(Source: ECI/ABP News/ABP Majha)
Sudigali Sudheer : 'ఎక్స్ట్రా జబర్దస్త్'కు తిరిగొచ్చిన 'సుడిగాలి' సుధీర్?
'సుడిగాలి' సుధీర్ అంటే బుల్లితెర వీక్షకులకు, తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది 'జబర్దస్త్'. ఆ కార్యక్రమం ద్వారా ఆయన పాపులర్ అయ్యారు. మళ్ళీ ఆ ప్రోగ్రామ్‌కి తిరిగొచ్చారా?
'సుడిగాలి' సుధీర్ (Sudigali Sudheer) అంటే బుల్లితెర వీక్షకులకు, తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది 'జబర్దస్త్', 'ఎక్స్ట్రా జబర్దస్త్' (Extra Jabardasth) ప్రోగ్రామ్స్. బుల్లితెరపై హాస్య నటుడిగా ప్రయాణం ప్రారంభించి వెండితెరపై కథానాయకుడిగా వచ్చారంటే... కారణం ఆ ప్రోగ్రామ్సే. మళ్ళీ తనకు పేరు తీసుకు వచ్చిన 'ఎక్స్ట్రా జబర్దస్త్'కు 'సుడిగాలి' సుధీర్ వచ్చారా? అంటే... ఆయన మాటలు వింటుంటే 'అవును' అనిపిస్తోంది. ఎందుకు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
'సుడిగాలి' సుధీర్, రష్మీ గౌతమ్ (Rashmi Gautam) మధ్య ఫ్రెండ్షిప్, ప్రొఫెషనల్ బాండింగ్ గురించి ప్రేక్షకులు అందరికి తెలిసిందే. వాళ్ళిద్దరూ ప్రేమలో పడి చాలా రోజులు అయ్యిందని కొందరు అంటుంటారు అనుకోండి. అది వేరే సంగతి! దాన్ని పక్కన పెడితే... రష్మీ గౌతమ్ కథానాయికగా నటించిన 'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమా ఈ శుక్రవారం (నవంబర్ 4న) విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు సుధీర్ అటెండ్ అయ్యారు.
రష్మీకి ఆయన ఎప్పుడూ చెప్పే పాపులర్ డైలాగ్ ఉంది కదా! 'నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో నాకు తెలియదు గానీ... నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా' - ఆ డైలాగును చెప్పమని సుధీర్‌ని అడిగారు. అప్పుడు 'ఈ రోజు ఉదయం శ్రీదేవి డ్రామా కంపెనీ'కి వెళ్ళినప్పుడు చెప్పాను. రెండు రోజుల క్రితం 'ఎక్స్ట్రా జబర్దస్త్'కి వెళ్ళినప్పుడు చెప్పాను. ఆ మాటలు విన్నాక... మళ్ళీ సుధీర్ 'ఎక్స్ట్రా జబర్దస్త్' చేయడం స్టార్ట్ చేశాడా? అని డౌట్ కలుగుతోంది.
కేవలం 'ఎక్స్ట్రా జబర్దస్త్' మాత్రమే కాదు... మల్లెమాల సంస్థ రూపొందించిన 'పోరా పోవే', డాన్స్ రియాలిటీ షో 'ఢీ', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కార్యక్రమాలు ఆయన్ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. అయితే... కొన్ని రోజుల క్రితం మల్లెమాల సంస్థను వదిలేశారు సుధీర్. ఈటీవీ ప్రోగ్రామ్స్ కాకుండా వేరే ఛానల్ ప్రోగ్రామ్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ప్రోగ్రామ్స్ ఎండ్ అయ్యాయి. దాంతో మళ్ళీ ఎప్పుడూ ఎండ్ అవ్వకుండా నడిచే 'ఎక్స్ట్రా జబర్దస్త్'కు వచ్చాడని తెలుస్తోంది.
Also Read : బ్లాక్ బస్టర్ మూవీ ‘కాంతార’ను చూసిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, రిషబ్ శెట్టికి అభినందనలు
'సుడిగాలి' సుధీర్‌తో పాటు 'గెటప్' శీను కూడా 'ఎక్స్ట్రా జబర్దస్త్' వీడినా... మళ్ళీ కొన్ని రోజులకు ఆయన తిరిగి వచ్చారు. అందువల్ల, సుధీర్ కూడా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలను కొట్టి పారేయలేం. అదీ సంగతి!
View this post on Instagram