అన్వేషించండి

SS Rajamouli: క్రియేటివ్ జీనియస్‌ను ఇంటర్వ్యూ చేసిన దర్శక ధీరుడు - ఆస్కార్ నామినేటెడ్ సినిమా గురించి ముచ్చట్లు!

ది ఫేబుల్‌మన్స్ సినిమా కోసం దర్శకధీరుడు రాజమౌళి స్టీఫెన్ స్పీల్‌బర్గ్‌ని ఇంటర్వ్యూ చేశారు.

రాజమౌళి RRR తో హాలీవుడ్ కి వెళ్లటం..ఆస్కార్స్ కి నాటు నాటు పాట ఫైనల్ నామినేషన్ దక్కించుకోవటం ఇవన్నీ గొప్పవిషయాలు. కానీ RRR ఇంపాక్ట్ వెస్ట్రన్ సినిమాటిక్ వరల్డ్ మీద ఎంత పడిందో చెప్పటానికి ఒక్క ఉదాహరణ ఏంటో తెలుసా...స్పీల్ బర్గ్ ని రాజమౌళి అరగంట ఇంటర్వ్యూ చేశారు. ఇండియానా జోన్స్, జురాసిక్ పార్క్, సేవింగ్ ప్రైవేట్ ర్యాన్, ష్లిండర్స్ లిస్ట్ లాంటి ఎన్నో సినిమాలు తీసి 60ఏళ్లుగా హాలీవుడ్ అనే  సామ్రాజ్యాన్ని మకుటం లేని మహారాజులా ఏలుతున్న స్పీల్ బర్గ్ ని రాజమౌళి ఇంటర్వ్యూ చేశారు. 22 ఆస్కార్ నామినేషన్లు..మూడుసార్లు బెస్ట్ డైరెక్టర్ గా ఆస్కార్ అవార్డు అందుకున్న స్పీల్ బర్గ్ ని రాజమౌళి ఇంటర్వ్యూ చేశారు. ఇదంతా స్పీల్ బర్గ్ స్థాయి గురించి చెప్పటానికి కాదు రాజమౌళి RRR తో చేసిన మ్యాజిక్ గురించి చెప్పటానికి.

స్పీల్ బర్గ్ ది ఫేబుల్ మేన్స్ అనే సినిమా తీశారు. ఆస్కార్ నామినేషన్స్ లో కూడా ఉంది ఆ సినిమా. ఆ సినిమా రీసెంట్ గా ఇండియా లో రిలీజ్ అయ్యింది. సో అసలు ఆ సినిమా దేని గురించి..తీస్తున్నప్పుడు స్పీల్ బర్గ్ థాట్స్ ఏంటీ ఈ ఇంటర్వ్యూలో చెప్పారు లెజండరీ డైరెక్టర్. పనిలో పనిగా రాజమౌళి RRR సినిమాపై తనకున్న ప్రేమనంత కురిపించారు స్పీల్ బర్గ్. లాస్ట్ వీకే RRR చూశానని...తన కళ్లను నేనే నమ్మలేకపోయానని చెప్పారు స్పీల్ బర్గ్. ప్రత్యేకించి ఆయన నోటి నుంచి రామ్ చరణ్, రామారావుల ప్రస్తావన వచ్చింది. నిజంగా ప్రౌడ్ మూమెంట్ కదా తెలుగు వాళ్లకి మనకు. బ్యూటిఫుల్ విజువల్స్, సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అద్భుతంగా ఉందని..జూమ్ ఇంటర్వ్యూల్లో కాదు ఓ సారి పర్సనల్ గా కలిస్తే..సినిమా తీసిన విధానంపై చాలా క్వశ్చన్స్ అడగాలని రాజమౌళికి ఆఫర్ ఇచ్చారు స్పీల్ బర్గ్. ఇక రాజమౌళి ఆనందం అంతా ఇంతా కాదు కదా..చైర్ నుంచి లేచి డ్యాన్స్ చేయాలనుంది అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

The Fablemans కాన్సెప్ట్ గురించి మాట్లాడారు స్పీల్ బర్గ్. తన ఆత్మకథనే సినిమా కథగా రాసుకున్నానన్న స్పీల్ బర్గ్....తన ఫ్యామిలీ మెంబర్స్ గురించి సినిమా తీయాల్సి రావటం చాలా కొత్త ఎక్స్ పీరియన్స్ అన్నారు. తన అక్కా చెళ్లేళ్లు, పేరెంట్స్ గురించి సినిమా తీయాల్సి వచ్చినప్పుడు టెన్షన్ కంటే వాళ్లు సినిమా చూసిన తర్వాత ఎంబేరసింగ్ గా ఫీల్ కాకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారు స్పీల్ బర్గ్. అమ్మ గురించి కొంచెం నెగటివ్ గా రాసుకున్నప్పుడు ఏమన్నా భయపడ్డారా మా దేశంలో తల్లి అంటే చాలా సెంటిమెంట్ గా చూస్తారు అంటే...పరిస్థితుల గురించి రాయాల్సి వచ్చిందని...నిజానికి తన కథలో హీరోలు, విలన్లు ఉండరని..సిచ్యుయేషన్స్ మాత్రమే ఉన్నాయని...దాన్ని సినిమా కథగా అందరూ యాక్సెప్ట్ చేశారని చెప్పారు స్పీల్ బర్గ్. సాధారణంగా ఎవరైనా కథ రాస్తే 60 ఏళ్లుగా డైరెక్ట్ చేస్తున్నానని..ఇప్పుడు కథ తనదే కాబట్టి షిప్పు తనదే..కెప్టెన్ తనే అన్నట్లుగా పరిస్థితి ఉందని నవ్వేశారు. 

కొన్ని సీన్లు చూస్తుంటే స్పీల్ బర్గ్ కూడా నా లాంటి మనిషే కదా అని ఫస్ట్ టైమ్ అనిపించిందన్నారు రాజమౌళి. దానికి స్పీల్ బర్గ్ నవ్వేశారు. పనిలో పనిగా యంగ్ ఫిల్మ్ మేకర్స్ కి ఎలాంటి సలహాలు ఇస్తారని రాజమౌళి స్పీల్ బర్గ్ ని అడిగారు. అవకాశాల కోసం ఎదురు చూడకుండా ఉన్న వనరులతో సినిమాను మొదలు పెట్టాలని స్పీల్ బర్గ్ సూచించారు. ఇప్పుడందరి దగ్గరా మొబైల్స్ ఉన్నాయి. ..ఫోన్ లో సినిమా తీయండి..మా టైం లో అవి కూడా లేవు కదా అన్నారు.  డ్రామానా, సైఫై నా సంబంధం లేదు..అనిపించింది బాగా చెప్పటానికి ట్రై చేయాలని సూచించారు. బడ్జెట్ ఇవ్వాలి, యాక్టర్స్ ని ఇవ్వాలి అంటే ముందు మనం ప్రూవ్ చేసుకోవాలని కూడా చెప్పారు. ఇంకో ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పారు స్పీల్ బర్గ్ అదేంటంటే...యంగ్ ఫిలిం మేకర్స్ ఎక్స్ పీరియన్స్ వాళ్లతో పని చేస్తున్నప్పుడు ఎక్కువగా మాట్లాడకుండా...వాళ్లేం చేస్తున్నారో చూసి తెలుసుకోవాలని...ఎక్కువ వినటం ఇంపార్టెంట్ అని చెప్పారు.

రాజమౌళి వినటం అనే మాటను గుర్తు పెట్టుకుంటా అన్నారు. ఎప్పుడైనా ఏదైనా సీన్ ఎలా తీయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఏం చేయాలని రాజమౌళి స్పీల్ బర్గ్ ని అఢిగారు. దానికి స్పీల్ బర్గ్ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా...ఎప్పుడూ నీ వీక్ నెస్ ను ఎదుటి వాళ్లకు కనపించనీయకు. ప్రపంచంలో నీకు తెలిసిన విషయాలు చాలా ఉంటాయి. ప్రశాంతంగా ఆలోచిస్తే ఏం చేయాలో నీకే అర్థమవుతందని చెప్పారు.

ఆస్కార్స్ కు  వెళ్లటానికి ఇండియన్ సినిమాల్లో ఎలాంటి మార్పులు చేయాలి...వరల్డ్ వైడ్ ఆడియెన్స్ ఎలాంటి సినిమాలను అప్రిషియేట్ చేస్తారని రాజమౌళి అడిగారు. RRR నాకు నచ్చింది కదా అని సమాధానం ఇచ్చారు స్పీల్ బర్గ్. ప్రపంచం వినాలని కథలు చెప్పకండి...మీ కథలేవో మీరు చెప్పండి నచ్చితే ప్రపంచమే చెవులు రిక్కించి మరీ వింటుందని గొప్ప సలహా ఇచ్చారు. 

22ఆస్కార్ నామినేషన్స్, 3 ఆస్కార్లు ఉన్నవ్యక్తికి నేను ఆల్ ది బెస్ట్ చెప్పలేనన్న రాజమౌళి...ఇండియాకు వస్తే ఫేబుల్ మ్యాన్ సక్సెస్ సెలబ్రేట్ చేసుకుందాం అని కోరారు. దానికి స్పీల్ బర్గ్ 70, 90స్, 2000ల్లో చాలా సార్లు ఇండియాకు వచ్చానని గుర్తు చేసుకున్నారు. 1976 క్లోజ్డ్ ఎనౌ కౌంటర్స్ అనే సినిమాలో చాలా సీన్లు ముంబై పరిసర ప్రాంతాల్లో తీశానని గుర్తు చేసుకున్నరు స్పీల్ బర్గ్.

అయితే ఈసారి హైదరాబాద్ కు రావాలని రాజమౌళి ఆహ్వానించి ఇంటర్వ్యూ ను ఎండ్ చేశారు. మొత్తానికి ఇండియన్ లెజండరీ డైరెక్టర్ రాజమౌళి...హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ స్పీల్ బర్గ్ మధ్య జరిగిన ఈ ఇంటర్వ్యూ మొత్తం రాజమౌళి ఓ స్టూడెంట్ లా పాఠాలు వింటే...స్పీల్ బర్గ్ ఆయన అరవై ఏళ్ల సినిమా ప్రపంచపు అనుభవాల నుంచి చాలా విషయాలను రాజమౌళి ద్వారా ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ కు అందించారు. రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ వాళ్ల యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది మీరూ చూసేయండి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Nara Lokesh: డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
RG Kar Murder Case: ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
Telangana Beer News: తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్ - ఆ  బ్రాండ్ బీర్లకు కొరత లేదు.. రాదు !
తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్ - ఆ బ్రాండ్ బీర్లకు కొరత లేదు.. రాదు !
CM Chandrababu: 'అన్ని దేశాల్లో తెలుగు వాళ్ల ఫుట్ ప్రింట్ ఉంటుంది' - తెలుగు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
'అన్ని దేశాల్లో తెలుగు వాళ్ల ఫుట్ ప్రింట్ ఉంటుంది' - తెలుగు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolkata Doctor Murder Case | కోల్ కతా ట్రైనీ డాక్టర్ కేసులో నిందితుడికి జీవిత ఖైదు | ABP DesamCM Chandrababu CM Revanth Met in Davos | దావోస్ లో కలిసిన చంద్రబాబు, రేవంత్ | ABP DesamAkash Puri Helps Pavala Shyamala | సీనియర్ నటి పావలా శ్యామలకు ఆకాశ్ పూరీ ఆర్థిక సాయం | ABP DesamNita Ambani Saree and jewelry | Trump Swearing Ceremony లో ప్రధాన ఆకర్షణగా నీతా,ముకేశ్ అంబానీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Nara Lokesh: డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
RG Kar Murder Case: ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
Telangana Beer News: తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్ - ఆ  బ్రాండ్ బీర్లకు కొరత లేదు.. రాదు !
తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్ - ఆ బ్రాండ్ బీర్లకు కొరత లేదు.. రాదు !
CM Chandrababu: 'అన్ని దేశాల్లో తెలుగు వాళ్ల ఫుట్ ప్రింట్ ఉంటుంది' - తెలుగు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
'అన్ని దేశాల్లో తెలుగు వాళ్ల ఫుట్ ప్రింట్ ఉంటుంది' - తెలుగు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Mahakumbh Viral Girl Monalisa: కాటుక కళ్ల చిన్నది.. కుంభమేళాను  కట్టిపడేసింది. 
కాటుక కళ్ల చిన్నది.. కుంభమేళాను  కట్టిపడేసింది. 
Nara Lokesh: 'మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం హోదా' - టీడీపీ అధిష్టానం కీలక ఆదేశాలు
'మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం హోదా' - టీడీపీ అధిష్టానం కీలక ఆదేశాలు
CM Chandrababu: 'ఏపీ పెట్టుబడులకు అనుకూలం, భారీగా ఇన్వెస్ట్ చేయండి' - జ్యురిచ్‌లో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు భేటీ
'ఏపీ పెట్టుబడులకు అనుకూలం, భారీగా ఇన్వెస్ట్ చేయండి' - జ్యురిచ్‌లో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు భేటీ
RaghuRama plea on Jagan: జగన్​పై రఘురామకృష్ణ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం
మాజీ సీఎం జగన్​పై రఘురామకృష్ణ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం
Embed widget