News
News
X

Pushpa: ‘పుష్ప’రాజ్ రూలింగ్ మొదలు, అల్లు అర్జున్ లేకుండానే షూటింగ్, ఫొటోస్ వైరల్!

అతి త్వరలోనో పుష్పరాజ్ మళ్ళీ సందడి చేయనున్నాడు. పుష్ప పార్ట్ 2 పూజా కార్యక్రమాలు మొదలుపెట్టేశారు.

FOLLOW US: 

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2(పుష్ప: ది రూల్) మొదలైపోయింది. సోమవారం (ఆగస్టు 22) పూజా కార్యక్రమాలతో అధికారికంగా సుకుమార్ షూటింగ్ మొదలుపెట్టారు. అల్లూ అర్జున్ నటించిన పుష్ప: ది రైజ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇందులో పుష్పరాజ్ మేనరిజం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. అభిమానులు దగ్గర నుంచి ప్రముఖ సెలబ్రెటీల వరకు ఎక్కడ చూసినా తగ్గేదెలే అంటూ రచ్చ రచ్చ చేశారు. అంతర్జాతీయ స్థాయిలోనూ అల్లు అర్జున్ పాపులారిటీ సంపాదించకున్నారు. ఆ రేంజ్ లో సినిమా హిట్ అయ్యింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా పుష్ప: ది రూల్ రాబోతుంది.

పుష్ప పార్ట్ 2 కి సమబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పూజా కార్యక్రమంలో డైరెక్టర్ సుకుమార్, ప్రొడ్యూసర్స్ నవీన్, రవి శంకర్ పాల్గొన్నారు. అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది. వంద రోజుల్లో ఈ సినిమా కంప్లీట్ చేసి దసరా నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సుకుమార్ కి బన్నీ డెడ్ లైన్ పెట్టారట. పుష్ప పార్ట్ 1 సినిమాలోని "ఉ అంటావ మావ.. ఊహూ అంటావా" సాంగ్ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. దక్షిణాది అగ్ర హీరోయిన్ గా రాణిస్తున్న సమంతా ఈ పాటలో నటించి మరింత గ్లామర్ తెచ్చింది. మరి పుష్ప పార్ట్ 2 సినిమాలో ఎటువంటి ఐటెం సాంగ్ ఉంటుంది, అందులో ఎవరు నటిస్తారు అని ఫ్యాన్స్ చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.

'పుష్ప' పార్ట్ 2 ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే శాటిలైట్, డిజిటల్ రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నాయి కొన్ని సంస్థలు. 'పుష్ప'తో డీల్ క్లోజ్ చేయాలని చూస్తున్నాయి. రీసెంట్ గా ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం రూ.100 కోట్ల ఆఫర్ చేసిందట ఓ సంస్థ. మైత్రి మూవీస్ బ్యానర్ ఈ డీల్ పై ఆసక్తి చూపిస్తున్నప్పటికీ.. బన్నీ మాత్రం వద్దని చెప్పారట. సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత బిజినెస్ ఇంకా బాగా జరుగుతుందని.. కాబట్టి అప్పటివరకు ఎలాంటి డీల్స్ ఓకే చేయొద్దని చెప్పారట. దీంతో ప్రస్తుతానికి ఈ క్రేజీ డీల్ ను పక్కన పెట్టేశారు. 'పుష్ప' పార్ట్ 1 సమయంలో మాత్రం డిజిటల్ అండ్ శాటిలైట్ హక్కులను ముందే అమ్మేశారు. ఈసారి మాత్రం అలా చేయడం లేదు.

మెగా ఇండియా డే పరేడ్ లో బన్నీ 

ప్రస్తుతం అల్లు అర్జున్ తన భార్యతో కలిసి న్యూయార్క్ లో ఎంజాయ్ చేస్తున్నారు. భారత్ 75 వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని అక్కడ నిర్వహించిన ఇండియా డే పరేడ్ లో అల్లు అర్జున్, స్నేహ రెడ్డి పాల్గొన్నారు. ఓపెన్ టాప్ వెహికల్ లో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ఈ పరేడ్ కి అల్లు అర్జున్ నాయకత్వం వహించారు. తమ అభిమాన హీరోకి ప్రవాస భారతీయులు అద్భుతమైన స్వాగతం చెప్పారు. ‘తగ్గేదెలే’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ డాన్స్ చేసి రచ్చ రచ్చ చేశారు. సుమారు 5 లక్షల మంది ఈ మెగా పరేడ్ లో పాల్గొన్నారు. ఈ పరేడ్ లో పాల్గొన్నందుకు గాను న్యూయార్క్ మేయర్ ఎరిక్ అడమ్స్ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. బన్నీతో కలిసి తగ్గేదెలే అంటూ పుష్ప మేనరిజాన్ని చూపించారు.   

Also Read: చిరంజీవి ‘పసివాడి ప్రాణం’ సినిమాకు 5 భాషల్లో 5 వేర్వేరు క్లైమాక్సులు, ఇదిగో ఇలా మార్చేశారు

Also Read: చిరంజీవి బాలీవుడ్ చిత్రాలివే, ఆ సినిమా తర్వాత ఉత్తరాదికి ఎందుకు దూరమయ్యారు?
Published at : 22 Aug 2022 12:47 PM (IST) Tags: Allu Arjun Pushpa Sukumar Pushpa the rule

సంబంధిత కథనాలు

Devi Sri Prasad: స్టార్ హీరోతో విబేధాలు - దేవిశ్రీప్రసాద్ రియాక్షన్ ఇదే!

Devi Sri Prasad: స్టార్ హీరోతో విబేధాలు - దేవిశ్రీప్రసాద్ రియాక్షన్ ఇదే!

RGV On Adipurush Teaser: ఆయన లుక్ నాక్కూడా నచ్చలేదు, ప్రభాస్‌పై కుట్ర పెద్ద జోక్ - ‘ఆది పురుష్’ టీజర్ పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

RGV On Adipurush Teaser: ఆయన లుక్ నాక్కూడా నచ్చలేదు, ప్రభాస్‌పై కుట్ర పెద్ద జోక్ - ‘ఆది పురుష్’ టీజర్ పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Ori Devuda: 'వైఫ్ లో ఫ్రెండ్ ని చూడొచ్చు, కానీ ఫ్రెండే వైఫ్ గా వస్తే' - 'ఓరి దేవుడా' ట్రైలర్!

Ori Devuda: 'వైఫ్ లో ఫ్రెండ్ ని చూడొచ్చు, కానీ ఫ్రెండే వైఫ్ గా వస్తే' - 'ఓరి దేవుడా' ట్రైలర్!

Bigg Boss 6 Telugu: 'గొంతు లేపడం ఒక్కటే గొప్ప కాదు' - గీతూపై బాలాదిత్య ఫైర్!

Bigg Boss 6 Telugu: 'గొంతు లేపడం ఒక్కటే గొప్ప కాదు' - గీతూపై బాలాదిత్య ఫైర్!

టాప్ స్టోరీస్

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!

Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల