Subhalekha sudhakar: మేం ఏం ద్రోహం చేశాం.. కన్నీళ్లు పెట్టుకున్న శుభలేఖ సుధాకర్
Subhalekha sudhakar:శుభలేఖ సుధాకర్.. పరిచయం అక్కర్లేని పేరు. మంచి మంచి క్యారెక్టర్లు చేసి అభిమానులను సంపాదించుకున్నారు. అయితే, ఆయన గురించి ఎప్పుడూ రూమర్లు మాత్రం చక్కర్లు కొడుతూనే ఉంటాయి.
Subhalekha sudhakar Emotional: శుభలేఖ సుధాకర్.. టాలీవుడ్ లో ఈయనకు ప్రత్యేక స్థానం. ఎన్నో మంచి మంచి క్యారెక్టర్లు చేశారు. ప్రతి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి, పాత్ర ఏదైనా దానికి వందశాతం న్యాయం చేస్తారు. కె. విశ్వనాథ్ తెరకెక్కించిన 'శుభలేఖ' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన 'శుభలేఖ' సుధాకర్ ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా నటుడు కావాలనే ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరో, విలన్ తదితర పాత్రలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అగ్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించి ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు.దివంగత గాయకుడు బాలసుబ్రహ్మణ్యం చెల్లి, గాయని శైలజ భర్త 'శుభలేఖ' సుధాకర్. అయితే, వీళ్ల గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త ప్రచారంలో ఉంటుంది. విడాకులు తీసుకున్నారని, కలిసి ఉండటం లేదనే ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలకు చాలాసార్లు చెక్ పెట్టారు ఈ దంపతులు. అయినప్పటికీ అలాంటి వార్తలే రాస్తుంటారు. దీనిపై స్పందించారు 'శుభలేఖ' సుధాకర్. కన్నీళ్లు పెట్టుకున్నారు.
దయచేసి మమ్మల్ని వదిలేయండి..
'యాత్ర - 2' లో రెడ్డి పాత్రలో నటించారు 'శుభలేఖ' సుధాకర్. ఆయన యాక్టింగ్ కి మంచి మార్కులు పడ్డాయి. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన కొన్ని య్యూట్యూబ్ ఛానెల్స్ రాస్తున్న వార్తల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. ''చాలా య్యూట్యూబ్ ఛానెల్స్ తప్పుడు థంబ్ నైల్స్ పెట్టి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ల తీరు మార్చుకోవడం లేదు. నాకు చిరంజీవికి ఎవో గొడవలు ఉన్నాయని రాస్తున్నారు. నేను చిరంజీవి చాలా క్లోజ్. బాలసుబ్రహ్మణ్యం గారు హాస్పిటల్ లో ఉన్నప్పుడు రోజు ఫోన్ చేసి ఆయన పరిస్థితి గురించి కనుక్కున్నారు. నా మొదటి హీరో ఆయన. మేం చాలా క్లోజ్ గా ఉంటాం. ఇక నా గురించి రాసే మరో వార్త.. నేను శైలజ విడిపోయాం, విడాకులు తీసుకున్నాం అని. ఎన్నిసార్లు బయటికి వచ్చి, నేను తను క్లారిటీ ఇచ్చినా ఆ వార్తలు రాయడం మానలేదు. ఇలాంటి వార్తలు చూసినప్పుడు మా అమ్మ ఒకసారి శైలజను ''మీరు ఇద్దరు ఏమైనా గొడవలు పడుతున్నారా?'' అని అడిగింది. నేను దానికి లేదు అమ్మ అని చెప్పాను. ఆ తర్వాత ఒక రోజు మా అమ్మ నిద్రలోనే చనిపోయారు. దీన్ని నేను ఎలా అనుకోవాలి. ప్రపచంలో అత్యంత నీచమైన పని ఒక స్త్రీ ఒళ్లు అమ్ముకోవడం అని నేను అనుకుంటాను. అది కూడా వాళ్లు నిజాయతీగా చేస్తారు అనిపిస్తుంది. కానీ, యూట్యూబ్ వాళ్లు అంతకంటే దారుణంగా తయారు అయ్యారు'' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు శుభలేఖ సుధాకర్.
నేను చనిపోయానంటూ వార్తలు..
''నేను చనిపోయాను అంటూ చాలాసార్లు వార్తలు రాశారు. ఆ థంబ్ నైల్స్ పెట్టి క్యాష్ చేసుకున్నారు. అలా రాస్తే వాళ్లు ఏం కలిసి వస్తుంది? నేను ఏం ద్రోహం చేశాను. నేను ఎవ్విరినీ ఇబ్బంది పెట్టను. మీ పొట్ట కూటి కోసం పక్కనవాళ్లను చంపడం ఎందుకు? అలా సంపాదించిన సొమ్మ ఒంటికి పడుతుందా? ఇలా చేస్తున్న వాళ్లు కచ్చితంగా అనుభవిస్తారు'' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు సుధాకర్.
Also Read: ఒకప్పటి హీరోయిన్ - ఇప్పుడు కార్తీ చెల్లిగా