొత్త చిక్కులు
Suman About Laddu: తిరుమల లడ్డూ కల్తీపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, పార్లమెంట్‌లో చట్టం తేవాలని డిమాండ్
తిరుమల లడ్డూ కల్తీపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, పార్లమెంట్‌లో చట్టం తేవాలని డిమాండ్
HYDRA Ranganath: హైడ్రా పరిధి అంతవరకే, ఆ కూల్చివేతలతో మాకు ఏ సంబంధం లేదు: రంగనాథ్
హైడ్రా పరిధి అంతవరకే, ఆ కూల్చివేతలతో మాకు ఏ సంబంధం లేదు: రంగనాథ్
Mujra Party: ముజ్రాపార్టీని భగ్నం చేసిన టాస్క్ ఫోర్స్, హైదరాబాద్ పాతబస్తీలో గలీజు పనులు
ముజ్రాపార్టీని భగ్నం చేసిన టాస్క్ ఫోర్స్, హైదరాబాద్ పాతబస్తీలో గలీజు పనులు
LULU Back To AP: ఏపీకి తిరిగొచ్చిన లులు, ఆ ప్రాంతాల్లో భారీగా పెట్టుబడులు - చంద్రబాబుకు ధన్యవాదాలు
ఏపీకి తిరిగొచ్చిన లులు, ఆ ప్రాంతాల్లో భారీగా పెట్టుబడులు - చంద్రబాబుకు ధన్యవాదాలు
Best Cars: టాటా సీఎన్‌జీ వర్సెస్‌ మారుతి ఫ్రాంక్స్‌, బ్రెజా సీఎన్‌జీ కార్లలో ఏది బెస్ట్‌?
టాటా సీఎన్‌జీ వర్సెస్‌ మారుతి ఫ్రాంక్స్‌, బ్రెజా సీఎన్‌జీ కార్లలో ఏది బెస్ట్‌?
Delhi Crime: కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన దుండగులు, చికిత్స పొందుతూ మృతి- భయానక దృశ్యాలు
కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన దుండగులు, చికిత్స పొందుతూ మృతి- భయానక దృశ్యాలు
Embed widget