News
News
X

Santhanam Viral video: పులి తోకతో ఆటలాడుతున్న హాస్య నటుడు - మండిపడుతోన్న నెటిజన్స్

తమిళ నటుడు సంతానం ఇటీవల పులి పక్కన కూర్చున్న వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోకు ‘దీనినే టైగర్ క్యాచింగ్ ఇట్స్ టైల్’ అంటూ రాసుకొచ్చాడు. ఆ వీడియో చూసి నెటిజన్స్ మండిపడుతున్నారు.

FOLLOW US: 
Share:

సినిమా ఇండస్ట్రీలో నటీనటులపై సోషల్ మీడియా ప్రభావం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అందులోనూ స్టార్ డమ్ తెచ్చుకున్న నటీనటులకు ఉండే క్రేజే వేరు. వాళ్లు కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ పోస్ట్ లు పెడుతూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుంటారు. అయితే ఒక్కోసారి తెలిసోతెలీకో వాళ్లు చేసే వ్యాఖ్యలు, చేష్టలూ బెడిసికొట్టి నెట్టింట టార్గెట్ అయి ట్రోలింగ్ కు గురవుతారు. తాజాగా తమిళ నటుడు సంతానం కూడా ప్రస్తుతం ట్రోలింగ్ కు గురవుతున్నాడు. కొన్ని రోజుల క్రితం తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్ట్ పై నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆయన చేసిన పోస్ట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. 

ఇటీవల సంతానం ఓ స్విమ్మింగ్ పూల్ దగ్గర నిద్రిస్తున్న పులి పక్కన కూర్చున్న వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోకు ‘దీనినే టైగర్ క్యాచింగ్ ఇట్స్ టైల్’ అంటూ రాసుకొచ్చాడు. ఇంకా ఆ వీడియోలో.. సంతానం పులి పక్కన కూర్చున్నాడు, దాని తోక పట్టుకొని ఆడుతున్నట్టు కనిపిస్తోంది. సంతానం పక్కనే ఉన్న సిబ్బందిని ఈ పులి పడుకుందా అని అడిగితే.. అతను కర్రతో దాన్ని నిద్రలేపుతున్నాడు, ఆ పులి బాగా అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఈ వీడియో చూసిన నెటిజన్స్ సంతానం పై మండిపడుతున్నారు. అడవి జంతువుల పట్ల అలా బాధ్యతారాహిత్యంగా ఉండుకూడదు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంత మంది సంతానం ప్రవర్తనతో ఆ నీరసించిన పులిని ఇంకా హింసిస్తున్నాడు అంటూ ఫైర్ అవుతున్నారు. దయచేసి ఆ వీడియో తొలగించాలి అని పలువురు నెటిజన్స్ కామెంట్లు పెట్టారు. దీనిపై ఎంత మంది ఫైర్ అవుతున్నా నటుడు సంతానం మాత్రం ఆ వీడియోను ఇప్పటికీ తన ఖాతా నుంచి తొలగించకపోవడం గమనార్హం. 

తమిళ నటులు చాలా మందికి తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. అలాగే నటుడు సంతానానికి కూడా తెలుగులో మంచి కమెడియన్ గా గుర్తింపు ఉంది. తెలుగులో డబ్ అయిన చాలా తమిళ సినిమాల్లో ఆయన కనిపిస్తుంటాడు. ఆయన కెరీర్ మొదట్లో టెలివిజన్ రంగంలో కమెడియన్ గా గుర్తింపు తెచ్చకున్నాడు. తర్వాత సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. తమిళ్ లో వచ్చిన మన్మధన్ (2004), సచిన్ (2005), పొల్లాధవన్ (2007) సినిమాల్లో నటించి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత వరుసగా సినిమా అవకాశాలు తలుపుతట్టాయి. అనేక తమిళ్ చిత్రాల్లో కమెడియన్ గా సహ నటుడిగా నటించి మెప్పించాడు. తర్వాత నిర్మాతగానూ పలు సినిమాలు తెరకెక్కించాడు. 2013 లో వచ్చిన ‘కన్న లడ్డు తిన్న ఆశయ్యా’ సినిమాతో నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత పలు సనిమాల్లో ప్రధాన పాత్రలు పోషించాడు. ఇక ఇటీవల సంతానం వరుసగా మెయిన్ లీడ్ క్యారక్టర్ ఉన్న సినిమాలే చేస్తున్నాడు. అయితే ఆయన హీరో గా చేసిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. రీసెంట్ గా ‘గులు గులు’ సినిమాలో నటించాడు. ఇంకొన్ని చిత్రాల్లో కూడా మెయిన్ లీడ్ పాత్రల్లో నటిస్తున్నాడు సంతానం.

Also Read : మాస్ సినిమా చేస్తే 'కెజియఫ్' లాంటి సినిమా చేస్తా - ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ

Published at : 27 Dec 2022 09:09 PM (IST) Tags: Tamil Actor Santhanam Santhanam Comedian Santhanam Santhanam Movies

సంబంధిత కథనాలు

Ennenno Janmalabandham February 2nd: అభికి పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసిన భ్రమరాంబిక- వేద మీద అమితమైన ప్రేమ చూపించిన యష్

Ennenno Janmalabandham February 2nd: అభికి పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసిన భ్రమరాంబిక- వేద మీద అమితమైన ప్రేమ చూపించిన యష్

Shaakuntalam Movie : సమంత సినిమాకు ఎందుకిలా? శాకుంతల, దుష్యంతుల ప్రేమకథకు మోక్షం ఎప్పుడు?

Shaakuntalam Movie : సమంత సినిమాకు ఎందుకిలా? శాకుంతల, దుష్యంతుల ప్రేమకథకు మోక్షం ఎప్పుడు?

The Power: అమ్మాయిల ఒంటి నుంచి నిజంగా కరెంటు పుడితే - ‘ది పవర్’ టీజర్ మైండ్ బ్లోయింగ్!

The Power: అమ్మాయిల ఒంటి నుంచి నిజంగా కరెంటు పుడితే - ‘ది పవర్’ టీజర్ మైండ్ బ్లోయింగ్!

PSPK In Unstoppable : ఒక్క రోజు ముందుకు పవర్ ఫైనల్ - రేపు రాత్రి నుంచి ఆహాలో బాలకృష్ణ, పవన్ సందడి

PSPK In Unstoppable : ఒక్క రోజు ముందుకు పవర్ ఫైనల్ - రేపు రాత్రి నుంచి ఆహాలో బాలకృష్ణ, పవన్ సందడి

Sasivadane Title Song : హరీష్ శంకర్ విడుదల చేసిన 'శశివదనే' పాట - కోమలితో రక్షిత్ ప్రేమంట!  

Sasivadane Title Song : హరీష్ శంకర్ విడుదల చేసిన 'శశివదనే' పాట - కోమలితో రక్షిత్ ప్రేమంట!  

టాప్ స్టోరీస్

YSRCP News: ఆ ఎమ్మెల్యే ఏడో తరగతి తప్పినోడు, ఎప్పుడూ సినిమాలంటాడు - వైసీపీ లీడర్ల మధ్య ముసలం

YSRCP News: ఆ ఎమ్మెల్యే ఏడో తరగతి తప్పినోడు, ఎప్పుడూ సినిమాలంటాడు - వైసీపీ లీడర్ల మధ్య ముసలం

Union Budget 2023 Highlights: బడ్జెట్-2023లో మీరు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే - టాప్ 10 హైలైట్స్ ఇలా

Union Budget 2023 Highlights: బడ్జెట్-2023లో మీరు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే - టాప్ 10 హైలైట్స్ ఇలా

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ