News
News
X
IND in ZIM, 3 ODI Series, 2022 | 2nd ODI | Harare Sports Club, Harare - 20 Aug, 12:45 pm IST
(Match Yet To Begin)
ZIM
ZIM
VS
IND
IND
Asia Cup Qualifier, 2022 | Match 1 | Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman - 20 Aug, 07:30 pm IST
(Match Yet To Begin)
SIN
SIN
VS
HK
HK

SS Thaman: ఒకే వేదికపై తమన్, కోటి, మణిశర్మ- ముగ్గురు కలిసి దుమ్ములేపారు

అద్భుతమైన పాటలు అందించడంలో ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మ దిట్ట. అందుకే ఆయన్ను అందరూ మెలోడీ బ్రహ్మ అంటారు. కుర్రకారుని ఉర్రూతలూగించే విధంగా మ్యూజిక్ ఇవ్వడంలో తమన్ ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకున్నారు.

FOLLOW US: 

అద్భుతమైన పాటలు అందించడంలో ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మ దిట్ట. అందుకే ఆయన్ను అందరూ మెలోడీ బ్రహ్మ అంటారు. కుర్రకారుని ఉర్రూతలూగించే విధంగా మ్యూజిక్ ఇవ్వడంలో తమన్ ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకున్నారు. మెలోడీలు అందించడంలో ప్రత్యేక స్థానం సంగీత దర్శకులు కోటిది. మరీ అలాంటి ముగ్గురు ఒకే వేదిక మీద కలిసి మ్యూజిక్ వాయిస్తే అదిరిపోతుంది కదా. 

ఇటీవల మణిశర్మ పుట్టిన రోజు సందర్భంగా తన శిష్యుడు తమన్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. బర్త్ డే సందర్భంగా కోటి, తమన్, మణిశర్మ ఒకేచోట కలిశారు. ఈ ముగ్గురు కలిసి "అతడు" సినిమాలోని 'అవును నిజం..  నువ్వంటే నాకిష్టం'..  అనే పాటకు మ్యూజిక్ ట్రాక్ అద్భుతంగా వాయించారు. దీనికి సంబంధించిన వీడియోను తమన్ తన ట్విటర్ లో పోస్ట్ చేశారు. తన గురువులు మణిశర్మ, కోటిగార్లతో కలిసి అద్భుతమైన రోజు అని రాసుకొచ్చారు. తాను ప్రస్తుతం ఈ స్థానంలో ఉండటానికి తన గురువుగారు కారణం అని తమన్ చెప్పుకొచ్చారు.  ఈ వీడియోలో తమన్ డ్రమ్స్ వాయిస్తుండగా, కోటి గిటార్ ప్లే చేస్తున్నారు. ముగ్గురు నువ్వా నేనా అన్నట్లుగా మ్యూజిక్ వాయిస్తూ దుమ్ము లేపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. 

Also Read : పేషెంట్ బాడీకి నా ఫేస్ అతికించారు - యూట్యూబ్ థంబ్‌నైల్స్‌పై విక్రమ్ రియాక్షన్

తమన్ మణిశర్మ దగ్గర దాదాపు ఎనిమిది ఏళ్ల పాటు అసిస్టెంట్ గా పని చేశారు. సుమారు 95 చిత్రాలకు మణిశర్మ దగ్గర పనిచేశారు. సంగీతంలో ఎన్నో మెలకువలను ఆయన దగ్గర నేర్చుకున్నట్లు తమన్ పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ సంగీత దర్శకులలో తమన్ ఒకరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాకు తమన్ అందించిన బీట్ థియేటర్లలో ప్రేక్షకులని ఉర్రూతలూగించింది. త్రివిక్రమ్ తో కలిసి మహేష్ చేస్తున్న సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రామ్ చరణ్ తో శంకర్ తీయబోయే చిత్రానికి కూడా తమన్ సంగీత దర్శకుడు. 

Also Read : రామ్ 'వారియర్' to సాయి పల్లవి 'గార్గి' - థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం విడుదలవుతోన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు

 

Published at : 12 Jul 2022 02:03 PM (IST) Tags: Koti Mani Sharma S S Thaman Mani Sharma Birthday Athadu Movie Song

సంబంధిత కథనాలు

Godfather: మెగాస్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్, 'గాడ్ ఫాదర్' టీజర్ డేట్ ఫిక్స్

Godfather: మెగాస్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్, 'గాడ్ ఫాదర్' టీజర్ డేట్ ఫిక్స్

Dirty Picture Sequel: విద్యా బాలన్ 'డర్టీ పిక్చర్'కు సీక్వల్, ఆ పాత్ర చేసేందుకు కంగనా తిరస్కరణ?

Dirty Picture Sequel: విద్యా బాలన్ 'డర్టీ పిక్చర్'కు సీక్వల్, ఆ పాత్ర చేసేందుకు కంగనా తిరస్కరణ?

Chiranjeevi Birthday Special: 30 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలో సందడి చేయనున్న ‘ఘరానా మొగుడు’

Chiranjeevi Birthday Special: 30 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలో సందడి చేయనున్న ‘ఘరానా మొగుడు’

The Ghost Promo: ‘ది ఘోస్ట్’ ప్రోమో: ‘థమహగానే’ సీన్‌తో నాగ్ ఎంట్రీ - అంచనాలు పెంచేస్తున్న కింగ్ మూవీ!

The Ghost Promo: ‘ది ఘోస్ట్’ ప్రోమో: ‘థమహగానే’ సీన్‌తో నాగ్ ఎంట్రీ - అంచనాలు పెంచేస్తున్న కింగ్ మూవీ!

రామానాయుడు ఫ్యామిలీకి హైకోర్టు గుడ్‌న్యూస్, తెలంగాణ సర్కార్‌కు షాక్ - కీలక తీర్పు

రామానాయుడు ఫ్యామిలీకి హైకోర్టు గుడ్‌న్యూస్, తెలంగాణ సర్కార్‌కు షాక్ - కీలక తీర్పు

టాప్ స్టోరీస్

తుమ్మల అనుచరుడి హత్య కేసులో ఆరుగురి అరెస్ట్!

తుమ్మల అనుచరుడి హత్య కేసులో ఆరుగురి అరెస్ట్!

Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!

Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!

AP High Court: జగన్ సర్కార్ డేంజర్ జోన్‌లో ఉందన్న ఏపీ హైకోర్టు, ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు

AP High Court: జగన్ సర్కార్ డేంజర్ జోన్‌లో ఉందన్న ఏపీ హైకోర్టు, ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు

Koppula Eashwar: సుప్రీంకోర్టులో మంత్రి కొప్పుల ఈశ్వర్‌కి చుక్కెదురు, 2018 నాటి కేసులో కీలక మలుపు

Koppula Eashwar: సుప్రీంకోర్టులో మంత్రి కొప్పుల ఈశ్వర్‌కి చుక్కెదురు, 2018 నాటి కేసులో కీలక మలుపు