అన్వేషించండి

Rashmi Sudheer: ఢీ-14: ‘సుధీర్‌, రష్మీలేని షో మాకొద్దు’.. ఆదిని అఖిల్ తట్టుకోగలడా?

ఢీ-షో నుంచి సుధీర్, రష్మీలను తీసేశారా? వాళ్లే తప్పుకున్నారా? వారిద్దరూ లేని ఈ షో.. ప్రేక్షకాధరణ పొందుతుందా?

‘ఢీ’ ఈ పేరు వినగానే మనకు డ్యాన్స్‌షో గుర్తురాదు. సుధీర్ - రష్మీ - ఆది - ప్రదీప్‌ల కామెడీనే గుర్తుకొస్తుంది. ఆ షో అంతగా హిట్ కొట్టిందంటే కారణం ఆ నలుగురే అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. వారి పంచ్‌లు, జోకులు, స్కిట్లు లేకుండా ఆ డ్యాన్స్ షోను ఊహించుకోవడం కష్టమే. అయితే, తాజాగా ఈటీవీ విడుదల చేసిన ‘ఢీ-14 డ్యాన్సింగ్ ఐకాన్’ ప్రోమోలో.. సుధీర్-రష్మీలు కనిపించలేదు. చివరికి దీపిక పిల్లి కూడా లేదు. వారి స్థానంలో బిగ్ బాస్ రన్నరప్ అఖిల్ సార్దక్‌ను రంగంలోకి దించారు. ఈ తాజా షోను కూడా ప్రదీప్ హోస్ట్ చేస్తున్నాడు. హైపర్ ఆది, అఖిల్‌ టీమ్‌ల మధ్య ‘ఢీ-14 డ్యాన్సింగ్ ఐకాన్’ పోటీ జరగనుంది. ఈ షోకు కూడా ప్రియమణి, గణేష్ మాస్టర్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రోమోలో పూర్ణ కనిపించలేదు. 

సుధీర్-రష్మీ జంటకు బుల్లితెరలో మాంచి ఫాలోయింగ్ ఉంది. వారి లవ్ చేసుకున్నా.. చేసుకోకపోయినా.. వారిద్దరు ఉండే షోను చూసేందుకు అంతా ఇష్టపడతారు. అలాగే, ఆది-సుధీర్-ప్రదీప్‌ల మధ్య వచ్చే సరదా సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వి్స్తాయి. రష్మీ అమాయకత్వం.. సుధీర్ ఎక్స్‌ప్రెషన్స్.. ఈ షోకు ప్రధాన బలం. అయితే, వీరి వల్లే పూర్తిగా షో నడుస్తుందని చెప్పలేం. ఈ షోలో వచ్చే డ్యాన్సులు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే, మొత్తం డ్యాన్సే కాకుండా మధ్య మధ్యలో కామెడినీ కూడా పండిస్తుండటం వల్ల ‘ఢీ’ కాస్తా.. కామె‘ఢీ’షోగా మారిందని కామెంట్స్ చేసేవారు కూడా ఉన్నాయి. కానీ, వారి కామెడీ కోసమే ఈ షోను చూసేవారు చాలామంది ఉన్నారు. 

మల్లెమాల సంస్థ విడుదల చేసిన ప్రోమోలో సుధీర్-రష్మీ జోడీ కనిపించకపోవడంతో ఫ్యాన్స్ చాలా హర్ట్ అయినట్లు కనిపిస్తోంది. తమ బాధను ప్రోమో కింద కామెంట్ల ద్వారా తెలియజేస్తు్న్నారు. ‘‘సుధీర్, రష్మీలేని షో మాకొద్దు’’ అని కొందరు. వారిద్దరూ లేకపోతే ఆ షోకు కళే ఉండదని మరికొందరు అంటున్నారు. అలాగే.. హైపర్ ఆది పంచులను తట్టుకోవాలంటే సుధీర్ ఒక్కడే కరెక్ట్ అని అఖిల్ వల్ల కాదని అంటున్నారు. అయితే, అఖిల్ అభిమానులు మాత్రం ఖుషీ ఖుషీగా ఉన్నారు. అఖిల్ వచ్చాడంటే త్వరలో మోనల్‌ను కూడా రంగంలోకి దించుతారు కాబోలు అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. అయితే, సుధీర్-రష్మీ ఈ షో నుంచి కావాలనే తప్పుకున్నారా? లేదా షో నిర్వాహకులే వారిని తొలగించారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. 

Also Read: 'సుడిగాలి' సుధీర్‌కు ఓ షో పోయింది! మరో షోలో మాత్రం...

ఈ వారం ప్రసారమైన ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ ఎపిసోడ్ ప్రోమోలో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాం ప్రసాద్‌లు విడిచి వెళుతున్నట్టు కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశారు. కొంత మంది దాన్ని నిజం అని అనుకున్నారు. మరి కొందరు టీఆర్పీ రేటింగ్ కోసం చేసిన పని ఊహించారు. అదే నిజమైంది. ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ నుంచి ‘సుడిగాలి’ సుధీర్ టీమ్ బయటకు వెళ్లడం లేదు. అయితే, ఢీ షోలో వారి థీమ్ ప్రకారం కూడా సెలబ్రిటీలను ఎంపిక చేసుకుంటారు. ఇప్పుడు జరిగేది చిన్న పిల్లల షో కావడంతో బిగ్ బాస్ ద్వారా పాపులరైన అఖిల్‌తో కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టారని అనుకోవచ్చు. కొద్ది రోజుల తర్వాత ప్రేక్షకులు కూడా వీరికి అలవాటు పడిపోవడం ఖాయం. 

ఢీ-14 - ప్రోమో:

Also Read: అల్లు అర్జున్ తో రష్మీ.. 'ఢీ' షోకి గుడ్‌బై..?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today May 28th: 'గోదావరి' సీరియల్: జానుని తిట్టిన శాంతి.. అత్తపై జాను రివర్స్! సూర్య డెస్టినీ గోల ఏంటో!
'గోదావరి' సీరియల్: జానుని తిట్టిన శాంతి.. అత్తపై జాను రివర్స్! సూర్య డెస్టినీ గోల ఏంటో!
Vishwanath And Sons Release Date : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ - కరుప్పు సక్సెస్ జోష్ కంటిన్యూ చేస్తూ...
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ - కరుప్పు సక్సెస్ జోష్ కంటిన్యూ చేస్తూ...
Don 3 Shah Rukh Khan : డాన్ 3లో మళ్లీ షారుఖ్... బాలీవుడ్ బాద్‌షా ఆ కండిషన్ పెట్టారా?
డాన్ 3లో మళ్లీ షారుఖ్... బాలీవుడ్ బాద్‌షా ఆ కండిషన్ పెట్టారా?
Blast Zone Review - 'బ్లాస్ట్ జోన్' రివ్యూ: యాక్షన్ కింగ్ అర్జున్ లేటెస్ట్ థ్రిల్లర్ - సినిమా ఎలా ఉందంటే?
'బ్లాస్ట్ జోన్' రివ్యూ: యాక్షన్ కింగ్ అర్జున్ లేటెస్ట్ థ్రిల్లర్ - సినిమా ఎలా ఉందంటే?

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka CM Resignation: కర్ణాటకలో ఇడ్లీ,దోశల మధ్య సీఎం మార్పు ప్రకటన! సిద్ధరామయ్య రాజీనామాకు కారణాలేంటీ?
కర్ణాటకలో ఇడ్లీ,దోశల మధ్య సీఎం మార్పు ప్రకటన! సిద్ధరామయ్య రాజీనామాకు కారణాలేంటీ?
Rahul Gandhi youth rebellion: మోదీ ప్రభుత్వానికి ఏడాదే టైం ఇచ్చిన రాహుల్ -ఈ లోపు జెన్ జీ తిరుగుబాటు వస్తుందని ఆశపడుతున్నారా?
మోదీ ప్రభుత్వానికి ఏడాదే టైం ఇచ్చిన రాహుల్ -ఈ లోపు జెన్ జీ తిరుగుబాటు వస్తుందని ఆశపడుతున్నారా?
Vishwanath And Sons Release Date : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ - కరుప్పు సక్సెస్ జోష్ కంటిన్యూ చేస్తూ...
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ - కరుప్పు సక్సెస్ జోష్ కంటిన్యూ చేస్తూ...
US Attacks Iran:హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తత!ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం!
హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తత!ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం!
Tata Tiago And Tiago EV: సరికొత్త టాటా టియాగో, టియాగో ఈవీ: అదిరిపోయే డిజైన్, ఫీచర్లతో ఎంట్రీ.. ధర, రేంజ్ వివరాలు
సరికొత్త టాటా టియాగో, టియాగో ఈవీ: అదిరిపోయే డిజైన్, ఫీచర్లతో ఎంట్రీ.. ధర, రేంజ్ వివరాలు
Breaking News:సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
Adilabad Crime News: పార్క్ చేసిన వాహనాలను క్షణాల్లో మాయం చేసే ముఠా అరెస్టు! ఛేజ్ చేసి పట్టుకున్న ఆదిలాబాద్ పోలీసులు!
పార్క్ చేసిన వాహనాలను క్షణాల్లో మాయం చేసే ముఠా అరెస్టు! ఛేజ్ చేసి పట్టుకున్న ఆదిలాబాద్ పోలీసులు!
Dhanush Kara OTT : ఓటీటీలోకి వచ్చేసిన ధనుష కర - ఒకే రోజు 4 సినిమాలు... ఈ మూవీస్ డోంట్ మిస్
ఓటీటీలోకి వచ్చేసిన ధనుష కర - ఒకే రోజు 4 సినిమాలు... ఈ మూవీస్ డోంట్ మిస్
Embed widget